AP EAPCET: ఏపీ ఈఏపీసెట్‌ టాపర్లు వీళ్లే..

ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు.

Updated : 14 Jun 2023 13:19 IST

విజయవాడ: ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఇంజినీరింగ్‌ విభాగంలో 1,71,514 మంది (76.32 శాతం), అగ్రికల్చర్‌లో 81,203 మంది (89.65 శాతం) ప్రవేశాలకు అర్హత సాధించారు. 

ఇంజినీరింగ్‌ ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

అగ్రికల్చర్‌ & ఫార్మసీ ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

టాపర్లు వీళ్లే..

ఇంజినీరింగ్‌ విభాగంలో.. ఉమేశ్‌ వరుణ్‌ (నందిగామ) మొదటి స్థానంలో నిలవగా.. అభినవ్‌ చౌదరి (హైదరాబాద్‌) రెండో స్థానంలో, సాయిదుర్గారెడ్డి (పిడుగురాళ్ల) మూడో ర్యాంకు, బాబు సుజన్‌రెడ్డి (తిరుపతి) నాలుగో ర్యాంకు, వెంకట యుగేశ్‌ (రాజంపేట) ఐదో స్థానం దక్కించుకున్నారు.

అగ్రికల్చర్‌లో.. సత్యరాజ జశ్వంత్‌ (కాతేరు) మొదటి ర్యాంకు సాధించగా.. వరుణ్‌ చక్రవర్తి (శ్రీకాకుళం) రెండో ర్యాంకు, రాజ్‌కుమార్‌ (సికింద్రాబాద్‌) మూడో ర్యాంకు, సాయి అభినవ్‌ (చిత్తూరు) నాలుగో ర్యాంకు, కార్తికేయరెడ్డి (తెనాలి)కి ఐదో ర్యాంకు వచ్చాయి. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని