ప్రభుత్వ ఉద్యోగాలు

భారత ప్రభుత్వరంగానికి చెందిన న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఎన్‌పీసీఐఎల్‌)...

Updated : 14 Jan 2022 13:20 IST

ఎన్‌పీసీఐఎల్‌లో 206 ఖాళీలు

భారత ప్రభుత్వరంగానికి చెందిన న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఎన్‌పీసీఐఎల్‌), రావత్‌బటా రాజస్థాన్‌ యూనిట్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 206 పోస్టులు: స్టైపెండరీ ట్రెయినీ/ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌, అసిస్టెంట్‌, స్టెనో, సబ్‌ ఆఫీసర్‌, లీడింగ్‌ ఫైర్‌మెన్‌ తదితరాలు. అర్హత: పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్‌, సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా (ఇంజినీరింగ్‌), బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం, నిర్దేశించిన శారీరక ప్రమాణాలు. ఎంపిక విధానం: ఫిజికల్‌ స్టాండర్డ్‌, ఫిజికల్‌ అసెస్‌మెంట్‌ టెస్ట్‌, డ్రైవింగ్‌ టెస్ట్‌, స్టేజ్‌-1 (ప్రిలిమినరీ టెస్ట్‌), స్టేజ్‌-2 (అడ్వాన్స్‌ టెస్ట్‌) ఆధారంగా. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: నవంబరు 03, 2020. దరఖాస్తుకు చివరి తేది: నవంబరు 24, 2020. వెబ్‌సైట్‌: https://npcilcareers.co.in/


ఎన్‌సీఎల్‌లో టెక్నికల్‌ ఆఫీసర్లు

భారత ప్రభుత్వ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన పుణెలోని సీఎస్‌ఐఆర్‌-నేషనల్‌ కెమికల్‌ ల్యాబొరేటరీ (ఎన్‌సీఎల్‌)కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 45 పోస్టులు-ఖాళీలు: సీనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌-03, టెక్నికల్‌ ఆఫీసర్‌-12, టెక్నికల్‌ అసిస్టెంట్‌-10, టెక్నీషియన్‌-10. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: నవంబరు 02, 2020. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: డిసెంబరు 02, 2020. దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: డిసెంబరు 31, 2020. వెబ్‌సైట్‌: https://www.nclnindia.org/


ప్రవేశాలు

పీజేటీఎస్‌ఏయూ, హైదరాబాద్‌

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఎస్‌ఏయూ) 2020-21 విద్యాసంవత్సరానికి కింది యూజీ ప్రోగ్రాముల్లో ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* బైపీసీ స్ట్రీమ్‌ ద్వారా యూజీ ప్రవేశాలు
కోర్సులు: 1) బ్యాచిలర్‌ ఆఫ్‌ వెటర్నరీ సైన్స్‌ (బీవీఎస్సీ), యానిమల్‌ హస్బెండరీ (ఏహెచ్‌), 2) బీఎస్సీ (ఆనర్స్‌) అగ్రికల్చర్‌ (రెగ్యులర్‌ అండ్‌ పేమెంట్‌) 3) బీఎస్సీ (ఆనర్స్‌) హార్టికల్చర్‌ (రెగ్యులర్‌ అండ్‌ పేమెంట్‌), 4) బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిషరీ సైన్స్‌ (బీఎఫ్‌ఎస్‌సీ) అర్హత: సంబంధిత సబ్జెక్టుల(ఫిజికల్‌ సైన్సెస్‌, బయలాజికల్‌ సైన్సెస్‌)తో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత. ఎంపిక విధానం: తెలంగాణ రాష్ట్ర ఎంసెట్‌-2020 ర్యాంకు ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌. దరఖాస్తుకు చివరి తేది: నవంబరు 16, 2020. వెబ్‌సైట్‌ : https://www.pjtsau.edu.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని