నోటీసు బోర్డు

తెలంగాణ జ్యుడీషియల్‌ మినిస్టీరియల్‌ సర్వీసులో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నోటిఫికేషన్‌ జారీ చేసింది.  

Updated : 05 Jan 2023 02:09 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

తెలంగాణ జిల్లా కోర్టుల్లో 1226 ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టులు

తెలంగాణ జ్యుడీషియల్‌ మినిస్టీరియల్‌ సర్వీసులో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నోటిఫికేషన్‌ జారీ చేసింది.  
అర్హత: కనీసం ఏడో తరగతి ఉత్తీర్ణత. పదో తరగతి కంటే ఎక్కువ విద్యార్హత ఉన్నవారు అనర్హులు. అభ్యర్థులు దరఖాస్తులో వృత్తిపరమైన నైపుణ్యాలను పేర్కొనడంతో పాటు స్థానిక భాషలు తెలిసి ఉండాలి.
వయసు: 01-07-2022 నాటికి 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఐదేళ్లు; దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక: సీబీటీ/ ఓఎంఆర్‌ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
ప్రశ్నపత్రం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష(సీబీటీ)/ ఓఎంఆర్‌ పరీక్షలో 45 ప్రశ్నలుంటాయి. జనరల్‌ నాలెడ్జ్‌లో 30, జనరల్‌ ఇంగ్లిష్‌లో 15 ప్రశ్నలుంటాయి. ప్రశ్నకు ఒక మార్కు. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు.
దరఖాస్తు రుసుం: ఓసీ/ ఓబీసీలకు రూ.600 (ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌లకు రూ.400).
ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 11-01-2023.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 31-01-2023.
కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష తేదీ: మార్చి 2023.
వెబ్‌సైట్‌: https://tshc.gov.in/getRecruitDetails


ఎయిమ్స్‌ రాయ్‌పూర్‌లో 112 సీనియర్‌ రెసిడెంట్‌లు

రాయ్‌పూర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ సీనియర్‌ రెసిడెంట్‌ (నాన్‌ అకడమిక్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
విభాగాలు: అనస్థీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, బర్న్స్‌ అండ్‌ ప్లాస్టిక్‌ సర్జరీ, కార్డియాలజీ, కార్డియోథొరాసిక్‌ సర్జరీ, క్లినికల్‌ హెమటాలజీ, కమ్యూనిటీ అండ్‌ ఫ్యామిలీ మెడిసిన్‌, డెంటిస్ట్రీ కన్జర్వేటివ్‌ డెంటిస్ట్రీ అండ్‌ ఎండోడోంటిక్స్‌, పెడోడాంటిక్స్‌/ పీడియాట్రిక్స్‌ అండ్‌ ప్రివెంటివ్‌ డెంటిస్ట్రీ, డెర్మటాలజీ, ఎండోక్రైనాలజీ అండ్‌ మెటబాలిజం, ఈఎన్‌టీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ అండ్‌ టాక్సికాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, మెడికల్‌ ఆంకాలజీ, మైక్రోబయాలజీ, నియోనటాలజీ తదితరాలు.
అర్హత: సంబంధిత విభాగంలో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ డిగ్రీ(ఎండీ/ ఎంఎస్‌/ డీఎన్‌బీ), ఎండీఎస్‌, డిప్లొమా ఉత్తీర్ణత.
వయోపరిమితి: 45 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక: ఇంటర్వ్యూ/ రాత పరీక్ష ఆధారంగా.
దరఖాస్తుకు చివరి తేదీ: 31.01.2023.
వెబ్‌సైట్‌:https://www.aiimsraipur.edu.in/index.php


వాక్ ఇన్ 

కొంకణ్‌ రైల్వేలో అసిస్టెంట్‌, ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ ఖాళీలు

నవీ ముంబయిలోని కొంకణ్‌ రైల్వే కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఒప్పంద ప్రాతిపదికన కేఆర్‌సీఎల్‌ ప్రాజెక్టుల్లో సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో పోస్టుల భర్తీకి వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
1. అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌: 3  2. ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌: 3
3. సీనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌: 25 4. జూనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌: 10.
మొత్తం ఖాళీలు: 41
అర్హత: బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌ (సివిల్‌ ఇంజినీరింగ్‌)తోపాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక: విద్యార్హత, పని అనుభవం, ఇంటర్వ్యూ, గ్రూప్‌ డిస్కషన్‌తో
ఇంటర్వ్యూ తేదీలు: 19/01/2023, 20/01/2023, 23/01/2023, 24/01/2023, 30/01/2023.
వేదిక: ఎగ్జిక్యూటివ్‌ క్లబ్‌, కొంకణ్‌ రైల్‌ విహార్‌, కొంకణ్‌ రైల్వే కార్పొరేషన్‌ లిమిటెడ్‌, సీవుడ్స్‌ రైల్వే స్టేషన్‌ దగ్గర, సెక్టార్‌-40, సీవుడ్స్‌ (పశ్చిమ), నవీ ముంబయి.

వెబ్‌సైట్‌:ttps://konkanrailway.com/


సీఆర్‌పీఎఫ్‌లో 40 స్పెషలిస్ట్‌ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ ఒప్పంద ప్రాతిపదికన దేశ వ్యాప్తంగా ఉన్న సీఆర్‌పీఎఫ్‌ ఆసుపత్రుల్లో స్పెషలిస్ట్‌ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
స్పెషలిస్ట్‌ మెడికల్‌ ఆఫీసర్‌: 40 పోస్టులు
విభాగాలు: రేడియాలజీ, అనస్థీషియా, ఓఅండ్‌జీ, సర్జన్‌, ఐ.
అర్హత: సంబంధిత స్పెషాలిటీలో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ/ డిప్లొమా, పని అనుభవం ఉండాలి. వయసు 70 ఏళ్లకు మించకూడదు.
జీత భత్యాలు: నెలకు రూ.85,000.
ఇంటర్వ్యూ తేదీ: 23-01-2023.
వేదిక: సీఆర్‌పీఎఫ్‌- కాంపోజిట్‌ హాస్పిటల్‌ (జమ్మూ/ ప్రయాగ్‌రాజ్‌/ రాంపూర్‌/ దిల్లీ/ అజ్‌మేర్‌/ నీముచ్‌/ రాంచీ/ బిలాస్‌పూర్‌/ జగదల్‌పూర్‌/ నాగ్‌పుర్‌/ పుణె/ పిల్లిపురం/ ఆవడి/ హైదరాబాద్‌/ గువాహటి/ సిల్చార్‌/ ఇంఫాల్‌).

వెబ్‌సైట్‌: https://crpf.gov.in/


అప్రెంటిస్‌
సికింద్రాబాద్‌ దక్షిణ మధ్య రైల్వేలో 4103 అప్రెంటిస్‌లు

సికింద్రాబాద్‌లోని రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌(ఆర్‌ఆర్‌సీ)- దక్షిణ మధ్య రైల్వే ఎస్‌సీఆర్‌ వర్క్‌షాప్‌/ యూనిట్‌ల్లో యాక్ట్‌ అప్రెంటిస్‌ శిక్షణలో ప్రవేశాలకు ఐటీఐ ఉత్తీర్ణుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది. ఎస్‌సీఆర్‌ పరిధిలోకి వచ్చే జిల్లాల్లో నివసించే అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.
ట్రేడుల వారీగా ఖాళీలు: ఏసీ మెకానిక్‌-250, కార్పెంటర్‌-18, డీజిల్‌ మెకానిక్‌-531, ఎలక్ట్రీషియన్‌- 1019, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌- 92, ఫిట్టర్‌-1460, మెషినిస్ట్‌-71, మెకానిక్‌ మెషిన్‌ టూల్‌ మెయింటెనెన్స్‌-05, మిల్‌రైట్‌ మెయింటెనెన్స్‌-24, పెయింటర్‌-80, వెల్డర్‌-553
మొత్తం ఖాళీలు: 4103.
ఎస్‌సీఆర్‌ యూనిట్లు: క్యారేజ్‌ వర్క్‌షాప్‌/ లల్లాగూడ, ఎలక్ట్రిక్‌ లోకో షెడ్‌/ లల్లాగూడ, ఎలక్ట్రిక్‌ మెయింటెనెన్స్‌/ లల్లాగూడ, మెయింటెనెన్స్‌ (సికింద్రాబాద్‌), డీజిల్‌ లోకో షెడ్‌/ మౌలాలి, ఎంఈఎంయూ కార్‌ షెడ్‌/ మౌలాలి, మెయింటెనెన్స్‌/ హైదరాబాద్‌, టీఆర్‌డీ/ హైదరాబాద్‌, ఎస్‌అండ్‌టీ వర్క్‌షాప్‌/ సికింద్రాబాద్‌/ ఖాజీపేట, డీజిల్‌ లోకో షెడ్‌/ ఖాజీపేట, ఎలక్ట్రిక్‌ లోకో షెడ్‌/ ఖాజీపేట, డీజిల్‌ లోకో షెడ్‌/ విజయవాడ, ఎలక్ట్రిక్‌ లోకో షెడ్‌/ విజయవాడ, సీఅండ్‌డబ్ల్యూ డిపో/ విజయవాడ, టీఆర్‌డీ/ విజయవాడ, మెయింటెనెన్స్‌/ విజయవాడ, వ్యాగన్‌ వర్క్‌షాప్‌/ గుంటుపల్లి, మెయింటెనెన్స్‌/ గుంటూరు, ఎంఈఎంయూ కార్‌ షెడ్‌/ రాజమండ్రి, డీజిల్‌ లోకో షెడ్‌/ గుంతకల్‌, మెయింటెనెన్స్‌/ గుంతకల్‌, సీఅండ్‌డబ్ల్యూ డిపో/ గుంతకల్‌, డీజిల్‌ లోకో షెడ్‌/ గుత్తి, సీఆర్‌ఎస్‌/ తిరుపతి, జీఎస్‌/ తిరుపతి, సీఅండ్‌డబ్ల్యూ డిపో/ తిరుపతి, మెయింటెనెన్స్‌/ నాందేడ్‌, సీఅండ్‌డబ్ల్యూ డిపో/ నాందేడ్‌, సీఅండ్‌డబ్ల్యూ డిపో/ పూర్ణ.
అర్హత: కనీసం 50% మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత.
వయసు: 30.12.2022 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: పదోతరగతి, ఐటీఐలో సాధించి మార్కుల ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.100 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు మినహాయింపు).
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 29-01-2023.

వెబ్‌సైట్‌: scr.indianrailways.gov.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని