నోటిఫికేషన్స్

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టరేట్‌ కార్యాలయం కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 06 Apr 2022 05:52 IST

ఉద్యోగాలు

ఏపీ-36 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టరేట్‌ కార్యాలయం కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు
మొత్తం ఖాళీలు: 36 అర్హత: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత. మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి. వయసు: 42 ఏళ్లు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం: మెరిట్‌ మార్కులు, ఇతర అర్హతల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు ప్రక్రియ: ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తులకు చివరితేది: 2022, ఏప్రిల్‌ 11.

వెబ్‌సైట్‌: http://hmfw.ap.gov.in/


సాయ్‌లో 26 పోస్టులు

భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖకు చెందిన న్యూదిల్లీలోని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* హై పర్‌ఫార్మెన్స్‌ అనలిస్టులు (బయోమెకానిక్స్‌/ సైకాలజిస్ట్‌)
మొత్తం ఖాళీలు: 26 అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం. ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
దరఖాస్తులకు చివరి తేది: 2022, ఏప్రిల్‌ 30.

వెబ్‌సైట్‌: https://sportsauthorityofindia.nic.in


ప్రవేశాలు
తెలంగాణ ఎడ్‌సెట్‌-2022

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ కళాశాలల్లో 2022-23 విద్యా సంవత్సరానికిగానూ బీఈడీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే ఎడ్‌సెట్‌-2022 ప్రకటన విడుదలైంది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తరఫున ఉస్మానియా విశ్వవిద్యాలయం ఈ పరీక్షను నిర్వహిస్తోంది.
* తెలంగాణ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(టీఎస్‌ ఎడ్‌సెట్‌)
అర్హత: ఏదైనా బ్యాచిలర్స్‌ డిగ్రీ/ మాస్టర్స్‌ డిగ్రీ/ తత్సమాన ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.650, ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్‌ అభ్యర్థులు రూ.450 చెల్లించాలి. ముఖ్యమైన తేదీలు:  దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, ఏప్రిల్‌ 07. దరఖాస్తులకు చివరితేది: 2022, జూన్‌ 15. పరీక్ష తేదీలు: 2022, జులై 26, 27.

వెబ్‌సైట్‌: https://edcet.tsche.ac.in/

 


ఎస్‌వీఎన్‌ఐఆర్‌టీఏఆర్‌-పీజీఈటీ 2022

భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు చెందిన ఒడిశాలోని స్వామి వివేకానంద నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రిహాబిలిటేషన్‌ ట్రైనింగ్‌ అండ్‌ రిసెర్చ్‌ (ఎస్‌వీఎన్‌ఐఆర్‌టీఏఆర్‌) 2022 సంవత్సరానికిగానూ కింది పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
* పోస్టు గ్రాడ్యుయేట్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (పీజీఈటీ-2022)
కోర్సులు: మాస్టర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ (ఎంపీటీ), మాస్టర్‌ ఆఫ్‌ ఆక్యుపేషనల్‌ థెరపీ (ఎంవోటీ), మాస్టర్‌ ఇన్‌ ప్రోస్థటిక్స్‌ అండ్‌ ఆర్థోటిక్స్‌ (ఎంపీవో)  అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత.
ఎంపిక: ప్రవేశ పరీక్ష ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
దరఖాస్తులకు చివరి తేది: 2022, జూన్‌ 23.
పరీక్ష తేది: 2022, ఆగస్టు 07.

వెబ్‌సైట్‌ : http://svnirtar.nic.in/


ఏపీ-మహాత్మా జ్యోతిబాపూలే గురుకులాల్లో..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన కానూరు (విజయవాడ)లోని మహాత్మా జ్యోతిబాపూలే ఏపీ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 99 గురుకుల పాఠశాలల్లో 2022-2023 విద్యాసంవత్సరానికి ఐదో తరగతి (ఇంగ్లిష్‌ మీడియం) ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: 2020-21లో మూడో తరగతి, 2021-22లో నాలుగో తరగతి ఉత్తీర్ణత. ఎంపిక విధానం: లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
దరఖాస్తులకు చివరి తేది: 2022, ఏప్రిల్‌ 27.

వెబ్‌సైట్‌: https://apgpcet.apcfss.in/MJPAPBCWR/


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని