సమస్యలను పరిష్కరించే సత్తా ఉందా!

సాధారణ ప్రజలు రోజువారీ జీవితంలో ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం చూపేలా నూతన ఆవిష్కరణలు చేసే యువత కోసం సామ్‌సంగ్‌ సంస్థ ‘సాల్వ్‌ ఫర్‌ టుమారో’ పోటీని ప్రకటించింది.

Published : 14 Jun 2022 00:50 IST

సామ్‌సంగ్‌ ఆధ్వర్యంలో ‘సాల్వ్‌ ఫర్‌ టుమారో’ ఇన్నోవేషన్‌ కాంపిటేషన్‌

సాధారణ ప్రజలు రోజువారీ జీవితంలో ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం చూపేలా నూతన ఆవిష్కరణలు చేసే యువత కోసం సామ్‌సంగ్‌ సంస్థ ‘సాల్వ్‌ ఫర్‌ టుమారో’ పోటీని ప్రకటించింది. ఎఫ్‌ఐటీటీ, ఐఐటీ దిల్లీ సహకారంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు 16 నుంచి 22 ఏళ్ల మధ్య వయసున్న విద్యార్థులు అర్హులు. ఒక్కరుగానైనా లేక ఇద్దరు ముగ్గురు బృందంగానైనా పాల్గొనొచ్చు.

* పోటీదారులు విద్య, పర్యావరణం, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో సమస్యలు పరిష్కరించేలా ఆవిష్కరణలను ప్రతిపాదించాల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలోనే వారు ఎంచుకున్న సమస్య, దానికి వారు సూచిస్తున్న పరిష్కారం ఏమిటో తెలియజేయాలి. నిపుణులతో కూడిన ప్యానెల్‌ ఆ దరఖాస్తులను పరిశీలిస్తుంది. అలా ఎంపిక చేసిన 50 బృందాలకు...వారి ఆలోచనలను ఎలా ఆచరణలో పెట్టాలో ఫౌండేషన్‌ ఫర్‌ ఇన్నొవేషన్‌ అండ్‌ టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్‌ (ఎఫ్‌ఐటీటీ) నిపుణుల ద్వారా మార్గదర్శకత్వం (మెంటర్‌షిప్‌) లభిస్తుంది. అలాగే వారికి ఐఐటీ దిల్లీలో జరిగే బూట్‌ క్యాంప్‌లో పాల్గొనే అవకాశం రావడంతోపాటు.. స్టెమ్‌ ఎడ్యుకేషన్‌, డిజైన్‌ థింకింగ్‌, ఇన్నొవేషన్‌, లీడర్‌షిప్‌ - ఇలా నచ్చిన కోర్సు చేసేలా రూ.లక్ష వోచర్‌ లభిస్తుంది. పాల్గొన్నందుకు ధ్రువపత్రం కూడా ఇస్తారు.

* అనంతరం టాప్‌ 10 బృందాలకు సామ్‌సంగ్‌ ఇండియా కార్యాలయాలు, ఆర్‌అండ్‌డీ సెంటర్లను సందర్శించే అవకాశం కల్పిస్తారు. బెంగళూరులోని సామ్‌సంగ్‌ ఒపేరా హౌస్‌లో ఆ సంస్థ ఉద్యోగులతో ముఖాముఖిలో పాల్గొనే అవకాశం దక్కుతుంది. టాప్‌ 3 విజేతలకు రూ.కోటి విలువైన సాయం అందుతుంది. వారి ఆలోచనలు కార్యరూపం దాల్చేలా ఐఐటీ దిల్లీ నిపుణులు ఆరునెలలపాటు మార్గదర్శకత్వం అందిస్తారు.

దరఖాస్తులకు చివరితేదీ: జులై 31

మరిన్ని వివరాలకు వెబ్‌సైట్‌: www.samsung.com/in/solvefortomorrow


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని