Facebook: ఫేస్‌బుక్ పేజీ రీడిజైన్‌ అయ్యింది.. గమనించారా?
close

Published : 08/10/2021 21:10 IST

Facebook: ఫేస్‌బుక్ పేజీ రీడిజైన్‌ అయ్యింది.. గమనించారా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఫేస్‌బుక్‌ తన పేజీలో కొత్త మార్పులు తీసుకురానుంది. పబ్లిక్‌, ప్రైవేట్‌ ప్రొఫైల్స్‌ మధ్య వ్యత్యాసాన్ని తేలికగా గుర్తించేలా అడుగులు వేస్తోంది. ఫేస్‌బుక్‌లో పేజ్‌ సెక్షన్స్‌ను రీడిజైన్‌ చేస్తున్నట్లు వెల్లడించింది. ఫేస్‌బుక్‌లో ఉండే ప్రొఫైల్స్‌, పేజీలకు చాలా మార్పులు తీసుకువస్తున్నట్లు తెలిపింది. ముఖ్యంగా బిజినెస్‌, బ్రాండ్స్‌, బడా సంస్థలు, సెలబ్రెటీలు తమకు సంబంధించిన విషయాలను ఫేసుబుక్‌లో పంచుకునేందుకే పేజీని ప్రవేశపెట్టారన్న సంగతి తెలిసిందే. మరి ఆ ఫేస్‌బుక్‌ పేజీల్లోనే..మార్పులు తెచ్చేలా కొత్త ఫేస్‌బుక్‌ డిజైన్‌ను తీసుకురానుంది. నేటి ట్రెండ్స్‌కి అనుగుణంగా వ్యాపారాలకు లబ్ధి చేకూరేలా దీన్ని తీర్చిదిద్దనుంది. యూజర్లు కూడా వారి ఇష్టాలను బట్టి వారికి నచ్చిన అంశాలను న్యూస్‌ఫీడ్‌లో కనిపించేలా చేయడం దీని ముఖ్య ఉద్దేశం. ట్రెండింగ్‌ కంటెంట్‌, గ్రూప్స్‌, పేజీలు, సెలబ్రెటీలకు సంబంధించిన కొత్త పరిచయాలు న్యూస్‌ఫీడ్లో కనిపించనున్నాయి. అంతేకాకుండా  ద్వేషపూరిత ప్రసంగం, హింసాత్మక, లైంగిక, స్పామ్‌ వంటివి జరగకుండా గుర్తించడానికి మెరుగైన భద్రతను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇక అధికారిక గుర్తింపు పొందిన పేజీలే ఎక్కువగా ఫేస్‌బుక్‌ దర్శనమియ్యనున్నాయి. 

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న