చంద్రబాబు నివాసం వద్ద దాడి ఘటనలో నోటీసులు

ప్రధానాంశాలు

చంద్రబాబు నివాసం వద్ద దాడి ఘటనలో నోటీసులు

తాడేపల్లి, న్యూస్‌టుడే: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి వద్ద వైకాపా, తెదేపా వర్గీయులు ఇటీవల పరస్పరం దాడులు చేసుకున్న ఘటనపై తాడేపల్లి పోలీసుస్టేషన్‌లో నమోదైన కేసులకు సంబంధించి పోలీసులు విచారణ ప్రారంభించారు. తెదేపాకు చెందిన నాయకులు, కార్యకర్తలకు సీఆర్పీసీ 41ఎ కింద శనివారం రాత్రి నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని తెలిపారు. కోర్టు అనుమతి లేకుండా పోలీసులకు తెలియకుండా ఇతర ప్రాంతాలకు వెళ్లకూడదని సూచించారు. ఆదివారం మంగళగిరిలోని ఉత్తర మండల డీఎస్పీ కార్యాలయంలో ఉండవల్లికి చెందిన తెదేపా నాయకుడు తమ్మా శంకరరెడ్డి విచారణకు హాజరయ్యారు. నిందితులతోపాటు సాక్షులకు కూడా నోటీసులు జారీ చేశారు. నిందితులను గుర్తించేందుకు ఫొటోలు, వీడియో దృశ్యాలను పరిశీలించి కేసులు నమోదు చేస్తున్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని