ఉద్యోగాలు

భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌) డైరెక్టరేట్‌ జనరల్‌ కార్యాలయం కింది గ్రూప్‌ బి నాన్‌ గెజిటెడ్‌, నాన్‌ మినిస్టీరియల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది....

Updated : 19 Apr 2022 05:59 IST

బీఎస్‌ఎఫ్‌లో 90 గ్రూప్‌ బి పోస్టులు

భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌) డైరెక్టరేట్‌ జనరల్‌ కార్యాలయం కింది గ్రూప్‌ బి నాన్‌ గెజిటెడ్‌, నాన్‌ మినిస్టీరియల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 90

పోస్టులు-ఖాళీలు: ఇన్‌స్పెక్టర్‌ (ఆర్కిటెక్ట్‌)-01, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (వర్క్స్‌)-57, జూనియర్‌ ఇంజినీర్లు-32

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిప్లొమా, డిగ్రీ (ఆర్కిటెక్చర్‌) ఉత్తీర్ణత.

వయసు: 30 ఏళ్లు మించకుండా ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌లో ఈ ప్రకటన వెలువడి తేదీ నుంచి 45 రోజుల్లోపు.

వెబ్‌సైట్‌: https://rectt.bsf.gov.in/


ఇండ్‌బ్యాంక్‌లో 73 ఖాళీలు

ఇండియన్‌ బ్యాంక్‌ సబ్సిడరీ సంస్థ అయిన చెన్నైలోని ఇండ్‌బ్యాంక్‌ మర్చంట్‌ బ్యాంకింగ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 73 పోస్టులు: అకౌంట్‌ ఓపెనింగ్‌ స్టాఫ్‌, హెల్ప్‌ డెస్క్‌ స్టాఫ్‌, రిసెర్చ్‌ అనలిస్ట్‌ ఫీల్డ్‌ స్టాఫ్‌ తదితరాలు.

అర్హత: పోస్టుల్ని అనుసరించి ఇంటర్మీడియట్‌, ఏదైనా గ్రాడ్యుయేషన్‌, సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌, ఎంబీఏ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, ఏప్రిల్‌ 26.

వెబ్‌సైట్‌: www.indbankonline.com/


డీఆర్‌డీఓ- ఎన్‌ఎస్‌టీఎల్‌, విశాఖపట్నంలో...

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన విశాఖపట్నంలోని డీఆర్‌డీఓ-నేవల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నలాజికల్‌ ల్యాబొరేటరీ (ఎన్‌ఎస్‌టీఎల్‌) కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో (జేఆర్‌ఎఫ్‌)

మొత్తం ఖాళీలు: 08

విభాగాలు: మెకానికల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌, ఫిజిక్స్‌ తదితరాలు.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్‌ ఉత్తీర్ణత. నెట్‌/ గేట్‌ స్కోర్‌ ఉండాలి.

వయసు: 28 ఏళ్లు మించకుండా ఉండాలి

స్టైపెండ్‌: నెలకు రూ.31000 + హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, ఏప్రిల్‌ 30.

వెబ్‌సైట్‌: ‌www.drdo.gov.in/


సుప్రీంకోర్టులో జూనియర్‌ ట్రాన్స్‌లేటర్లు

న్యూదిల్లీలోని సుప్రీంకోర్ట్‌ ఆఫ్‌ ఇండియా అర్హులైన అభ్యర్థుల నుంచి కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

జూనియర్‌ ట్రాన్స్‌లేటర్లు/ కోర్టు అసిస్టెంట్లు

మొత్తం ఖాళీలు: 25

భాషలు: అస్సామీస్‌, బెంగాలీ, తెలుగు, గుజరాతీ, ఉర్దూ, మరాఠి, తమిళ్‌, కన్నడ తదితరాలు. అర్హత: ఇంగ్లిష్‌తో పాటు సంబంధిత భాషలో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత. ట్రాన్స్‌లేషన్‌ అనుభవంతో పాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

వయసు: 32 ఏళ్లు మించకుండా ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, మే 14.

వెబ్‌సైట్‌: https://main.sci.gov.in/


సీఎస్‌ఐఆర్‌-ఎన్‌ఏఎల్‌లో..

బెంగళూరులోని సీఎస్‌ఐఆర్‌-నేషనల్‌ ఏరోస్పేస్‌ ల్యాబొరేటరీ (ఎన్‌ఏఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 13 పోస్టులు: ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, ప్రిన్సిపల్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌.

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిప్లొమా/బీఎస్సీ, బీఈ/ బీటెక్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణత.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, ఏప్రిల్‌ 30.

వెబ్‌సైట్‌: ‌www.nal.res.in/


సైబర్‌ సెక్యూరిటీలో వర్చువల్‌ ఇంటర్న్‌షిప్‌

ల్‌ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఏఐసీటీఈ), సిస్కో నెట్‌వర్కింగ్‌ అకాడమీ ప్రోగ్రామ్‌ ద్వారా సైబర్‌ సెక్యూరిటీలో 20 వేల మందికి వర్చువల్‌ ఇంటర్న్‌షిప్స్‌ ఇవ్వనుంది.

అర్హత: బీ.టెక్‌/ బీఈ లేదా తత్సమాన డిగ్రీలో ఉత్తీర్ణత సాధించినవారు అర్హులు. టెక్నికల్‌ నైపుణ్యాలు అవసరం.

పారితోషికం: రూ. 10,000. ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేసుకున్నవారికి వర్చువల్‌ సర్టిఫికెట్‌ ఇస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా..

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

చివరితేదీ: 2022, మే 23  

వెబ్‌సైట్‌: https://internship.aicte-india.org/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని