close
మెరిసిన తన్మయ్‌, చైతన్య

రాణించిన అతుల్‌, ఆకాశ్‌, మిలింద్‌, మెహదీ

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: హెచ్‌యూసీసీ బౌలర్‌ అతుల్‌ వ్యాస్‌ (5/70) సత్తాచాటాడు. ఐదు వికెట్లతో చెలరేగాడు. చూడచక్కనైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. అతుల్‌ విజృంభణతో గురువారం సాగర్‌ మైదానంలో అగర్వాల్‌ సీనియర్స్‌ జట్టుతో ఆరంభమైన ఎ- డివిజన్‌ రెండు రోజుల లీగ్‌ క్రికెట్‌ మ్యాచ్‌లో హెచ్‌యూసీసీ పట్టు బిగించింది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన అగర్వాల్‌ సీనియర్స్‌ 42.1 ఓవర్లలో 238 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టులో మొయిజ్‌ దలాల్‌ (68), శశిధర్‌ రావు (76) అర్ధశతకాలతో రాణించారు. అతుల్‌ ధాటికి ఆ జట్టు టపాటపా వికెట్లు కోల్పోయింది. ఆ దశలో క్రీజులో పట్టుదలగా నిలబడ్డ మొయిజ్‌, శశిధర్‌ ఐదో వికెట్‌ 171 పరుగుల కీలక భాగస్వామ్యంతో జట్టును గట్టెక్కించారు. ఐతే కుదురుకొన్నట్లు కనిపించిన ఈ జోడీని విష్ణు (3/45) విడదీశాడు. శశిధర్‌ రావును అతను పెవిలియన్‌ చేర్చాడు. ఆ వెంటనే వికెట్ల పతనం వేగంగా సాగింది.

ఎ- డివిజన్‌ రెండు రోజుల లీగ్‌:
* కరీంనగర్‌: 266 (అజయ్‌ 81, కిశోర్‌ 41, శేఖర్‌ 36, షనవాజ్‌ 34, సాయితేజ 38, రాఘవ 4/52, హుస్సామ్‌ అలీ 3/35, యఘ్నేశ్‌ 2/41), ఎలిగంట్‌ సీసీ;
* అగర్వాల్‌ సీనియర్స్‌: 238 (మొయిజ్‌ దలాల్‌ 68, శశిధర్‌ రావు 76, అతుల్‌ వ్యాస్‌  5/70, విష్ణు 3/45);
* నిజామాబాద్‌: 118 (వంశీ 56, వెంకట్‌ 7/24), టీమ్‌ స్పీడ్‌: 121/2 (కార్తీక్‌ 31, రిషికేష్‌ 33, సూరజ్‌ 2/27);
* శ్రీశ్యామ్‌: 138 (యశ్‌ గుప్తా 31, అక్షయ్‌ 3/21, రుత్విక్‌ 4/15), హెచ్‌బీసీసీ: 142/4 (రుత్విక్‌ యాదవ్‌ 58 నాటౌట్‌, అనంత్‌ప్రీత్‌ సింగ్‌ 53, సయ్యద్‌ హాజి 3/27);
* మెగాసిటీ: 340 (రాకేశ్‌ గౌడ్‌ 71, ప్రదీప్‌ 67, సంతోశ్‌ 51, జైనుద్దీన్‌ ఖాద్రి 4/18), డెక్కన్‌ వండరర్స్‌: 31/2;
* మాంచెస్టర్‌: 233 (వరుణ్‌ 50, ఉదయ్‌ భాస్కర్‌ 30, సాయి చరణ్‌ 5/59, సచిత్‌ నాయుడు 3/54), ఆక్స్‌ఫర్డ్‌ బ్లూస్‌: 84/5 (అభిలాశ్‌ 5/39);
* మహమూద్‌: 184 (వినయ్‌ కుమార్‌ 63, కార్తీక్‌ 38, ఆకాశ్‌ కుమార్‌ 3/47, విశాల్‌ సింగ్‌ 6/46), గ్రీన్‌ టర్ఫ్‌: 185/3 (మనీశ్‌ చౌదరీ 100, శశాంక్‌ లోకేశ్‌ 38 నాటౌట్‌);

మూడు రోజుల లీగ్‌:
* ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ తొలి ఇన్నింగ్స్‌: 131, రెండో ఇన్నింగ్స్‌: 94/1 (ఎంఎస్‌ఆర్‌ చరణ్‌ 32, అక్షత్‌ రెడ్డి 38 బ్యాటింగ్‌), స్పోర్టింగ్‌ ఎలెవన్‌ తొలి ఇన్నింగ్స్‌: 429 (తనయ్‌ త్యాగరాజన్‌ 137, తన్మయ్‌ అగర్వాల్‌ 117, వాసిల్‌ సర్తాజ్‌ 77, సందీప్‌ 3/44);
* ఈఎంసీసీ తొలి ఇన్నింగ్స్‌: 85, రెండో ఇన్నింగ్స్‌: 152 (సూరజ్‌ 42, సీవీ మిలింద్‌ 4/12), డెక్కన్‌ క్రానికల్స్‌ తొలి ఇన్నింగ్స్‌: 149 (అజయ్‌ దేవ్‌గౌడ్‌ 6/40), రెండో ఇన్నింగ్స్‌: 4/0;
* ఆర్‌.దయానంద్‌: 245, ఆంధ్ర బ్యాంకు: 347/4 (రొనాల్డ్‌ రోడ్రిగ్స్‌ 48, నవీన్‌ రెడ్డి 110, పీఎస్‌ చైతన్య రెడ్డి 70, అభినవ్‌ కుమార్‌ 45 బ్యాటింగ్‌, అమోల్‌ షిండే 53 బ్యాటింగ్‌);
* ఎస్‌బీఐ: 269, జై హనుమాన్‌: 268 (శశిధర్‌ రెడ్డి 64, అనిరుధ్‌ రెడ్డి 59, రోహిత్‌ రాయుడు 47, వినీత్‌ రెడ్డి 39, ఆకాశ్‌ భండారి 4/101);
* ఎస్‌సీఆర్‌ఎస్‌ఏ: 506/8 డిక్లేర్డ్‌ (శ్యామ్‌ సుందర్‌ 72, కమ్‌రుద్దీన్‌ 102, సుధాకర్‌ 51 నాటౌట్‌, సాధన్‌ 3/134, ముదాసిర్‌  3/97), బీడీఎల్‌: 150/7 (ప్రతీక్‌ రెడ్డి 67, సురేశ్‌ 6/57);
* హైదరాబాద్‌ బాట్లింగ్‌: 480 (హర్ష్‌ 96, జయసూర్య 62, రాధాకృష్ణ 67, వినయ్‌ గౌడ్‌ 32, అలీమ్‌ 6/112, సంహిత్‌ రెడ్డి 3/46), కాంటినెంటల్‌: 80/0 (ప్రత్యూష్‌ రెడ్డి 43 నాటౌట్‌);
* ఎంపీ కోల్ట్స్‌: 553 (నిఖిల్‌ పర్వాని 157, కృష్ణ చరిత్‌ 81, మయాంక్‌ గుప్తా 4/148, అనికేత్‌ రెడ్డి 3/161), ఎవర్‌గ్రీన్‌: 123/2 (రోహిత్‌ 46, రాహుల్‌ 63 బ్యాటింగ్‌);
* కేంబ్రిడ్జ్‌ ఎలెవన్‌: 453 (ఆశిష్‌ 43, అనూజ్‌ 34, మల్లిఖార్జున్‌ 3/66, ఉమర్‌ 3/133, సయ్యద్‌ అలీ 3/123), ఇండియా సిమెంట్స్‌: 148/6 (శ్రేయస్‌ 72, ఉమర్‌ ఖాన్‌ 37, అనూజ్‌ 3/22);
* ఎన్‌స్కాన్స్‌ తొలి ఇన్నింగ్స్‌: 255, రెండో ఇన్నింగ్స్‌: 95/5 (అస్కారి 37 బ్యాటింగ్‌), ఏఓసీ: 302 (సుఫియాన్‌ 76, శివమ్‌ తివారి 95, సుమిత్‌ సింగ్‌ 42, మోహిత్‌ కుమార్‌ 70, సయ్యద్‌ మెహదీ హసన్‌ 5/70)

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.