పంచ మహాయజ్ఞాలు

యజ్ఞం అనగానే సాధారణంగా వేదబ్రాహ్మణులు చేసే క్రతువే మనకు స్ఫురిస్తుంది. కానీ మన ధర్మగ్రంథాలు దేవ, పితృ, భూత, మనుష్య, బ్రహ్మ- అనే పంచ మహాయజ్ఞాలను ప్రస్తావించాయి. వాటిని అందరూ పాటించాలని ప్రబోధించాయి.

Published : 04 Apr 2024 00:13 IST

జ్ఞం అనగానే సాధారణంగా వేదబ్రాహ్మణులు చేసే క్రతువే మనకు స్ఫురిస్తుంది. కానీ మన ధర్మగ్రంథాలు దేవ, పితృ, భూత, మనుష్య, బ్రహ్మ- అనే పంచ మహాయజ్ఞాలను ప్రస్తావించాయి. వాటిని అందరూ పాటించాలని ప్రబోధించాయి.

దేవయజ్ఞం : నిత్యం భగవంతుడికి పూజ చేసి, ధూప హారతి, కర్పూర హారతి ఇవ్వటం వల్ల దేవతలు తృప్తి చెందుతారు. ఇది దేవయజ్ఞం. సృష్టి కారకుడైన ఆ సర్వేశ్వరుణ్ణి తలచుకొని కృతజ్ఞతలు చెప్పటమే దీని ముఖ్యోద్దేశం.

పితృయజ్ఞం : మన జన్మ, పురోభివృద్ధికి కారకులైన తల్లిదండ్రులను ప్రేమాదరణలతో చూసుకోవడం పితృయజ్ఞం. వారి రుణం తీర్చుకోవటానికి చేసే క్రతువిది. అలాగే మరణించిన తాతముత్తాతలు, వంశీయులు మనకు పితృదేవతలు. వారి పేరిట చేసే దానధర్మాలు కూడా పితృయజ్ఞంలో భాగమే.

భూతయజ్ఞం: పశుపక్ష్యాదులు, క్రిమి కీటకాలు మన మీద ఆధారపడి ఉన్నాయి. భూతదయతో వాటి సంరక్షణపై శ్రద్ధ వహించాలి. మూగజీవాలకు అపకారం తలపెట్టకపోవటం, వాటిపై ప్రేమ, ఆదరణ చూపటం భూతయజ్ఞం.

మనుష్య యజ్ఞం: అతిథి, అభ్యాగతులను ఆదరించటం మనుష్య యజ్ఞం. ఉన్నదాన్ని ఇరుగుపొరుగు వారితో పంచుకోవటం ధర్మం. మన శక్తి సామర్థ్యాలకు తగ్గట్లు అవసరంలో ఉన్నవారికి సేవచేయటం ఈ యజ్ఞ లక్ష్యం.

బ్రహ్మయజ్ఞం: వేదాలు, రామాయణ, భారత, భాగవతాలను పఠించటం బ్రహ్మయజ్ఞం. దీనికి రుషియజ్ఞం అని కూడా పేరు. స్వాధ్యాయం చేయటం కూడా ఇందులో భాగమే! ధార్మిక గ్రంథాలను చదవడం, వినడం స్వాధ్యాయమే!

చక్రి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని