నోటీస్‌బోర్డు

గోవాలోని సీఎస్‌ఐఆర్‌-నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీ (ఎన్‌ఐఓ) కింది సైంటిఫిక్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 22 Mar 2022 02:05 IST

ఉద్యోగాలు

సీఎస్‌ఐఆర్‌-ఎన్‌ఐఓలో సైంటిస్టులు

గోవాలోని సీఎస్‌ఐఆర్‌-నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీ (ఎన్‌ఐఓ) కింది సైంటిఫిక్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* సైంటిస్టులు

మొత్తం ఖాళీలు: 22

అర్హత: సంబంధిత విభాగాల్లో పీహెచ్‌డీ ఉత్తీర్ణత.

వయసు: 32 ఏళ్లు మించకుండా ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, మార్చి 23.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 2022, ఏప్రిల్‌ 30.

దరఖాస్తు హార్డ్‌కాపీల స్వీకరణకు చివరి తేది: 2022, మే 16

వెబ్‌సైట్‌: www.nio.org/


సెంట్రల్‌ సిల్క్‌ బోర్డులో సైంటిస్టులు

భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోని సెంట్రల్‌ సిల్క్‌ బోర్డు (సీఎస్‌బీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* సైంటిస్ట్‌ బి (పోస్ట్‌ కొకూన్‌)

మొత్తం ఖాళీలు: 15

అర్హత: టెక్స్‌టైల్‌ టెక్నాలజీలో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత, గేట్‌ -2022 మెరిట్‌ స్కోర్‌. వయసు: 35 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: గేట్‌ 2022 మెరిట్‌ స్కోర్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, ఏప్రిల్‌ 25.

వెబ్‌సైట్‌: https://csb.gov.in/


డీఎంహెచ్‌ఓ, మెదక్‌లో...

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన మెదక్‌ జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయం పల్లె దవాఖానాల్లో పనిచేసేందుకు ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* మెడికల్‌ ఆఫీసర్లు

మొత్తం ఖాళీలు: 58

అర్హత: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా. చిరునామా: డీఎంహెచ్‌ఓ, మెదక్‌ జిల్లా, తెలంగాణ.

దరఖాస్తులకు చివరితేది: 2022, మార్చి 23.

వెబ్‌సైట్‌: https://medak.telangana.gov.in/

 


అప్రెంటిస్‌షిప్‌

సీఎస్‌ఐఆర్‌-ఎన్‌ఏఎల్‌లో ట్రేడ్‌ అప్రెంటిస్‌లు

బెంగళూరులోని సీఎస్‌ఐఆర్‌-నేషనల్‌ ఏరోస్పేస్‌ ల్యాబొరేటరీస్‌ (ఎన్‌ఏఎల్‌) వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* ట్రేడ్‌ అప్రెంటిస్‌లు

మొత్తం ఖాళీలు: 77

ట్రేడులు: ఫిట్టర్‌-12, టర్నర్‌-15, ఎలక్ట్రీషియన్‌-18, మెషినిస్ట్‌-26, మెకానిక్‌-03, వెల్డర్‌-03.

అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, ఏప్రిల్‌ 04.

వెబ్‌సైట్‌: www.nal.res.in/


ప్రవేశాలు

ఐఐఐటీడీఎంలో మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌ ప్రోగ్రాం

భారత ప్రభుత్వానికి చెందిన కాచీపురంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ డిజైన్‌ అండ్‌ మాన్యూఫ్యాక్చరింగ్‌ (ఐఐఐటీడీఎం) జులై 2022 సెషన్‌కు గాను కింది ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

* మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌ (ఇంటిగ్రేటెడ్‌ ప్రొడక్ట్‌ డిజైన్‌)

అర్హత: బ్యాచిలర్స్‌ డిగ్రీ (ఇంజినీరింగ్‌), డిజైన్‌, ఆర్కిటెక్చర్‌ ఉత్తీర్ణత. సీడ్‌ 2022 స్కోర్‌.

ఎంపిక విధానం: సీడ్‌ 2022 మెరిట్‌ స్కోర్‌, ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, మే 06.

వెబ్‌సైట్‌: https://iiitdm.ac.in/


ఎన్‌ఐఎఫ్‌ఎంలో ఎంబీఏ ప్రోగ్రాం

భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వశాఖకు చెందిన అరుణ్‌ జైట్లీ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ (ఎన్‌ఐఎఫ్‌ఎం) 2022 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రాములో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

* మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎంబీఏ-ఫైనాన్స్‌)

కోర్సు వ్యవధి: రెండు సంవత్సరాలు.

అర్హత: బ్యాచిలర్స్‌ డిగ్రీ/ తత్సమాన ఉత్తీర్ణత. క్యాట్‌/ గ్జాట్‌/ సీమ్యాట్‌/ మ్యాట్‌/ జీమ్యాట్‌ వాలిడ్‌ స్కోర్‌.

ఎంపిక విధానం: ఆల్‌ ఇండియా లెవల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌, గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, ఏప్రిల్‌ 30.

వెబ్‌సైట్‌: www.nifm.ac.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని