భర్తకు భార్య ఎడమవైపే ఉండాలా?

భర్త చేసే కొన్ని ధార్మిక కార్యక్రమాల్లో భార్య అతడికి ఎడమవైపున ఉండాలని పెద్దలు సూచించారు.

Published : 14 Mar 2024 00:04 IST

ర్త చేసే కొన్ని ధార్మిక కార్యక్రమాల్లో భార్య అతడికి ఎడమవైపున ఉండాలని పెద్దలు సూచించారు.

అభిషేకే రథారోహే, దంపతే శయనే తథా
శ్రద్ధే స్నాన తథా దానే, పత్నీ తిష్టతి వామతః

ఈ శ్లోకం ప్రకారం పూజాకార్యక్రమాలు, ప్రయాణాల్లో, శయనించేటప్పుడు, దాన ధర్మాలు చేసే సమయంలో భార్య భర్తకు ఎడమవైపున ఉండాలి. కానీ వివాహ సమయంలో, కన్యాదానం చేసేటప్పుడు, విగ్రహ ప్రతిష్ట, యజ్ఞయాగాదుల సమయాల్లో భార్య కుడివైపున ఉండాలని నిర్దేశించారు.

బ్రహ్మదేవుడు తాను సృష్టిని ప్రారంభించినప్పుడు తన కుడి భాగం నుంచి పురుషుణ్ణి, ఎడమ భాగం నుంచి స్త్రీని సృష్టించాడట. శరీరంలో అతి ముఖ్యమైన గుండె స్థానం ఎడమవైపునే కనుక పురుషుడికి స్త్రీ ఎడమవైపున ఉండాలంటారు. అర్ధాంగిని తన హృదయంలో స్థిరపరచుకోవాలని చెప్పడమే ఇందులోని ఔచిత్యం, అంతరార్థం అంటారు పెద్దలు. అర్ధనారీశ్వరుడైన శివుడికి పార్వతీదేవి ఎడమభాగంలోనే ఉంటుంది కదా! ఆలుమగలు నిద్రించే సమయంలో అతడు ఆమెపై కుడి చెయ్యివేసి రక్షణగా ఉండాలంటారు. 

పులిగండ్ల చిదంబరం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని