నోటిఫికేషన్స్

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన 681 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి అమరావతిలోని ఏపీ హైకోర్టు ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

Updated : 01 Nov 2022 07:08 IST

ఉద్యోగాలు

జిల్లా కోర్టుల్లో 681 జూనియర్‌ అసిస్టెంట్‌లు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన 681 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి అమరావతిలోని ఏపీ హైకోర్టు ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.
జిల్లాల వారీగా ఖాళీలు:

* అనంతపురం- 53* చిత్తూరు- 67* తూర్పు గోదావరి- 80
* గుంటూరు- 64* వైఎస్‌ఆర్‌ కడప- 46* కృష్ణా- 68
కర్నూలు- 17* ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు- 33* ప్రకాశం- 41
శ్రీకాకుళం- 62విశాఖపట్నం- 71*విజయనగరం- 21
* పశ్చిమ గోదావరి- 58
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్‌ పరిజ్ఞానం/ కంప్యూటర్‌ ఆపరేషన్‌ అర్హత తప్పనిసరి.
వయసు: 01-07-2022 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.800 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.400).
ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 22-10-2022.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 11-11-2022.

వెబ్‌సైట్‌: https://hc.ap.nic.in/recruitment.html


డబ్ల్యూఎస్‌సీ-గువాహటిలో..

భారత ప్రభుత్వ జౌళీ మంత్రిత్వ శాఖకు చెందిన గువాహటిలోని వీవర్స్‌ సర్వీస్‌ సెంటర్‌ (డబ్ల్యూఎస్‌సీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 30
పోస్టులు: జూనియర్‌ వీవర్‌, సీనియర్‌ ప్రింటర్‌, జూనియర్‌ ప్రింటర్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్‌/ ఐటీఐ/ డిప్లొమా ఉత్తీర్ణత.
వయసు: 27-30 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: ప్రాక్టికల్‌ టెస్ట్‌, రాతపరీక్ష ఆధారంగా.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
చిరునామా: ది డైరెక్టర్‌, వీవర్స్‌ సర్వీస్‌ సెంటర్‌, ఐఐహెచ్‌టీ క్యాంపస్‌, జవహర్‌ నగర్‌, ఖానపర, గువాహటి 781022.
దరఖాస్తుకు చివరి తేదీ: ఉద్యోగ ప్రకటన వెలువడిన 45 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.

వెబ్‌సైట్‌: http://handlooms.nic.in/


ఎన్‌ఐడబ్ల్యూఈ-చెన్నైలో 16 పోస్టులు

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన చెన్నైలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ విండ్‌ ఎనర్జీ (ఎన్‌ఐడబ్ల్యూఈ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 16
పోస్టులు: ప్రోగ్రామ్‌ కోఆర్డినేటర్‌, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌, ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ తదితరాలు.
విభాగాలు: మేనేజ్‌మెంట్‌, ఫైనాన్షియల్‌, టెక్నికల్‌, గ్రేడ్‌ 1 తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి బ్యాచిలర్‌ డిగ్రీ/ బీఈ/ బీటెక్‌/ డిప్లొమా/ మాస్టర్స్‌ డిగ్రీ/ ఎంబీఏ ఉత్తీర్ణత.
వయసు: 28-40 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: రాతపరీక్ష/ ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా.
దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చివరి తేది: 11.11.2022

వెబ్‌సైట్‌: https://niwe.res.in/careers.php


అప్రెంటిస్‌షిప్‌

యురేనియం కార్పొరేషన్‌లో 239 ఖాళీలు
ఝార్ఖండ్‌ రీజియన్‌ జాదుగూడ మైన్స్‌లోని భారత ప్రభుత్వ రంగ సంస్థ- యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (యూసిల్‌) ట్రేడ్‌ అప్రెంటిస్‌షిప్‌ శిక్షణకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.
ట్రేడులు: ఫిట్టర్‌, ఎలక్ట్రీషియన్‌, వెల్డర్‌ (గ్యాస్‌ అండ్‌ ఎలక్ట్రిక్‌), టర్నర్‌/ మెషినిస్ట్‌, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్‌, మెకానిక్‌ (డీజిల్‌/ ఎంవీ), కార్పెంటర్‌, ప్లంబర్‌.
యూనిట్లవారీగా ఖాళీలు: జాదుగూడ యూనిట్‌- 106, నర్వాపహార్‌ యూనిట్‌- 52, తురమ్దిహ్‌ యూనిట్‌- 81.
అర్హత: మెట్రిక్యులేషన్‌/ పదోతరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ.
వయసు: 30.11.2022 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: ఐటీఐలో సాధించిన మార్కులతో.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 30.11.2022.

వెబ్‌సైట్‌: https://ucil.gov.in/


హైదరాబాద్‌ డీఎల్‌ఆర్‌ఎల్‌లో 101 ఖాళీలు

డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీవో)కు చెందిన హైదరాబాద్‌లోని డిఫెన్స్‌ ఎలక్ట్రానిక్స్‌ రిసెర్చ్‌ ల్యాబొరేటరీ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ట్రేడులు: సీవోపీఏ, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌, ఫిట్టర్‌, మెషినిస్ట్‌, టర్నర్‌, కార్పెంటర్‌, షీట్‌ మెటల్‌, వెల్డర్‌, ఎలక్ట్రోప్లేటింగ్‌, ప్లాస్టిక్‌ ప్రాసెసింగ్‌, డ్రాఫ్ట్స్‌మ్యాన్‌ (మెకానికల్‌), డ్రాఫ్ట్స్‌మ్యాన్‌ (సివిల్‌), సెక్రటేరియల్‌ ట్రైనింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌, డీజిల్‌ మెకానిక్‌, ఫైర్‌మ్యాన్‌, కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ అండ్‌ నెట్‌వర్కింగ్‌, బుక్‌ బైండింగ్‌, ఏఎన్‌ఎం.
అర్హత: ఐటీఐ, డిప్లొమా, ఏఎన్‌ఎం.
స్టైపెండ్‌: నెలకు రూ.7700-రూ.8050.
ఎంపిక: అకడమిక్‌ మెరిట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: ఎంప్లాయ్‌మెంట్‌ న్యూస్‌లో ప్రకటన వెలువడిన తేదీ నుంచి 21 రోజుల్లోగా దరఖాస్తు చేయాలి.

వెబ్‌సైట్‌: https://rac.gov.in/index.php?lang=en&id=0


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని