ఏ పూలు ఏ దైవానికి?

ఒక్కో దైవానికి ఒక్కో పుష్పం ప్రియమని మన ధర్మం నిర్ధారించింది. పుష్పచింతామణి, కులార్ణవ తంత్రం, శారదా తిలకం వంటి గ్రంథాల్లో ఈ అంశానికి సంబంధించిన వివరాలున్నాయి. మల్లె, సన్న జాజి, మొగలి, సంపెంగ, సురపొన్న, పొగడ, తామర, కలువ, తెల్లగన్నేరు, జమ్మి, అశోకం, గులాబీ, పచ్చగోరింట, దేవకాంచనం, ఎర్రదేవకాంచనం, ఎర్రగన్నేరు, నల్లకలువ, మామిడిపూత, నాగకేసరాలు శ్రీమహావిష్ణువుకు, ఆయన ప్రతిరూపమైన వేంకటేశ్వరుని పూజకు అర్హమైన పూలు.

Published : 21 Mar 2024 00:08 IST

మీకు తెలుసా

క్కో దైవానికి ఒక్కో పుష్పం ప్రియమని మన ధర్మం నిర్ధారించింది. పుష్పచింతామణి, కులార్ణవ తంత్రం, శారదా తిలకం వంటి గ్రంథాల్లో ఈ అంశానికి సంబంధించిన వివరాలున్నాయి. మల్లె, సన్న జాజి, మొగలి, సంపెంగ, సురపొన్న, పొగడ, తామర, కలువ, తెల్లగన్నేరు, జమ్మి, అశోకం, గులాబీ, పచ్చగోరింట, దేవకాంచనం, ఎర్రదేవకాంచనం, ఎర్రగన్నేరు, నల్లకలువ, మామిడిపూత, నాగకేసరాలు శ్రీమహావిష్ణువుకు, ఆయన ప్రతిరూపమైన వేంకటేశ్వరుని పూజకు అర్హమైన పూలు. అలాగే విష్ణుమూర్తికి, శ్రీనివాసుడికి అన్నిటికన్నా ఎక్కువ ప్రీతికరమైనవి తులసీదళాలు.

శివార్చనకు గన్నేరు, జిల్లేడు, మందారం, జమ్మి, పొగడ, మోదుగ, ఇప్ప, వెంపలి, మారేడు, ఉత్తరేణి, అశోకం, ఉమ్మెత్త, కొండగోగు, కడిమి, నల్లగోరింట, సురపొన్న, ఎర్రగోరింట, ఎర్రదేవకాంచనం, సంపెంగ, మల్లి, జాజి, తుమ్మి, పద్మం, తెల్ల కలువ, నల్ల కలువ, తులసిదళాలు అర్హమైనవి. అలాగే సూర్యభగవానుడిని, విఘ్నేశ్వరుణ్ని పూజించటానికి తెల్లజిల్లేడు పువ్వులు శుభకరం. శ్రీమహాలక్ష్మిని ప్రత్యేకంగా తామర పూలతో పూజించాలి. గాయత్రీదేవిని మల్లె, కొండమల్లె, పొగడ, మందార, జిల్లేడు, పున్నాగ, చంపక, గరిక పుష్పాలతో పూజించటం శ్రేయస్కరమని చెబుతారు.

దేవతా స్వరూపమైన శ్రీచక్రాన్ని తులసీదళాలు, తామర, కలువ, జాజి, మల్లె, ఎర్రగన్నేరు, ఎర్రకలువ, పున్నాగ పుష్పాలతో పూజిస్తారు. నవగ్రహాల్లో సూర్యుణ్ణి పచ్చ గన్నేరులతో, చంద్రుణ్ణి కలువలతో, కుజుణ్ణి దాసాని పూలతో, బుధుణ్ణి సంపెంగలతో, గురుగ్రహాన్ని పద్మాలతో, శుక్రుణ్ణి జాజిపూలతో, శనిదేవుణ్ణి మల్లెలతో, రాహువును మొల్లలతో, కేతువును వివిధ పుష్పాలతో పూజించాలి.

చైతన్య


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని