అనర్హులకు ఇళ్లు కేటాయిస్తే వేటు
close

ప్రధానాంశాలు

అనర్హులకు ఇళ్లు కేటాయిస్తే వేటు

అధికారులకు కేటీఆర్‌ హెచ్చరిక

సిరిసిల్ల పట్టణం, న్యూస్‌టుడే: నిరుపేదలు, కిరాయి ఇళ్లలో, గుడిసెల్లో ఉండేవారే రెండు పడక గదుల ఇళ్లకు అర్హులని పురపాలకశాఖ మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. సొంతిల్లున్నవారికీ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కేటాయిస్తే సంబంధిత అధికారిపై సస్పెన్షన్‌ వేటు తప్పదని ఆయన హెచ్చరించారు. త్వరలో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో సోమవారం కేటీఆర్‌.. రాజన్న సిరిసిల్ల జిల్లాను ఆకస్మికంగా సందర్శించారు. తంగళ్లపల్లి మండలం మండెపల్లి వద్ద రెండు పడక గదుల ఇళ్లను, అంతర్జాతీయ డ్రైవింగ్‌ స్కూల్‌, ఇందిరమ్మ కాలనీ బైపాస్‌రోడ్డు నిర్మాణం, సిరిసిల్లలోని నర్సింగ్‌ కళాశాల, నూతన సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని మంత్రి పరిశీలించారు. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లా పర్యటనకు వస్తున్నారని, ఆరోజు 15 మందికి ఆయన ఇళ్ల మంజూరు పత్రాలు అందజేస్తారని, మండెపల్లిలో 1300 ఇళ్లను ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని