ఉద్యోగాలు

భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది....

Updated : 18 Aug 2022 11:52 IST

పవర్‌గ్రిడ్‌లో 32 పోస్టులు

భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 32. డిప్యూటీ మేనేజర్లు-17, అసిస్టెంట్‌ మేనేజర్లు-15.

విభాగాలు: ఏఐ/ ఎంఎల్‌, క్లౌడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మేనేజ్‌మెంట్‌, సైబర్‌ సెక్యూరిటీ, అప్లికేషన్‌ డెవలపర్‌ తదితరాలు.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ (ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేదీ: 2022, జులై 19.

వెబ్‌సైట్‌: https://www.powergrid.in/


కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో 106 పోస్టులు

భారత ప్రభుత్వానికి చెందిన కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ (సీఎస్‌ఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన వర్క్‌మెన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 106. సెమీస్కిల్డ్‌ రిగ్గర్లు-53, స్కాఫోల్డర్లు-05, సేఫ్టీ అసిస్టెంట్లు-18, ఫైర్‌మెన్లు-29, కుక్‌-01.

అర్హత: పోస్టుల్ని అనుసరించి నాలుగు, ఏడు, పదో తరగతి, ఐటీఐ ఉత్తీర్ణత, అనుభవం.

వయసు: 30 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక: రాత పరీక్ష, ప్రాక్టికల్‌ టెస్ట్‌, ఫిజికల్‌ టెస్ట్‌ ఆధారంగా.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేదీ: 2022, జులై 08.

వెబ్‌సైట్‌: https://cochinshipyard.in/


బీఈసీఐఎల్‌ - 36 పోస్టులు

భారత ప్రభుత్వానికి చెందిన బీఈసీఐఎల్‌... దిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయుర్వేద (ఏఐఐఏ)లో ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 36. టెక్నికల్‌ ఆఫీసర్‌, స్టాఫ్‌ నర్సులు, వార్డ్‌ అటెండెంట్లు, మిడ్‌వైఫ్‌, డెంటల్‌ హైజినీస్ట్‌ తదితరాలు.

అర్హత: పోస్టుల్ని అనుసరించి ఇంటర్‌, సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ/ ఎమ్మెస్సీ, ఎండీ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు: ఆన్‌లైన్‌/ ఈమెయిల్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేదీ: 2022, జులై 10.

వెబ్‌సైట్‌: ‌ www.becil.com/


ప్రవేశాలు

ఏపీ కేజీబీవీల్లో ఇంటర్‌

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సమగ్ర శిక్ష అభియాన్‌ కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 352 కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) 2022-2023 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియట్‌ మొదటి ఏడాది ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.


ఏపీ కేజీబీవీల్లో ఇంటర్‌ మొదటి ఏడాది ప్రవేశాలు

అర్హత: పదో తరగతి/ తత్సమాన ఉత్తీర్ణత.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, జూన్‌ 29.

దరఖాస్తులకు చివరి తేదీ: 2022, జులై 12.

వెబ్‌సైట్‌: https://apkgbv.apcfss.in/


ఏయూలో ఎంబీఏ

విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం, 2022-23 విద్యా సంవత్సరానికి  ఇంటర్నేషనల్‌ బిజినెస్‌లో ఎంబీఏ కోర్సు ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎంబీఏ-ఫుల్‌ టైం) కోర్సు

సీట్ల సంఖ్య: 44 కళాశాల: ఏయూ స్కూల్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌.

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.

ఎంపిక: ఏపీ ఐసెట్‌-2022 మెరిట్‌ ర్యాంక్‌ ఆధారంగా.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను డైరెక్టర్‌, డైరెక్టరేట్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌, ఆంధ్రా యూనివర్సిటీ, విజయనగర్‌ ప్యాలెస్‌, పెదవాల్తేర్‌, విశాఖపట్నం చిరునామాకు పోస్టు ద్వారా లేదా వ్యక్తిగతంగా పంపవచ్చు.

దరఖాస్తులకు చివరి తేదీ: 2022, జులై 20.

కౌన్సెలింగ్‌ తేదీ: 2022, జులై 22.

వెబ్‌సైట్‌: http://audoa.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని