నోటిఫికేషన్స్‌

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ- ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా...  ఏఏఐ సదరన్‌ రీజియన్‌ పరిధిలోని వివిధ విమానాశ్రయాల్లో  156  పోస్టుల భర్తీకి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి, లక్షద్వీప్‌ ప్రాంతాలకు చెందిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Published : 29 Aug 2022 01:07 IST

ప్రభుత్వ ఉద్యోగాలు
వివిధ విమానాశ్రయాల్లో...

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ- ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా...  ఏఏఐ సదరన్‌ రీజియన్‌ పరిధిలోని వివిధ విమానాశ్రయాల్లో  156  పోస్టుల భర్తీకి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి, లక్షద్వీప్‌ ప్రాంతాలకు చెందిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
* జూనియర్‌ అసిస్టెంట్‌(ఫైర్‌ సర్వీస్‌) ఎన్‌ఈ-4: 132 పోస్టులు
* జూనియర్‌ అసిస్టెంట్‌(ఆఫీస్‌) ఎన్‌ఈ-4: 10 పోస్టులు
* సీనియర్‌ అసిస్టెంట్‌(అకౌంట్స్‌) ఎన్‌ఈ-6: 13 పోస్టులు
* సీనియర్‌ అసిస్టెంట్‌(అధికారిక భాష) ఎన్‌ఈ-6: 01 పోస్టు

అర్హత: పదో తరగతి, 10+2, సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత.
వయసు: 25/08/2022 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష (కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష), వైద్య, శారీరక  పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, డ్రైవింగ్‌ పరీక్ష తదితరాల ఆధారంగా.
కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష కేంద్రాలు: చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌, కొచ్చిన్‌, విజయవాడ. దరఖాస్తు రుసుము: రూ.1000.
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభ తేదీ: 01-09-2022.
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 30.09.2022.
వెబ్‌సైట్‌: 
https://www.aai.aero/


సైంటిస్ట్‌, రిహాబిలిటేషన్‌ ఆఫీసర్‌ పోస్టులు

వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 19 పోస్టుల భర్తీకి యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆన్‌లైన్‌ రిక్రూట్‌మెంట్‌ దరఖాస్తులు కోరుతోంది.
* అసిస్టెంట్‌ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌: 04 పోస్టులు, * డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌/ రీజినల్‌ డైరెక్టర్‌: 03, * రిహాబిలిటేషన్‌ ఆఫీసర్‌: 04 * సైంటిస్ట్‌-బి: 07, * ఆంత్రొపాలజిస్ట్‌: 01 పోస్టు
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు రుసుము: రూ.25.
ఎంపిక: పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 15.09.2022.
వెబ్‌సైట్‌: https://www.upsc.gov.in/


కెనరా బ్యాంకులో అసిస్టెంట్‌ మేనేజర్‌, జూనియర్‌ ఆఫీసర్‌లు

ముంబయిలోని కెనరా బ్యాంక్‌ సెక్యూరిటీస్‌ లిమిటెడ్‌...  కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* డిప్యూటీ మేనేజర్‌(కంపెనీ సెక్రటరీ): 01 పోస్టు * అసిస్టెంట్‌ మేనేజర్‌(బ్యాక్‌ ఆఫీస్‌ కంప్లయన్స్‌, ఇన్‌స్టిట్యూషనల్‌ డీలర్‌, సర్వైలెన్స్‌): 03, * జూనియర్‌ ఆఫీసర్‌ (కేవైసీ, బ్యాక్‌ ఆఫీస్‌- సెటిల్మెంట్‌, రిటైల్‌ డీలర్‌): 04, * అసిస్టెంట్‌ మేనేజర్‌- ఐటీ డేటాబేస్‌ అడ్మినిస్ట్రేటర్‌: 01, * అసిస్టెంట్‌ మేనేజర్‌ బ్యాక్‌ ఆఫీస్‌: 01 పోస్టు 
స్పెషల్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ 2022-23:
* జూనియర్‌ ఆఫీసర్‌ కేవైసీ/ బ్యాక్‌ ఆఫీస్‌: 2 పోస్టులు
* జూనియర్‌ ఆఫీసర్‌ కేవైసీ/ రిటైల్‌/ బ్యాక్‌ ఆఫీస్‌: 02 పోస్టులు
అర్హత: డిగ్రీ, ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం, సెక్యూరిటీస్‌ మార్కెట్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్, ఎన్‌ఐఎస్‌ఎం/ ఎన్‌సీఎఫ్‌ఎం సర్టిఫికేషన్‌తో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక: షార్ట్‌ లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.
పని ప్రదేశం: ముంబయి, బెంగళూరు.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను జనరల్‌ మేనేజర్‌, హెచ్‌ఆర్‌ డిపార్ట్‌మెంట్‌, కెనరా బ్యాంక్‌ సెక్యూరిటీస్‌ లిమిటెడ్‌, 7వ అంతస్తు, నారిమన్‌ పాయింట్‌, ముంబయి చిరునామాకు పంపించాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 05.09.2022.
వెబ్‌సైట్‌: 
www.canmoney.in


కృష్ణా జిల్లాలో ఎంవో, స్టాఫ్‌ నర్సులు

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఐసీటీసీ, ఏఆర్‌టీ, బ్లడ్‌ బ్యాంకుల్లో నేషనల్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ ప్రోగ్రాం 23 పోస్టుల భర్తీకి మచిలీపట్నంలోని కుష్ఠు, ఎయిడ్స్‌ ఖీ క్షయ నియంత్రణ కార్యాలయం దరఖాస్తులు కోరుతోంది.
* ఐసీటీసీ ల్యాబ్‌ టెక్నీషియన్‌: 02 పోస్టులు, * ఏఆర్‌టీ మెడికల్‌ ఆఫీసర్‌: 04, * ఏఆర్‌టీ కౌన్సెలర్లు: 03, * ఏఆర్‌టీ స్టాఫ్‌ నర్సులు: 05, * ఏఆర్‌టీ ఫార్మాసిస్ట్‌: 01, * ఏఆర్‌టీ ల్యాబ్‌ టెక్నీషియన్‌: 01, * ఏఆర్‌టీ కమ్యూనిటీ కేర్‌ కోఆర్డినేటర్‌: 01, * ఎల్‌ఏసీ ప్లస్‌ స్టాఫ్‌ నర్సులు: 02, * బ్లడ్‌ సెంటర్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌: 03, * బ్లడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వ్యాన్‌ అటెండెంట్‌ : 01 పోస్టు
అర్హత: పదోతరగతి, డిప్లొమా, డిగ్రీ, ఎంబీబీఎస్‌, బీఎస్సీ నర్సింగ్‌, పీజీ ఉత్తీర్ణత.
వయసు: 42 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులు, సంబంధిత ధ్రువపత్రాల నకళ్లను కుష్ఠు, ఎయిడ్స్‌ ఖీ క్షయ నియంత్రణ అధికారి కార్యాలయం, మల్కపట్నం, మచిలీపట్నం చిరునామాలో అందజేయాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: 02.09.2022.
వెబ్‌సైట్‌: 
https://krishna.ap.gov.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని