ఎంఆర్‌పీఎల్‌లో 65 అసిస్టెంట్‌ ఇంజినీర్లు

భారత ప్రభుత్వరంగానికి చెందిన ఓఎన్‌జీసీ లిమిటెడ్‌ సబ్సిడరీ సంస్థ అయిన మంగళూరు రిఫైనరీ అండ్‌ పెట్రోకెమికల్స్‌ లిమిటెడ్‌ (ఎంఆర్‌పీఎల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 02 May 2022 02:59 IST

భారత ప్రభుత్వరంగానికి చెందిన ఓఎన్‌జీసీ లిమిటెడ్‌ సబ్సిడరీ సంస్థ అయిన మంగళూరు రిఫైనరీ అండ్‌ పెట్రోకెమికల్స్‌ లిమిటెడ్‌ (ఎంఆర్‌పీఎల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అసిస్టెంట్‌ ఇంజినీర్లు/ అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌లు

మొత్తం ఖాళీలు: 65 విభాగాలు: కెమికల్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, కెమిస్ట్రీ తదితరాలు.

ఎంపిక విధానం: గేట్‌-2022 స్కోర్‌, టెస్ట్‌/ ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం:

ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: 2022, మే 28.

వెబ్‌సైట్‌: http://mrplgate.recttindia.in/


సీఎస్‌ఐఆర్‌-సీజీసీఆర్‌ఐలో..

కోల్‌కతాలోని సీఎస్‌ఐఆర్‌-సెంట్రల్‌ గ్లాస్‌ అండ్‌ సిరామిక్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీజీసీఆర్‌ఐ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 70 పోస్టులు-ఖాళీలు: టెక్నీషియన్లు-32, టెక్నికల్‌ అసిస్టెంట్లు-38.

అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఐటీఐ, ఇంజినీరింగ్‌ డిప్లొమా, బీఎస్సీ/ తత్సమాన ఉత్తీర్ణత, అనుభవం.

వయసు: 28 ఏళ్లు మించకుండా ఉండాలి. ఎంపిక విధానం: ట్రేడ్‌ టెస్ట్‌, రాత పరీక్ష ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ ద్వారా. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 2022, మే 31. దరఖాస్తు హార్డ్‌కాపీల స్వీకరణకు చివరి తేది: 2022, జూన్‌ 15. 
వెబ్‌సైట్‌: www.cgcri.res.in/


ఆర్మీ- ఈస్టర్న్‌ కమాండ్‌లో..

ఇండియన్‌ ఆర్మీకి చెందిన ఈస్టర్న్‌ కమాండ్‌ వివిధ ఏఎంసీ యూనిట్లలో గ్రూప్‌ సీ సివిలియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

గ్రూప్‌ సీ సివిలియన్‌ పోస్టులు

మొత్తం ఖాళీలు: 158 పోస్టులు: బార్బర్‌, చౌకీదార్‌, ఎల్‌డీసీ, సఫాయివాలా, హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌, కుక్‌, వార్డ్‌ సహాయక్‌ తదితరాలు.

అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్‌/ తత్సమాన ఉత్తీర్ణత. సంబంధిత ట్రేడ్‌/ కోర్సు సర్టిఫికెట్లతో పాటు అనుభవం. వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా. దరఖాస్తులకు చివరి తేది: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 45 రోజుల్లోపు.      

 వెబ్‌సైట్‌: https://indianarmy.nic.in/


ప్రవేశాలు

యూజీసీ - నెట్‌ డిసెంబర్‌ 2021 & జూన్‌ 2022 

దేశవ్యాప్తంగా హ్యూమానిటీస్‌, సోషల్‌ సైన్సెస్‌, తత్సమాన సబ్జెక్టులకు సంబంధించి జేఆర్‌ఎఫ్‌, లెక్చర్‌షిప్‌(అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌) అర్హతకు నిర్వహించే యూజీసీ-నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (నెట్‌)- డిసెంబరు 2021 ఖీ జూన్‌ 2022 ప్రకటన విడుదల అయింది.

 యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ)-నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(నెట్‌), డిసెంబరు 2021 & జూన్‌ 2022

అర్హత: హ్యూమానిటీస్‌, సోషల్‌ సైన్సెస్‌ (లాంగ్వేజెస్‌ని కలుపుకొని), కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ అప్లికేషన్‌, ఎలక్ట్రానిక్‌ సైన్స్‌ తదితర సబ్జెక్టుల్లో కనీసం 55% మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. వయసు: జేఆర్‌ఎఫ్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 01.06.2022 నాటికి 31 ఏళ్లు మించకూడదు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వయసుతో సంబంధం లేదు. ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: 2022, మే 20. 

వెబ్‌సైట్‌: https://ugcnet.nta.nic.in/


ఏపీ ఈసెట్‌ - 2022

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ఏపీ ఉన్నత విద్యా మండలి (ఏపీఎస్‌సీహెచ్‌ఈ) ఏపీ ఈసెట్‌-2022 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా డిప్లొమా, బీఎస్సీ(మ్యాథమేటిక్స్‌) అభ్యర్థులకు 2022-2023 విద్యాసంవత్సరానికి బీఈ/ బీటెక్‌/ బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్‌ ఎంట్రీ ప్రవేశాలు కల్పిస్తారు. ఈ పరీక్షను జేఎన్‌టీయూ, కాకినాడ నిర్వహిస్తోంది.

ఏపీ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఏపీ ఈసెట్‌) 2022

అర్హత: మూడేళ్ల డిప్లొమా ఇంజినీరింగ్‌/ టెక్నాలజీ/ ఫార్మసీ ఉత్తీర్ణత. (లేదా) మ్యాథమేటిక్స్‌ ఒక సబ్జెక్టుగా మూడేళ్ల బీఎస్సీ డిగ్రీ ఉత్తీర్ణత.  ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ ఉమ్మడి ప్రవేశ పరీక్ష(కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌) ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, మే 03.05.2022. దరఖాస్తులకు చివరి తేది: 2022, జూన్‌ 03. పరీక్ష తేది: 2022, జులై 22.

వెబ్‌సైట్‌: https://cets.apsche.ap.gov.in/
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని