నోటిఫికేషన్స్‌

మహారత్న కంపెనీ అయిన కోల్‌ ఇండియా లిమిటెడ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 05 Jul 2022 01:15 IST

ఉద్యోగాలు
కోల్‌ ఇండియాలో..

హారత్న కంపెనీ అయిన కోల్‌ ఇండియా లిమిటెడ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* మేనేజ్‌మెంట్‌ ట్రెయినీలు

మొత్తం ఖాళీలు: 481.  విభాగాలు: పర్సనల్‌ అండ్‌ హెచ్‌ఆర్‌, ఎన్విరాన్‌మెంట్‌, మెటీరియల్స్‌ మేనేజ్‌మెంట్‌, మార్కెటింగ్‌ తదితరాలు.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ/ ఇంజినీరింగ్‌ డిగ్రీ/ పీజీ/ పీజీ డిప్లొమా/ ఎంబీఏ ఉత్తీర్ణత.

వయసు: 30 ఏళ్లు మించకూడదు. ఎంపిక: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌లో మెరిట్‌ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, జులై 08.

దరఖాస్తులకు చివరి తేదీ: 2022, ఆగస్టు 07.

వెబ్‌సైట్‌: www.coalindia.in/


కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో..

కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ (సీఎస్‌ఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన వర్క్‌మెన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 330. ఫ్యాబ్రికేషన్‌ అసిస్టెంట్లు-124, ఔట్‌ఫిట్‌ అసిస్టెంట్లు-206

విభాగాలు: షీట్‌ మెటల్‌ వర్కర్లు, వెల్డర్లు, మెకానిక్‌ డీజిల్‌, ప్లంబర్‌, పెయింటర్‌, మెషినిస్ట్‌ తదితరాలు.

అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత, అనుభవం.

వయసు: 30 ఏళ్లు మించకుండా ఉండాలి. ఎంపిక: ఆబ్జెక్టివ్‌ టైప్‌ ఆన్‌లైన్‌ టెస్ట్‌, ప్రాక్టికల్‌ టెస్ట్‌ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 2022, జులై 15.

వెబ్‌సైట్‌: https://cochinshipyard.in/


ఏపీ, డీఎంఈలో...

విజయవాడలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు

మొత్తం పోస్టులు: 59  స్పెషలైజేషన్లు: జనరల్‌ సర్జరీ, జనరల్‌ మెడిసిన్‌, పీడియాట్రిక్స్‌, అనెస్తీషియా, ఆర్థోపెడిక్స్‌, సైకియాట్రీ తదితరాలు.

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్‌ పీజీ డిగ్రీ (ఎండీ/ ఎంఎస్‌/ ఎండీఎస్‌/ డీఎం) ఉత్తీర్ణత.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 2022, జులై 13.

వెబ్‌సైట్‌: https://dme.ap.nic.in/


డీఆర్‌డీఓ-డీఎంఆర్‌ఎల్‌, హైదరాబాద్‌లో...

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని డీఆర్‌డీఓ-డిఫెన్స్‌ మెటలర్జికల్‌ రిసెర్చ్‌ ల్యాబొరేటీరీ (డీఎంఆర్‌ఎల్‌) ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 16. జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో (జేఆర్‌ఎఫ్‌)-15, రిసెర్చ్‌ అసోసియేట్‌-01. విభాగాలు/సబ్జెక్టులు: మెటలర్జీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మెకానికల్‌, మెటలర్జీ/ మెటీరియల్‌ సైన్స్‌.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్‌, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత. వాలిడ్‌ నెట్‌/ గేట్‌ స్కోర్‌.

వయసు: 28 ఏళ్లు మించకుండా ఉండాలి. ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, వెబ్‌ బేస్డ్‌/ పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా. ఈమెయిల్‌: dmrlhrd@gmail.com

దరఖాస్తులకు చివరి తేదీ: 2022, జులై 24.

వెబ్‌సైట్‌: www.drdo.gov.in/


ప్రవేశాలు
నిక్‌మార్‌, హైదరాబాద్‌లో...

హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రిసెర్చ్‌(నిక్‌మార్‌) ఫుల్‌ టైమ్‌ ఆన్‌-క్యాంపస్‌ పీజీ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

* పీజీ ప్రోగ్రాములు

కోర్సుల వ్యవధి: ఏడాది/ రెండేళ్లు

విభాగాలు: అడ్వాన్స్‌డ్‌ కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌, క్వాంటిటీ సర్వేయింగ్‌ అండ్‌ కాంట్రాక్ట్‌ మేనేజ్‌మెంట్‌, హెల్త్‌, సేఫ్టీ, ఎన్విరాన్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌, లాజిస్టిక్స్‌ అండ్‌ సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్‌, ఎనర్జీ మేనేజ్‌మెంట్‌.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

ఎంపిక: నిక్‌మార్‌ కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ ఆధారంగా.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేదీ: 2022, జులై 20.

వెబ్‌సైట్‌: https://nicmar.ac.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని