Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144446
            [news_title_telugu_html] => 

బ్యాటింగ్‌ కోచ్‌:బంగర్‌ X విక్రమ్‌

[news_title_telugu] => బ్యాటింగ్‌ కోచ్‌:బంగర్‌ X విక్రమ్‌ [news_title_english] => Sanjay Bangar on edge of batting coach position with Vikram Rathour [news_short_description] => టీమిండియా ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి తిరిగి ఎంపికవ్వగా.. ఈ రోజు నుంచి బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ కోచ్‌ల ఎంపికను చేపటనున్నారు. బీసీసీఐ సలెక్షన్‌ కమిటీ ఛైర్మన్‌... [news_tags_keywords] => Cricket ,Team India ,Team India Coach,Ravi Shastri ,Sanjay Bangar [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-19 12:51:38 [news_isactive] => 1 [news_status] => 2 ) )
బ్యాటింగ్‌ కోచ్‌:బంగర్‌ X విక్రమ్‌ - Sanjay Bangar on edge of batting coach position with Vikram Rathour - EENADU
close

తాజావార్తలు

బ్యాటింగ్‌ కోచ్‌:బంగర్‌ X విక్రమ్‌

నేటి నుంచి బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ కోచ్‌ల ఎంపిక

ముంబయి: టీమిండియా ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి తిరిగి ఎంపికవ్వగా.. ఈ రోజు నుంచి బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ కోచ్‌ల ఎంపికను చేపటనున్నారు. బీసీసీఐ సలెక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలో ఈ మూడు విభాగాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. కాగా బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌, ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌ శ్రీధర్‌ తమ ఎంపికలపై ధీమాతో ఉండగా బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ పరిస్థితి అయోమయంలో పడింది. అతడికి టీమిండియా మాజీ ఓపెనర్‌(టెస్టుల్లో) విక్రమ్‌ రాథోర్‌తో గట్టి పోటీ ఎదురుకానుందని తెలుస్తోంది. 2021 టీ20 ప్రపంచకప్‌ వరకూ రవిశాస్త్రి ప్రధాన కోచ్‌గా కొనసాగుతుండగా.. అతడి సహాయ బృందాన్నే కొనసాగించడం సహేతుకంగా ఉంటుందని క్రికెట్‌ విశ్లేషకుల భావన. అందుకు తగ్గట్టే సంజయ్ బంగర్‌, భరత్‌ అరుణ్‌, ఆర్‌. శ్రీధర్‌ల పర్యవేక్షణలో భారత ఆటగాళ్లు మూడు విభాగాల్లో మంచి ప్రదర్శన కనబరిచారని వారి అభిప్రాయం. 

ఇదిలా ఉండగా బంగర్‌ ఇటీవల ఓ మీడియాతో మాట్లాడుతూ.. బ్యాటింగ్‌ కోచ్‌గా కొనసాగేందుకు తాను చేయాల్సిందంతా చేశానని, ప్రస్తుత పరిస్థితుల్లో తనపై ఉన్న తీవ్ర ఒత్తిడే తిరిగి కొనసాగడంపై ప్రభావం చూపుతుందని చెప్పాడు. బంగర్‌ 2014 నుంచి టీమిండియాకి బ్యాటింగ్‌ కోచ్‌గా వ్యవహరించాడు. అతడి పర్యవేక్షణలో భారత జట్టు మొత్తం 50 టెస్టులు, 119 వన్డేలు ఆడగా.. బ్యాట్స్‌మెన్‌ టెస్టుల్లో 69 శతకాలు, వన్డేల్లో 72 శతకాలు సాధించడం విశేషం. మరోవైపు విక్రమ్‌ రాథోర్‌ 1990ల్లో టీమిండియా తరఫున ఆరు టెస్టులు, ఏడు వన్డేలు ఆడిన అనుభవం ఉంది. అది కాకుండా భారత దిగ్గజ ఆటగాడు రాహుల్‌ ద్రవిడ్‌ మద్దతు కూడా ఉండటం విశేషం. ఈ ఏడాది ఆరంభంలో రాథోర్‌ అండర్‌ 19, ఇండియా ఎ జట్లకు బ్యాటింగ్‌ కోచ్‌గా ఎంపికవ్వాల్సి ఉండగా అతడి బావ, మాజీ క్రికెటర్‌ ఆశిష్‌ కపూర్‌ జూనియర్‌ సెలక్షన్‌ కమిటీ బాధ్యతలు చేపడుతున్నందున పరస్పర విరద్ధ ప్రయోజనాల కింద అతడికి అవకాశం దక్కలేదు.

టీమిండియా బ్యాటింగ్‌ కోచ్‌ పదవికి భారత దేశం నుంచి విక్రమ్‌రాథోర్‌ కాకుండా, రాబిన్‌ సింగ్‌, మిథున్‌ మన్హాస్‌, ప్రవీణ్‌ ఆమ్రే, అమోల్‌ ముజుమ్‌దార్‌, హృషికేశ్‌ కనిక్తర్‌, లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌ దరఖాస్తు చేసుకున్నారు. విదేశీయుల్లో ఇంగ్లాండ్‌ మాజీ బ్యాట్స్‌మెన్‌ జొనాథన్‌ ట్రాట్‌, మార్క్‌ రాంప్రకాశ్‌లు ఉన్నారు. ఇక బౌలింగ్‌ కోచ్‌ విషయంలో భరత్‌ అరుణ్‌కు గట్టి పోటీనిచ్చేది మాజీ బౌలర్‌ వెంకటేశ్‌ ప్రసాద్. మాజీ స్పిన్నర్‌ సునీల్‌ జోషి కూడా రేసులో ఉన్నాడు. ఫీల్డింగ్‌ విభాగంలో దక్షిణాఫ్రికా స్టార్‌ ఫీల్డర్‌ జాంటీ రోడ్స్‌ దరఖాస్తు చేసుకోగా శ్రీధర్‌కు గట్టి పోటీ ఉండనుంది. ఈ మూడు పదవులకు ఎక్కువ దరఖాస్తులు రావడంతో ఇంటర్వ్యూల ప్రక్రియ మూడు, నాలుగు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా రవిశాస్త్రిని కోచ్‌గా ఎంపిక చేసిన క్రికెట్‌ సలహా కమిటీ.. వీరిని కూడా ఎంపిక చేసేందుకు తమకు అవాకశమివ్వాలని బీసీసీఐ పాలక మండలిని అడిగింది. ఈ నేపథ్యంలో కపిల్‌, అన్షుమాన్‌, శాంతా రంగస్వామిలు ఈ ఇంటర్వ్యూల్లో పాలుపంచుకుంటారా లేదా అనే విషయాలు తెలియాల్సి ఉంది. 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.