ప్రభుత్వ ఉద్యోగాలు

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) వివిధ కేంద్ర మంత్రిత్వశాఖల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 15 Nov 2021 06:41 IST

యూపీఎస్సీ - 36 పోస్టులు

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) వివిధ కేంద్ర మంత్రిత్వశాఖల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 36 పోస్టులు: ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, జాయింట్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ తదితరాలు. విభాగాలు: ఎల‌్రక్టికల్‌ ఇంజినీరింగ్‌, ఎల‌్రక్టానిక్స్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ తదితరాలు. అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ, అనుభవం. ఎంపిక విధానం: రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: 2021, డిసెంబరు 02.  వెబ్‌సైట్‌: www.upsc.gov.in/


ఏపీ ఇండస్ట్రీస్‌, విజయవాడలో...

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 23 పోస్టులు: జూనియర్‌ అసిస్టెంట్‌, రికార్డ్‌ అసిస్టెంట్‌,  ఆఫీస్‌ సబార్డినేట్‌, వాచ్‌మెన్‌, స్వీపర్‌. అర్హత: పోస్టుల్ని అనుసరించి తెలుగులో చదవడం, రాయడం, ఐదో తరగతి, ఏడో తరగతి, ఇంటర్మీడియట్‌, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి. వయసు: 01.10.2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: 2021, నవంబరు 20.
వెబ్‌సైట్‌:www.apindustries.gov.in/


బీఎస్‌ఎఫ్‌లో 62 గ్రూప్‌ సీ పోస్టులు

భారత ప్రభుత్వ హోంమంత్రిత్వ శాఖకు చెందిన బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(బీఎస్‌ఎఫ్‌) డైరెక్టరేట్‌ జనరల్‌ కార్యాలయం కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 62 పోస్టులు: ఏఎస్‌ఐ, హెచ్‌సీ, ప్లంబర్‌, కార్పెంటర్‌,  కానిస్టేబుల్‌. అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత. వయసు: 18 నుంచి 25 ఏళ్లు మించకూడదు. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. చివరి తేది: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 45 రోజుల్లోపు.
వెబ్‌సైట్‌: https://rectt.bsf.gov.in/


ప్రవేశాలు
నీట్‌ లాంగ్‌టర్మ్‌ ఉచిత శిక్షణ

హైదరాబాద్‌ (మాసబ్‌ట్యాంక్‌)లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) 2021-2022 విద్యాసంవత్సరానికి ఎస్సీ/ ఎస్టీ విద్యార్థులకు ఉచిత నీట్‌ లాంగ్‌టర్మ్‌ శిక్షణ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
ఎస్సీ/ ఎస్టీ విద్యార్థులకు ఉచిత నీట్‌ లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌ (ఎంబీబీఎస్‌, బీడీఎస్‌)
అర్హత: ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత, నీట్‌ 2021 పరీక్ష రాసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. శిక్షణ ప్రదేశం: టీఎస్‌డబ్ల్యూఆర్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌, గౌలిదొడ్డి. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: 2021, నవంబరు 20. 
 వెబ్‌సైట్‌: https://tswreis.in/


వాక్‌-ఇన్స్‌
డీఎంహెచ్‌ఓ, పశ్చిమ గోదావరిలో....

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన పశ్చిమ గోదావరి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (డీఎంహెచ్‌ఓ) కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.
* స్పెషలిస్ట్‌ డాక్టర్లు
మొత్తం ఖాళీలు: 90 స్పెషలైజేషన్లు: అబ్‌స్టెట్రిక్స్‌ అండ్‌ గైనకాలజీ, జీరియాట్రిక్‌, ఈఎన్‌టీ, పీడియాట్రిక్స్‌, చెస్ట్‌, ఎన్‌సీడీ తదితరాలు. అర్హత: ఎంబీబీఎస్‌తో పాటు సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్‌ పీజీ డిగ్రీ (ఎండీ/ ఎంఎస్‌) ఉత్తీర్ణత. ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి. జీతభత్యాలు: నెలకు రూ.1,10,000 చెల్లిస్తారు. వాక్‌ఇన్‌ తేది: 2021, నవంబరు 16. వేదిక: డీఎంహెచ్‌ఓ, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఏపీ.
వెబ్‌సైట్‌: https://westgodavari.ap.gov.in/


అప్రెంటిస్‌షిప్‌
1785 అప్రెంటిస్‌ ఖాళీలు

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన కోల్‌కతా ప్రధానకేంద్రంగా ఉన్న సౌత్‌ ఈస్టర్న్‌ రైల్వే వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 1785 ట్రేడులు: ఫిట్టర్‌, టర్నర్‌, ఎల‌్రక్టీషియన్‌, వెల్డర్‌, మెకానిక్‌, మెషినిస్ట్‌, పెయింటర్‌, కేబుల్‌ జాయింటర్‌ తదితరాలు. అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత. వయసు: 01.01.2022 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌ ప్రాతిపదికన ఎంపిక. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2021, నవంబరు 15. దరఖాస్తులకు చివరితేది: 2021, డిసెంబరు 14.
వెబ్‌సైట్‌: www.rrcser.co.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని