close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉంచండి

ఈనాడు, హైదరాబాద్‌: వచ్చే నెల నుంచి వానాకాలం (ఖరీఫ్‌) సీజన్‌ ప్రారంభమవుతున్నందున విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉంచాలని అన్ని జిల్లాల వ్యవసాయాధికారులను (డీఏవోలను) వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం ఆయన జూమ్‌ ద్వారా డీఏవోలతో మాట్లాడారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా డీలర్లు, పీఏసీఎస్‌ల వద్ద 3.75 లక్షల టన్నుల యూరియా నిల్వలున్నట్లు చెప్పారు. ఈ నెల రెండో వారానికల్లా విత్తనాల అమ్మకాలు ప్రారంభమవుతాయన్నారు. పత్తి విత్తనాలకు కొరత లేదని చెప్పారు. పచ్చిరొట్ట విత్తనాల ధరలపై 65 శాతం రాయితీ ఇస్తున్నామని.. వాటిని రైతులు కొని వాడేలా చూడాలన్నారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు