
తాజా వార్తలు
పట్టుకున్న పోలీసు, ఆబ్కారీ అధికారులు
గంజాయిని పరిశీలిస్తున్న ఎస్పీ విష్ణువారియర్, డీఎస్పీ వెంకటేశ్వరరావ్, ఆబ్కారీ సూపరింటెండెంట్ రవీందర్‌రాజు
బజార్హత్నూర్, న్యూస్‌టుడే: బజార్హత్నూర్ మండలంలో కొన్ని రోజులుగా గుట్టుగా సాగుతున్న గంజాయి సాగు దందాను పోలీసు, ఆబ్కారీ అధికారులు ఛేదించారు. దాదాపు 1200 మొక్కలు, రూ.6 లక్షల విలువగల గంజాయిని గుర్తించి వాటిని ధ్వంసం చేసిన ఘటన బుధవారం మండలంలో సంచలనం రేకెత్తించింది. ఇటీవల తుకాన్పల్లి గ్రామంలో అంతరపంటగా సాగుచేస్తున్న గంజాయి రెండు రోజుల కిందటే పట్టుకున్నారు. తాజాగా ఇదే మండలంలోని మోర్కండి గ్రామపంచాయతీ శివారు పంటపొలాల్లో అంతరపంటగా గుట్టుచప్పుడు కాకుండా అక్కడి పలువురు రైతులు గంజాయి సాగు చేస్తున్నారు. పోలీసులకు అందిన ముందస్తు సమాచారం మేరకు దాడిచేసి ఈ అక్రమసాగును గుట్టురట్టు చేశారు. సీఐ మల్లేష్, ఆబ్కారీ సీఐ రాజమౌళి తెలిపిన వివరాల ప్రకారం.. పత్తిపంటలో అంతరపంటగా గంజాయిని సాగు చేస్తున్న సర్పె గంగారాం, కుమురం గుణవంత్‌రావ్, కాంబ్లె జయవంత్రావ్, తొడసం క్రిష్ణలపై కేసు నమోదు చేశారు. కార్యక్రమంలో ఎస్సై ఉదయ్‌కుమార్, సిబ్బంది అమృత్‌రెడ్డి, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.
పత్తి పంటలో అంతరపంటగా ఉన్న గంజాయిసాగును గుర్తించిన సీఐ మల్లేష్, ఎస్సై ఉదయ్‌కుమార్
అక్రమ దందాలకు పాల్పడితే కఠిన చర్యలు
- ఎస్పీ విష్ణువారియర్
అక్రమ దందాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ విష్ణువారియర్ పేర్కొన్నారు. గంజాయి సాగు ప్రదేశాన్ని బుధవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. మారుమూల గ్రామాల్లో అమాయక ప్రజల్ని మోసం చేస్తూ గుడుంబా, గంజాయి సాగుకు పాల్పడితే సహించేదిలేదని హెచ్చరించారు. గంజాయి సాగులో పూర్తి విచారణ జరిపించి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఆయన వెంట ఆబ్కారీశాఖ సూపరింటెండెంట్ రవిందర్రాజు, డీఎస్పీ వెంకటేశ్వరరావ్ పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- చెప్పేస్తుందేమోనని.. చంపేశారు
- ఏమీ లేని స్థితిని చూసిన వాణ్ని
- 22 ఏళ్లకే ఐపీఎస్ అధికారి..!
- నలుదిశలా ఐటీ
- సీఎం సర్.. మా నాన్నకు జీతం పెంచండి!
- భారతా.. విండీసా.. వరుణుడా.. ఆరంభమెవరిదో?
- బాపట్లలో వింత శిశువు జననం
- ఒక కాలు పోయినా.. పాకిస్థాన్‌పై ఆడతా
- స్కైన్యూస్ నుంచి హెచ్‌సీఎల్ సీఈవోగా..
- కోహ్లీ అరుదైన రికార్డుకు రోహిత్ పోటీ!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
