నోటిఫికేషన్స్

భారత ప్రభుత్వ కమ్యూనికేషన్స్‌ మంత్రిత్వశాఖకు చెందిన న్యూదిల్లీలోని ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ (ఐపీపీబీ) దేశవ్యాప్తంగా కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 11 May 2022 01:25 IST

ఉద్యోగాలు

ఐపీపీబీలో 650 పోస్టులు

భారత ప్రభుత్వ కమ్యూనికేషన్స్‌ మంత్రిత్వశాఖకు చెందిన న్యూదిల్లీలోని ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ (ఐపీపీబీ) దేశవ్యాప్తంగా కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* గ్రామీణ్‌ డాక్‌ సేవక్‌
మొత్తం ఖాళీలు: 650 తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు: ఆంధ్రప్రదేశ్‌-34, తెలంగాణ-21. అర్హత: గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత, అనుభవం. వయసు: 30.04.2022 నాటికి 20 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. జీతభత్యాలు: నెలకు రూ.30000 చెల్లిస్తారు. ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ రాత పరీక్ష, లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: 2022, మే 20. వెబ్‌సైట్‌: www.ippbonline.com/


భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌లో...

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (బీడీఎల్‌) తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వివిధ యూనిట్లలో ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 80 పోస్టులు-ఖాళీలు: ప్రాజెక్ట్‌ డిప్లొమా అసిస్టెంట్లు-36, ప్రాజెక్ట్‌ ట్రేడ్‌ అసిస్టెంట్లు-44. విభాగాలు: ఎలక్ట్రికల్‌, టూల్‌ డిజైన్‌, హెచ్‌ఆర్‌, ఫైనాన్స్‌, పెయింటర్‌, ఫిట్టర్‌, స్టెనోగ్రాఫర్‌ తదితరాలు. అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఐటీఐ, ఇంజినీరింగ్‌ డిప్లొమా, గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత, అనుభవం. వయసు: 28 ఏళ్లు మించకుండా ఉండాలి. ఎంపిక విధానం: మెరిట్‌ మార్కులు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, మే 14. దరఖాస్తులకు చివరి తేది: 2022, జూన్‌ 04. వెబ్‌సైట్‌: https://bdl-india.in/


ఏపీలో 31 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారి కార్యాలయం రెగ్యులర్‌ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
*సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు
మొత్తం ఖాళీలు: 31 (ఓపెన్‌ కేటగిరి) అర్హత: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణతతో పాటు మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: 2022, మే 19. వెబ్‌సైట్‌:http://hmfw.ap.gov.in/


ఏపీ లాసెట్‌ అండ్‌ పీజీఎల్‌సెట్‌-2022

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని వర్సిటీలు, వాటి అనుబంధ కళాశాలల్లో 2022-2023 విద్యా సంవత్సరానికిగానూ ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే లాసెట్‌, పీజీ లాసెట్‌ ప్రకటన విడుదలైంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి తరఫున తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఈ పరీక్షను నిర్వహిస్తోంది.
* ఏపీ లా కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఏపీ లాసెట్‌/ ఏపీ పీజీఎల్‌సెట్‌) - 2022
కోర్సులు: 1) ఎల్‌ఎల్‌బీ (మూడేళ్లు/ ఐదేళ్లు), ఎల్‌ఎల్‌ఎం (రెండేళ్లు) ఎంపిక: ఉమ్మడి ప్రవేశపరీక్ష ఆధారంగా. పరీక్ష తేది: 2022, జులై 13. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, మే 13. దరఖాస్తులకు చివరి తేది: 2022, జూన్‌ 13. వెబ్‌సైట్‌: https://aprs.apcfss.in/

 


ప్రవేశాలు

ఏపీ గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాలు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన గుంటూరులోని ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ 2022-23 విద్యాసంవత్సరానికి ఐదో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
* ఏపీ గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాలు
అర్హత: 2022-21, 2021-22 విద్యాసంవత్సరాల్లో 3, 4 తరగతులు పూర్తి చేసి ఉండాలి. తల్లిదండ్రుల/ సంరక్షకుల వార్షికాదాయం రూ.1,00,000 మించకుండా ఉండాలి. ఎంపిక విధానం: ఆటోమేటెడ్‌ ర్యాండమ్‌ సెలక్షన్‌ (లాటరీ పద్ధతి) ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు ఫీజు: రూ.50 చెల్లించాలి. దరఖాస్తులకు చివరి తేది: 2022, మే 31. వెబ్‌సైట్‌: https://aprs.apcfss.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు