నోటిఫికేషన్స్

న్యూదిల్లీలోని డాక్టర్‌ రామ్‌ మనోహర్‌ లోహియా హాస్పిటల్‌, అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌.. 139 సీనియర్‌ రెసిడెంట్‌ (నాన్‌-అకడమిక్‌) ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Updated : 28 Feb 2023 05:08 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

139 సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు

న్యూదిల్లీలోని డాక్టర్‌ రామ్‌ మనోహర్‌ లోహియా హాస్పిటల్‌, అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌.. 139 సీనియర్‌ రెసిడెంట్‌ (నాన్‌-అకడమిక్‌) ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

విభాగాలు: అనస్థీషియా, బయోకెమిస్ట్రీ, ట్రాన్స్‌ఫ్యూజన్‌ మెడిసిన్‌, డెర్మటాలజీ, ఎండోక్రైనాలజీ, మైక్రోబయాలజీ, పాథాలజీ, రేడియాలజీ, సైకియాట్రీ తదితరాలు.

అర్హత: ఎంబీబీఎస్‌, సంబంధిత స్పెషాలిటీలో పీజీ డిగ్రీ, డిప్లొమా, డీఎన్‌బీ.

వయసు: 13-03-2023 నాటికి 45 సంవత్సరాలు మించకూడదు.

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.800 (ఈడబ్ల్యూఎస్‌/ ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు).

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘సెంట్రల్‌ డైరీ, డిస్పాచ్‌ సెక్షన్‌, గేట్‌ నెం.3, ఏబీవీఐఎంఎస్‌ అండ్‌ డాక్టర్‌ రామ్‌ మనోహర్‌ లోహియా హాస్పిటల్‌, న్యూదిల్లీ’ చిరునామాకు పంపించాలి.

దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 13-03-2023.

రాత పరీక్ష తేదీ: 09-04-2023.

ఫలితాల ప్రకటన: 13.04.2023. 

వెబ్‌సైట్‌:https://rmlh.nic.in/


ఈపీఎఫ్‌వోలో 557 ఉద్యోగాలు 

ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (ఈపీఎఫ్‌ఓ)లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌, ఏపీఎఫ్‌సీ పోస్టుల భర్తీకి యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ దరఖాస్తులు కోరుతోంది. 

* ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌/ అకౌంట్స్‌ ఆఫీసర్‌: 418 

*అసిస్టెంట్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ కమిషనర్‌: 159 

* మొత్తం ఖాళీల సంఖ్య: 577.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ.

వయసు: ఈవో/ ఏవో పోస్టులకు 30 ఏళ్లు, ఏపీఎఫ్‌సీ పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు.

ఎంపిక: రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.25 (మహిళలు/ ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు).

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: విజయవాడ, విశాఖపట్నం, వరంగల్‌, అనంతపురం, హైదరాబాద్‌.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 17-03-2023. 

వెబ్‌సైట్‌: https://www.upsc.gov.in/


స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌లో..

భోపాల్‌లోని స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌.. 20 టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* ప్రొఫెసర్‌: 04 

* అసోసియేట్‌ ప్రొఫెసర్‌: 10 

* అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌: 06   

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీతో పాటు పని అనుభవం.

ఎంపిక: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 31.03.2023.

ఆఫ్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 10.04.2023. 

వెబ్‌సైట్‌: https://spabhopal.ac.in/Home.aspx


బెల్‌-పుణెలో 30 ఇంజినీర్‌ పోస్టులు

పుణెలోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) 30 ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు: ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, హెచ్‌ఆర్‌ తదితరాలు.
1. ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ ఇంజినీరింగ్‌; వయసు: 32 ఏళ్లు మించకూడదు. దరఖాస్తు ఫీజు: రూ.472.
2. ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీఏ/ ఎంఎస్‌డబ్ల్యూ/ పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా; వయసు: 32 ఏళ్లు మించకూడదు. దరఖాస్తు ఫీజు: రూ.472.
3. ట్రెయినీ ఇంజినీర్‌: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ ఇంజినీరింగ్‌; వయసు: 28 ఏళ్లు మించకూడదు. దరఖాస్తు ఫీజు: రూ.177.
ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 08.03.2023.
వెబ్‌సైట్‌:https://bel-india.in/Default.aspx 


ప్రవేశాలు 

మహాత్మా జ్యోతిబాఫూలే ఆర్‌జేసీ అండ్‌ ఆర్‌డీసీ సెట్‌ 

మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ  రాష్ట్రంలోని వివిధ జూనియర్‌ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో 2023-2024 విద్యా సంవత్సరానికిగాను ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
1) జూనియర్‌ కళాశాలలు (ఇంగ్లిష్‌ మీడియం)
* మొత్తం-255 (బాలురు-130, బాలికలు-125)
* ఇంటర్‌ గ్రూపులు (ఇంగ్లిష్‌ మీడియం): ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ ఇతర వృత్తి విద్యా కోర్సులు.
అర్హత: 10వ తరగతి/ ఎస్‌ఎస్‌సీ చదువుతున్నవారు  
2) మహిళా డిగ్రీ కళాశాలలు-14 (ఇంగ్లిష్‌ మీడియం) మహిళలు-06, పురుషులు-08.
అర్హత: ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నవారు.
కళాశాలలు అందిస్తున్న డిగ్రీ కోర్సులు:
1. బీఎస్సీ ఫిజికల్‌ సైన్సెస్‌: ఎంపీసీ, ఎంసీసీఎస్‌, ఎంఎస్‌సీఎస్‌, ఎంఎస్‌డీఎస్‌, ఎంఎస్‌ఏఐ అండ్‌ ఎంఎల్‌, ఎంపీజీ, ఎంఈఎస్‌ అండ్‌ ఎంఈసీఎస్‌.
2. బీఎస్సీ లైఫ్‌ సైన్సెస్‌: బీజెడ్‌సీ, బీజెడ్‌జీ, బీబీసీసీ, బీటీబీసీసీ, బీటీజెడ్‌సీ, ఎంబీజెడ్‌సీ, ఎంబీజెడ్‌సీ, ఎన్‌జెడ్‌సీ అండ్‌ ఏఎన్‌పీహెచ్‌బీసీ.
3. బీకాం: జనరల్‌, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌, బిజినెస్‌ అనలిటిక్స్‌.
4. బీఏ: ఈపీహెచ్‌, హెచ్‌పీఈ, ఐఆర్‌ఈపీ, పీపీజీఈపీ.
5. బీబీఏ   6. బీఎఫ్‌టీ.
ఎంపిక: ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్‌ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తు ఫీజు: రూ.200.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 16.04.2023.
హాల్‌టికెట్లు డౌన్‌లోడింగ్‌ తేదీ: 20.04.2023.
ప్రవేశ పరీక్ష తేదీ: 29.04.2023.
వెబ్‌సైట్‌:http://mjptbcwreis.telangana.gov.in/ 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని