ప్రభుత్వ ఉద్యోగాలు

ఒడిశా రాష్ట్రం రవుర్కెలాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ.. ఇంజినీరింగ్‌, ఆర్కిటెక్చర్‌, సైన్స్‌, హ్యుమానిటీస్‌, మేనేజ్‌మెంట్‌లోని వివిధ స్పెషలైజేషన్లలో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 29 Nov 2022 00:38 IST

నిట్‌ రవుర్కెలాలో టీచింగ్‌ పోస్టులు

డిశా రాష్ట్రం రవుర్కెలాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ.. ఇంజినీరింగ్‌, ఆర్కిటెక్చర్‌, సైన్స్‌, హ్యుమానిటీస్‌, మేనేజ్‌మెంట్‌లోని వివిధ స్పెషలైజేషన్లలో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 143.

1. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గ్రేడ్‌-2: 53 పోస్టులు

2. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గ్రేడ్‌-2: 59 పోస్టులు

3. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గ్రేడ్‌-1: 11 పోస్టులు

4. అసోసియేట్‌ ప్రొఫెసర్‌: 17 పోస్టులు

5. ప్రొఫెసర్‌: 03 పోస్టులు

విభాగాలు: బయోటెక్నాలజీ అండ్‌ మెడికల్‌ ఇంజినీరింగ్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌, సిరామిక్‌ ఇంజినీరింగ్‌, కెమికల్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, ఎర్త్‌ అండ్‌ అట్మాస్ఫియరిక్‌ సైన్సెస్‌, ఫుడ్‌ ప్రాసెస్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, మెటలర్జికల్‌ అండ్‌ మెటీరియల్స్‌ ఇంజినీరింగ్‌, మైనింగ్‌ ఇంజినీరింగ్‌, హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌, ఇండస్ట్రియల్‌ డిజైన్‌, లైఫ్‌ సైన్స్‌, మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌ అండ్‌ ఆస్ట్రానమీ, మేనేజ్‌మెంట్‌.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీతో పాటు పని అనుభవం.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 30.12.2022

వెబ్‌సైట్‌: https://www.nitrkl.ac.in/ 


ఈఎస్‌ఐసీలో స్పెషలిస్ట్‌లు

ఎంప్లాయీ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌.. హైదరాబాద్‌, చెన్నైలోని సంస్థల ఆసుపత్రుల్లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన స్పెషలిస్ట్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

స్పెషలిస్ట్‌ గ్రేడ్‌-2 (సీనియర్‌ స్కేల్‌): 33 పోస్టులు

స్పెషాలిటీ: కార్డియాలజీ, కార్డియో థొరాసిక్‌, ఎండోక్రైనాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, క్యాన్సర్‌ సర్జరీ, యూరాలజీ, పీడియాట్రిక్‌ సర్జరీ, ప్లాస్టిక్‌ సర్జరీ, థొరాసిక్‌ సర్జరీ.

అర్హత: సంబంధిత స్పెషాలిటీలో ఎంబీబీఎస్‌, డీఎం, ఎంసీహెచ్‌, పీజీ.  

దరఖాస్తు రుసుము: రూ.500 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌లకు ఫీజు మినహాయింపు ఉంటుంది).  

ఎంపిక: ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన, తదితరాల ఆధారంగా.

దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 27.12.2022

వెబ్‌సైట్‌: https://www.esic.nic.in/


ప్రవేశాలు

మహిళా గురుకులాల్లో వ్యవసాయ డిగ్రీ

  

మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) పరిధిలోని గురుకుల వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాలల్లో 2022-23 విద్యా సంవత్సరానికి బీఎస్సీ (ఆనర్స్‌) అగ్రికల్చర్‌ ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళలు దరఖాస్తుకు అర్హులు. ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఉచిత భోజన, వసతి సౌకర్యాలు ఉంటాయి.

బీఎస్సీ(ఆనర్స్‌) అగ్రికల్చర్‌ కోర్సు

వ్యవధి: నాలుగేళ్లు
కళాశాల, సీట్లు:

1. ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ మహిళా వ్యవసాయ కళాశాల, వనపర్తి: 120 సీట్లు

2. ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ మహిళా వ్యవసాయ కళాశాల, కరీంనగర్‌: 120 సీట్లు

అర్హత: తెలంగాణ రాష్ట్ర మహిళా అభ్యర్థులు అర్హులు. అభ్యర్థి తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,50,000, పట్టణ ప్రాంతాల్లో రూ.2,00,000 మించకూడదు. ఫిజికల్‌ సైన్సెస్‌, బయలాజికల్‌ సైన్సెస్‌ ప్రధాన సబ్జెక్టులుగా ఇంటర్మీడియట్‌ లేదా డిప్లొమా (అగ్రికల్చర్‌/ సీడ్‌ టెక్నాలజీ/ ఆర్గానిక్‌ అగ్రికల్చర్‌) ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు తెలంగాణ ఎంసెట్‌-2022 లేదా పీజేటీఎస్‌ఏయూ అగ్రిసెట్‌-2022లో అర్హత సాధించాలి.
వయసు: 17 - 22 సంవత్సరాల మధ్యలో ఉండాలి.

సీట్ల కేటాయింపు: బీసీ అభ్యర్థులకు 75%, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 5%, జనరల్‌/ఈబీసీలకు 2%, అనాథలకు 3% సీట్లు కేటాయించారు. టీఎస్‌ ఎంసెట్‌-2022 ర్యాంకు ద్వారా 85%, పీజేటీఎస్‌ఏయూ అగ్రిసెట్‌-2022 ర్యాంకు ద్వారా 15% సీట్లు భర్తీ చేస్తారు.

దరఖాస్తు: ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేయాలి.

దరఖాస్తు రుసుము: రూ.900.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 05.12.2022

దరఖాస్తులో వివరాల సవరణ తేదీలు: 06, 07.12.2022

మెరిట్‌ జాబితా వెల్లడి: 10.12.2022

వెబ్‌సైట్‌: https://ug.mjptbcwreis.net/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు