నోటీస్‌బోర్డు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన తెలంగాణ (హైదరాబాద్‌)లోని హాల్‌ సెకండరీ స్కూల్‌ కింది టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 15 Mar 2022 01:27 IST

ఉద్యోగాలు
హాల్‌ సెకండరీ స్కూల్‌, హైదరాబాద్‌లో..

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన తెలంగాణ (హైదరాబాద్‌)లోని హాల్‌ సెకండరీ స్కూల్‌ కింది టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 13  పోస్టులు: పీఆర్‌టీ, టీజీటీ, డ్యాన్స్‌ టీచర్‌, మ్యూజిక్‌ టీచర్‌, నర్సరీ టీచర్‌ తదితరాలు.

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా/ డిగ్రీ, గ్రాడ్యుయేషన్‌, బీసీఏ, బీఈడీ ఉత్తీర్ణత. సీటెట్‌/ టెట్‌ అర్హత, అనుభవం.

ఎంపిక విధానం: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా. చివరి తేది: 2022, మార్చి 22.

వెబ్‌సైట్‌: https://halsecondaryschoolhyderabad.in/


సీఐఐఎల్‌, మైసూర్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌

భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖకు చెందిన మైసూర్‌లోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియన్‌ లాంగ్వేజస్‌ (సీఐఐఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 20 అకడమిక్‌ పోస్టులు: ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌-01, సీనియర్‌ ఫెలో-05, అసోసియేట్‌ ఫెలో-10.

అడ్మినిస్ట్రేటివ్‌ పోస్టులు: ఆఫీస్‌ సూపరింటెండెంట్‌-01, జేఏఓ-01, యూడీసీ-01, ఎల్‌డీసీ-01.

అర్హత: పోస్టుల్ని అనుసరించి ఏదైనా డిగ్రీ, సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

రఖాస్తులకు చివరి తేది: ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 21 రోజుల్లోపు.

వెబ్‌సైట్‌:www.ciil.org/


డబ్ల్యూఐఐ, దెహ్రాదూన్‌లో...

దెహ్రాదూన్‌లోని వైల్డ్‌లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యూఐఐ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 15  పోస్టులు-ఖాళీలు: ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-01, సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-03, సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఫెలో-03, జూనియర్‌ ప్రాజెక్ట్‌ ఫెలో-04, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్లు-04.

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా. చివరి తేది: 2022, ఏప్రిల్‌ 04.

వెబ్‌సైట్‌: https://wii.gov.in/


ప్రవేశాలు
పీడీఈయూలో బ్యాచిలర్స్‌ ప్రోగ్రాములు

గాంధీనగర్‌ (గుజరాత్‌)లోని పండిట్‌ దీన్‌దయాళ్‌ ఎనర్జీ యూనివర్సిటీ (పీడీఈయూ)కి చెందిన స్కూల్‌ ఆఫ్‌ లిబరల్‌ స్టడీస్‌ 2022 విద్యాసంవత్సరానికి కింది యూజీ ప్రోగ్రాములో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

* పీడీఈయూలో బ్యాచిలర్స్‌ ప్రోగ్రాములు

బ్యాచిలర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (బీబీఏ ఆనర్స్‌), బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ (బీఏ ఆనర్స్‌), బీకాం (ఆనర్స్‌)

కోర్సులు: మార్కెటింగ్‌, హెచ్‌ఆర్‌, ఫైనాన్స్‌, ఎకనమిక్స్‌, సైకాలజీ, ఇండిక్‌ స్టడీస్‌, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌ తదితరాలు.

అర్హత: ఇంటర్మీడియట్‌ (10+2)/ తత్సమాన ఉత్తీర్ణత.

ఎంపిక విధానం: స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌, క్రియేటివ్‌ రైటింగ్‌, ఎస్‌ఏటీ ఎగ్జామ్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. చివరి తేది: 2022, మే 26.

వెబ్‌సైట్‌: https://sls.pdpu.ac.in/


బయోటెక్నాలజీ ఎలిజిబిలిటీ టెస్ట్‌ 2022

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) 2022 సంవత్సరానికి గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌-బయోటెక్నాలజీ(జీఏటీ బీ)/ బయోటెక్నాలజీ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (బీఈటీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

అర్హత: బయోటెక్నాలజీ, లైఫ్‌ సైన్సెస్‌/ ఇతర బయాలజీ అనుబంధ విభాగాల్లో బ్యాచిలర్స్‌ (బీఈ/ బీటెక్‌), మాస్టర్స్‌ (ఎమ్మెస్సీ/ ఎంటెక్‌/ ఎంవీఎస్సీ/ ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ/ ఎంటెక్‌) ఉత్తీర్ణత.

వయసు: 28 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ ఆధారంగా.

పరీక్ష తేది: 2022, ఏప్రిల్‌ 23. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

చివరి తేది: 2022, మార్చి 31.

వెబ్‌సైట్‌: http://dbt.nta.ac.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని