రైతులు ముందుకొస్తే ప్రోత్సహిస్తాం
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రైతులు ముందుకొస్తే ప్రోత్సహిస్తాం

చక్కెర కర్మాగారంపై వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి

కోరుట్ల గ్రామీణం, న్యూస్‌టుడే: రైతులు సహకార సొసైటీగా ఏర్పడి చక్కెర కర్మాగారం ఏర్పాటుకు ముందుకు వస్తే ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి తెలిపారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో గురువారం ఆయన వ్యవసాయశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముత్యంపేట చక్కెర కర్మాగారం ప్రారంభించకపోవడంతో రైతులు అసంతృప్తితో ఉన్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన మంత్రి మాట్లాడుతూ.. మహారాష్ట్రలో 27 వేల మంది రైతులు సహకార సొసైటీగా ఏర్పడి వారి వాటా ధనంతోనే కర్మాగారం నడిపిస్తున్నారని చెప్పారు. అందులో వచ్చిన లాభాలను సభ్యులే పంచుకోవడం జరుగుతుందన్నారు. అందులో ఉత్పత్తయిన విద్యుత్తును ప్రభుత్వం కొనుగోలు చేస్తోందన్నారు. ప్రైవేట్‌ ఫ్యాక్టరీలు చెరకు కొనుగోలు చేస్తే రైతులకు గిట్టుబాటు ధర లభించదని అన్నారు. సహకార సొసైటీల ఏర్పాటుకు ఎమ్మెల్యేలు చొరవ చూపాలని కోరారు. ఆత్మ పథకం కింద మహారాష్ట్ర చెరకు కర్మాగారం సందర్శనకు ఇక్కడి రైతులను తీసుకెళ్లాలని అధికారులకు మంత్రి సూచించారు.


 


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు