అకాలమృత్యువు ఎందుకు?

ఒకసారి ధృతరాష్ట్రుడు విదురుణ్ణి ఉద్దేశించి- ‘సోదరా! మన ధర్మశాస్త్రాలు మనిషి ఆయువు నూరు సంవత్సరాలని చెప్పాయి కదా! కానీ చాలామంది అంత వయసు రాకుండానే అకాల మృత్యువును పొందుతున్నారు.

Published : 11 Apr 2024 00:06 IST

కసారి ధృతరాష్ట్రుడు విదురుణ్ణి ఉద్దేశించి- ‘సోదరా! మన ధర్మశాస్త్రాలు మనిషి ఆయువు నూరు సంవత్సరాలని చెప్పాయి కదా! కానీ చాలామంది అంత వయసు రాకుండానే అకాల మృత్యువును పొందుతున్నారు. ఎందుకిలా? మన ధర్మగ్రంథాలు ప్రామాణికం కాదా?’ అనడిగాడు. ఆ ప్రశ్నకు మహాజ్ఞాని అయిన విదురుడు ‘రాజా! మన మహర్షులు చెప్పిన విషయాలేవైనా సత్యనిష్ఠతో కూడుకున్నవి. మనిషి పూర్ణ ఆయువు వందేళ్లన్న మాట నిజమే. కానీ అహంకారం, అతిగా మాట్లాడటం, త్యాగశీలత లేకపోవటం, క్రోధం, స్వార్థం, మిత్రద్రోహం- అనే ఈ ఆరు దుర్గుణాలూ పదునైన కత్తుల్లా ఆయువును ఖండించేస్తున్నాయి. అవే అకాల మృత్యువుకు కారణమవుతున్నాయి. ఎవరైతే ఈ ఆరు దుర్గుణాలకు దూరంగా ఉంటారో.. వాళ్లు సంపూర్ణ ఆయుర్దాయంతో జీవిస్తారు’ అంటూ సమాధానం చెప్పాడు.

చక్రి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని