మాంగనీస్‌ ఓర్‌ ఇండియాలో ట్రెయినీలుగా అవకాశం

మినీరత్న ప్రభుత్వ రంగ సంస్థ నాగ్‌పుర్‌లోని  ‘మాంగనీస్‌ ఓర్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎంఓఐఎల్‌)’.. 44 గ్రాడ్యుయేట్‌ ట్రెయినీ, మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Published : 11 Mar 2024 00:46 IST

మినీరత్న ప్రభుత్వ రంగ సంస్థ నాగ్‌పుర్‌లోని  ‘మాంగనీస్‌ ఓర్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎంఓఐఎల్‌)’.. 44 గ్రాడ్యుయేట్‌ ట్రెయినీ, మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

మైనింగ్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, జియాలజీ, ప్రాసెస్‌, మెటీరియల్స్‌, కాంట్రాక్ట్‌ మేనేజ్‌మెంట్‌, పర్సనల్‌, ఫైనాన్స్‌, సర్వే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. మొత్తం 44 పోస్టుల్లో.. జనరల్‌కు 25, ఈడబ్ల్యూఎస్‌లకు 04, ఎస్సీలకు 06, ఎస్టీలకు 02, ఓబీసీ (ఎన్‌సీఎల్‌)లకు 07 కేటాయించారు.

21.03.2024 నాటికి గ్రాడ్యుయేట్‌ ట్రెయినీ/ మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ అభ్యర్థులకు 30 సంవత్సరాలు, మేనేజర్‌ (సర్వే) పోస్టుకు 35 సంవత్సరాలు మించకూడదు. గరిష్ఠ వయసులో ఓబీసీలు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌కు 3 ఏళ్లు, ఎస్సీ/ ఎస్టీలకు 5 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10-15 ఏళ్ల సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు జనరల్‌/ ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీ (ఎన్‌సీఎల్‌) అభ్యర్థులకు రూ.590. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్‌-సర్వీస్‌మెన్‌/ ఎంఓఐఎల్‌ ఉద్యోగులకు ఫీజు లేదు.


ఏ రకం పోస్టులు? ఎన్ని?

1. గ్రాడ్యుయేట్‌ ట్రెయినీ (మైన్స్‌): 13. బీఈ/ బీటెక్‌ ఇన్‌ మైనింగ్‌/ తత్సమాన పరీక్ష 60 శాతం మార్కులతో పాసవ్వాలి.
2. జీటీ- మెకానికల్‌: 5. 60 శాతం మార్కులతో బీఈ/ బీటెక్‌ (మెకానికల్‌) / తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులు కావాలి.
3. జీటీ- ఎలక్ట్రికల్‌: 4. బీఈ/ బీటెక్‌ (ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌/ పవర్‌ లేదా తత్సమాన పరీక్ష శాతం మార్కులతో పూర్తిచేయాలి.
4. మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ (జియాలజీ): 1. జియాలజీ/ అప్లైడ్‌ జియాలజీలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ 60 శాతం మార్కులతో పాసవ్వాలి.
5. గ్రాడ్యుయేట్‌ ట్రెయినీ (ప్రాసెస్‌):
ఎ) కెమికల్‌: 1 బీఈ/బీటెక్‌ ఇన్‌ కెమికల్‌ ఇంజినీరింగ్‌ లేదా తత్సమాన పరీక్ష 60 శాతం మార్కులతో పాసవ్వాలి.
బి) మెటలర్జీ: 1. బీఈ/ బీటెక్‌ ఇన్‌ మెటలర్జికల్‌ ఇంజినీరింగ్‌ లేదా తత్సమాన పరీక్ష 60 శాతం మార్కులతో పూర్తిచేయాలి.
సి) మినరల్‌ ప్రాసెసింగ్‌: 1. ఎంటెక్‌ ఇన్‌ మినరల్‌ ప్రాసెసింగ్‌ లేదా తత్సమాన పరీక్ష 60 శాతం మార్కులతో పాసవ్వాలి.
6. ఎంటీ - మెటీరియల్స్‌: 5. ఇంజినీరింగ్‌ డిగ్రీతోపాటు మెటీరియల్‌ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ చేయాలి/ మెటీరియల్‌ మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమా 60 శాతం మార్కులతో
ఉత్తీర్ణులు కావాలి.
7. ఎంటీ- కాంట్రాక్ట్‌ మేనేజ్‌మెంట్‌: 1. ఇంజినీరింగ్‌ డిగ్రీ, ఎంబీఏ ఇన్‌ ఫైనాన్స్‌/ మెటీరియల్స్‌ మేనేజ్‌మెంట్‌ లేదా ఫైనాన్స్‌/ మెటీరియల్స్‌ మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమా 60 శాతం మార్కులతో పాసవ్వాలి.
8. ఎంటీ - పర్సనల్‌/ వెల్ఫేర్‌: 5. లేబర్‌ వెల్ఫేర్‌, పర్సనల్‌ మేనేజ్‌మెంట్‌ స్పెషలైజేషన్‌తో సోషల్‌ వర్క్‌లో పీజీ 60 శాతం మార్కులతో పూర్తిచేయాలి. లేదా పర్సనల్‌ మేనేజ్‌మెంట్‌/ హెచ్‌ఆర్‌/ హెచ్‌ఆర్‌డీ ఎంబీఏ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులు కావాలి. లా గ్రాడ్యుయేట్లకు ప్రాధాన్యమిస్తారు.
9. మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ (ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌): 5. సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ సీఎంఏ పూర్తిచేయాలి.
10. మేనేజర్‌ (సర్వే): 2. డిగ్రీ, డిప్లొమా ఇన్‌ మైనింగ్‌ అండ్‌ మైన్‌ సర్వేయింగ్‌/ డిప్లొమా ఇన్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌ 60 శాతం మార్కులతో పాసవ్వాలి. సర్వేయర్స్‌ సర్టిఫికెట్‌ ఆఫ్‌ కాంపిటెన్సీ, 2 ఏళ్ల పని అనుభవం ఉండాలి. లేదా మైనింగ్‌ అండ్‌ మైన్‌ సర్వేయింగ్‌ డిప్లొమా 60 శాతం మార్కులతో పాసై 4 ఏళ్ల పని అనుభవం ఉండాలి.


పరీక్ష.. ఇంటర్వ్యూ

  • కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ)లో ఆబ్జెక్టివ్‌ టైప్‌ ప్రశ్నలు 85 మార్కులకు ఉంటాయి. ప్రశ్నపత్రంలో రెండు పార్టులు. పార్ట్‌-1లో జనరల్‌ నాలెడ్జ్‌ - 10 మార్కులు, రీజనింగ్‌ - 10 మార్కులు, జనరల్‌ ఇంగ్లిష్‌ - 10 మార్కులు.
  • పార్ట్‌-2లో సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలు 55 మార్కులకు ఉంటాయి.
  • ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో ఉంటుంది. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు.
  • జనరల్‌/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు ప్రతి పార్ట్‌లోనూ 50 శాతం మార్కులు, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఓబీసీ (ఎన్‌సీఎల్‌) అభ్యర్థులు 40 శాతం మార్కులు సాధించాలి.
  • సీబీటీలో ప్రతిభ చూపిన అభ్యర్థులను 1:6 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.
  • ఇంటర్వ్యూకు అర్హత సాధించినవారి వివరాలను వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు. ఇంటర్వ్యూ సమయం, తేదీ, వేదికలను అభ్యర్థుల ఈమెయిల్‌ ఐడీకి తెలియజేస్తారు. ఇంటర్వ్యూకు 15 మార్కులు కేటాయించారు. ఇంటర్వ్యూల సమయంలో విద్యార్హతలు, అనుభవానికి సంబంధించిన ధ్రువపత్రాలను పరిశీలిస్తారు. ఒకరు ఒక పోస్టుకు మాత్రమే దరఖాస్తు చేయాలి.
  • సీబీటీ, ఇంటర్వ్యూల్లో ప్రతిభ చూపిన అభ్యర్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.

సన్నద్ధత

  • సబ్జెక్టు సంబంధిత అంశాలకు 55 మార్కులు కేటాయించారు. ఈ ప్రశ్నలకు సరైన జవాబులు గుర్తిస్తే ఎక్కువ మార్కులను సంపాదించవచ్చు. అందుకని సబ్జెక్టులపై పట్టు సంపాదించాలి.
  • సబ్జెక్టులవారీగా ముఖ్యాంశాలను పునశ్చరణ చేసుకోవాలి.
  • జనరల్‌ నాలెడ్జ్‌, రీజనింగ్‌, జనరల్‌ ఇంగ్లిష్‌ల కోసం బ్యాంకు, ఆర్‌ఆర్‌బీ పరీక్షల పాత ప్రశ్నపత్రాలను సాధన చేస్తే మార్కులు సులువుగా పొందవచ్చు.  

పరీక్ష కేంద్రాలు: దరఖాస్తులో తెలిపిన పరీక్ష కేంద్రాల నుంచి రెండింటిని ఎంచుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రం హైదరాబాద్‌లో మాత్రమే ఉంది.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 21.03.2024
వెబ్‌సైట్‌: https://ssc.nic.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని