నోటిఫికేషన్స్‌

యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ బ్యాక్‌లాగ్‌ రిజర్వుడ్‌ ఫ్యాకల్టీ ఖాళీలను భర్తీ చేయనుంది. 38 ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల పోస్టుల నియామకానికి అర్హులైన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Published : 12 Oct 2022 00:35 IST

ఉద్యోగాలు


సెంట్రల్‌ వర్సిటీలో ఫ్యాకల్టీ పోస్టులు

యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ బ్యాక్‌లాగ్‌ రిజర్వుడ్‌ ఫ్యాకల్టీ ఖాళీలను భర్తీ చేయనుంది. 38 ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల పోస్టుల నియామకానికి అర్హులైన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
విభాగాలు: సైన్సెస్‌, హ్యుమానిటీస్‌, ఎకనామిక్స్‌, సోషల్‌ సైన్సెస్‌, పెర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌, మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌.
అర్హత: సంబంధిత విభాగంలో పీజీ, ఎంఫిల్‌/ పీహెచ్‌డీ, నెట్‌/ స్లెట్‌/ సెట్‌ ఉత్తీర్ణతతో పాటు బోధన/ పరిశోధన అనుభవం ఉండాలి. వయసు: 65 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక: అభ్యర్థి పూర్వానుభవం, ప్రతిభ, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.1000 (ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రిజిస్ట్రేషన్‌ ఫీజు లేదు). ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 10.11.2022. దరఖాస్తు హార్డ్‌కాపీ స్వీకరణకు చివరి తేదీ: 17.11.2022. వెబ్‌సైట్‌: 
https://uohyd.ac.in/


బేసిల్‌-దిల్లీ ప్రభుత్వ ఆస్పత్రిలో 51 ఖాళీలు

బ్రాడ్‌కాస్ట్‌ ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (బేసిల్‌) దిల్లీ ప్రభుత్వాసుపత్రిలో 51 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
1. డేటా ఎంట్రీ ఆపరేటర్‌: 12వ తరగతి/ తత్సమాన ఉత్తీర్ణత,  నిబంధనల ప్రకారం కంప్యూటర్‌ టైపింగ్‌ స్పీడ్‌.
2. టెక్నికల్‌ అసిస్టెంట్‌: బీఎస్సీ డిగ్రీ ఉత్తీర్ణత. వయసు: 40 ఏళ్లు మించకూడదు. ఎంపిక: స్కిల్‌ టెస్ట్‌/ రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా .ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 26.10.2022
వెబ్‌సైట్‌: 
www.becil.com/vacancies


ఐఐటీ-కాన్పూర్‌లో జూనియర్‌ అసిస్టెంట్లు

కాన్పూర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) 119 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: బ్యాచిలర్స్‌ డిగ్రీ (కంప్యూటర్‌ అప్లికేషన్‌) ఉత్తీర్ణత.
వయసు: 21-30 ఏళ్లు ఉండాలి. ఎంపిక: రాతపరీక్ష/ జాబ్‌ ఓరియంటెడ్‌ ప్రాక్టికల్‌ టెస్ట్‌ ఆధారంగా. దరఖాస్తు ఫీజు: రూ.700
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 09.11.2022
వెబ్‌సైట్‌: 
https://iitk.ac.in/new/recruitment


78 రిసెర్చ్‌ అసోసియేట్‌ పోస్టులు

ముంబయిలోని బాబా అటామిక్‌ రిసెర్చ్‌ సెంటర్‌ (బార్క్‌) 78 రిసెర్చ్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు: ఆర్‌ అండ్‌ డీ, కంప్యూటేషనల్‌ కెమిస్ట్రీ, హైడ్రోజన్‌ ఎనర్జీ అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంటెక్‌/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత. ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా. చిరునామా: Deputy Establishment Officer, Recruitment-V, Central Complex, BARC, Trombay,
Mumbai-400085 దరఖాస్తుకు చివరి తేదీ: 28.10.2022.
వెబ్‌సైట్‌:
 www.barc.gov.in/careers/recruitment.html


అప్రెంటిస్‌షిప్‌

ఆర్టీసీలో గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌షిప్‌లు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రీజియన్లవారీగా 150 అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
అర్హత: బీకాం, బీఎస్సీ, బీఏ, బీబీఏ, బీసీఏ ఉత్తీర్ణత.
వయసు: 01.07.2022 నాటికి 21- 35 సంవత్సరాల మధ్య ఉండాలి. స్ట్టైపెండ్‌: మొదటి, రెండు, మూడు సంవత్సరాలకు వరుసగా నెలకు రూ.15000, రూ.16000, రూ.17000 చెల్లిస్తారు.
ఎంపిక: విద్యార్హతలు, ధ్రువపత్రాల పరిశీలన, స్థానికత ఆధారంగా.
దరఖాస్తు సమర్పణకు ముందు 
www.mhrdnats.gov.in-లో వివరాలను నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత అదే వెబ్‌సైట్‌లో టీఎస్‌ఆర్టీసీని ఎంపిక చేసుకుని  STLHDS000005 యూజర్‌ ఐడీ ద్వారా 16.10.2022లోగా దరఖాస్తు సమర్పించాలి.  
వెబ్‌సైట్‌:
 www.tsrtc.telangana.gov.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని