Rahane: రహానెకు శుభాకాంక్షల వెల్లువ
close

తాజా వార్తలు

Updated : 06/06/2021 22:33 IST

Rahane: రహానెకు శుభాకాంక్షల వెల్లువ

(photo:AjinkyaRahane Twitter)

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్ఇండియా టెస్టు వైస్‌ కెప్టెన్‌ అజింక్యా రహానె ఆదివారం తన 33వ పుట్టినరోజు జరుపుకొంటున్నాడు. దీంతో అతడికి అభిమానులు, క్రికెటర్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. బీసీసీఐ, ఐసీసీతోపాటు పలు ఐపీఎల్ ఫ్రాంచైజీలు సైతం రహానెకు సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలియజేశాయి.

* హ్యపీ బర్త్ డే జింక్స్‌. నువ్వు ఎంతో ప్రశాంతంగా, ఆనందంగా ఉంటావు. నీతో మరెన్నో చిరస్మరణీయ భాగస్వామ్యాలు ఉండాలి. -టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ

హ్యపీ బర్త్ డే అజింక్యా రహానె. భారత తరఫున మరిన్ని ముఖ్యమైన ఇన్నింగ్స్‌లు ఆడాలని కోరుకుంటున్నాం. -ముంబయి ఇండియన్స్‌

* హ్యపీ బర్త్ డే రహానె. 183 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 7,920 పరుగులు చేశావు. ఇటీవల జరిగిన బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో ఇండియాకు నాయకత్వం వహించి విజయాన్ని అందించావు. -ఐసీసీ

జింక్స్‌ ఆడే కచ్చితమైన క్లాసిక్‌ షాట్ల మాదిరిగానే కచ్చితమైన సమయంలో బర్త్‌ డే శుభాకాంక్షలు. -దిల్లీ క్యాపిటల్స్‌

* 183 మ్యాచ్‌ల్లో 7,920 పరుగులు. ఒక టెస్ట్‌ మ్యాచులో అత్యధిక క్యాచులు. వెరీ హ్యపీ బర్త్‌ డే టెస్ట్ వైస్‌ కెప్టెన్‌. -బీసీసీఐ









Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని