న్యూక్లియర్‌ ఫ్యూయల్‌ కాంప్లెక్స్‌లో కొలువులు

అణుశక్తి విభాగానికి చెందిన ‘న్యూక్లియర్‌ ఫ్యూయల్‌ కాంప్లెక్స్‌’ (హైదరాబాద్‌) అర్ధ  శతాబ్దానికి పైగా దేశ సేవలో నిమగ్నమై ఉంది.

Updated : 21 Mar 2023 05:06 IST

అణుశక్తి విభాగానికి చెందిన ‘న్యూక్లియర్‌ ఫ్యూయల్‌ కాంప్లెక్స్‌’ (హైదరాబాద్‌) అర్ధ  శతాబ్దానికి పైగా దేశ సేవలో నిమగ్నమై ఉంది. అటామిక్‌ ఎనర్జీ, ఇండియన్‌ నేవీ, హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌, ఇతర రక్షణ సంస్థలతోపాటు.. కెమికల్‌ ఫెర్టిలైజర్‌, బాల్‌ బేరింగ్‌  పరిశ్రమలకూ తన ఉత్పత్తులను అందిస్తోంది. తాజాగా ఈ సంస్థ 124 పోస్టులతో ఉద్యోగ నియామక ప్రకటనను విడుదల చేసింది.

ప్రిలిమినరీ టెస్ట్‌, అడ్వాన్స్‌ టెస్ట్‌, ఫిజికల్‌ అసెస్‌మెంట్‌ టెస్ట్‌, కమాండ్‌ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ, డ్రైవింగ్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఖాళీలు: 1) చీఫ్‌ ఫైర్‌ ఆఫీసర్‌/ఎ-01, 2) టెక్నికల్‌ ఆఫీసర్‌/సి (కంప్యూటర్స్‌)-03; 3) డిప్యూటీ చీఫ్‌ ఫైర్‌ ఆఫీసర్‌/ఎ-02; 4) స్టేషన్‌ ఆఫీసర్‌/ఎ-07; 5) సబ్‌-ఆఫీసర్‌/బి-28; 6) డ్రైవర్‌-కమ్‌-పంప్‌ ఆపరేటర్‌-కమ్‌ ఫైర్‌మ్యాన్‌/ఎ- 83 పోస్టులు ఉన్నాయి. వీటిల్లో 10 పోస్టులను ఎక్స్‌-సర్వీస్‌మెన్‌కు కేటాయించారు.  

వయసు: 1) చీఫ్‌ ఫైర్‌ ఆఫీసర్‌/ఎ పోస్టుకు 40 సంవత్సరాలు మించకూడదు 2) టెక్నికల్‌ ఆఫీసర్‌/సి (కంప్యూటర్స్‌) పోస్టుకు 35 ఏళ్లు 3) డిప్యూటీ ఛీప్‌ ఫైర్‌ ఆఫీసర్‌/ఎ పోస్టుకు 40 సంవత్సరాలు 4) స్టేషన్‌ ఆఫీసర్‌/ఎ పోస్టుకు 40 ఏళ్లు 5) సబ్‌-ఆఫీసర్‌/బి పోస్టుకు 40 సంవత్సరాలు 6) డ్రైవర్‌ కమ్‌ పంప్‌ ఆపరేటర్‌ కమ్‌ ఫైర్‌మేన్‌ పోస్టుకు 27 ఏళ్లు మించకూడదు. గరిష్ఠ వయసులో ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది.

టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టుకు తప్ప.. మిగతా అన్ని పోస్టులకూ అభ్యర్థులకు తగిన శారీరక ప్రమాణాలు ఉండాలి. ఎత్తు 165 సెం.మీ., బరువు 50 కేజీలు, ఛాతీ 81 సెం.మీ, గాలి పీల్చిప్పుడు 86 సెం.మీ. ఉండాలి. వర్ణ అంధత్వం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి అనర్హులు.

దరఖాస్తుకు చివరి తేదీ: 10.04.2023
వెబ్‌సైట్‌:www.nfc.gov.in 


ఎవరు అర్హులు?

1. చీఫ్‌ ఫైర్‌ ఆఫీసర్‌/ఎ పోస్టుకు 10+2/తత్సమాన పరీక్ష 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి. దీంతోపాటుగా నాగ్‌పుర్‌లోని నేషనల్‌ ఫైర్‌ సర్వీస్‌ కాలేజ్‌ నుంచి డివిజినల్‌ ఆఫీసర్స్‌ కోర్సు పాసై, 12 ఏళ్ల అనుభవం ఉండాలి. ఆరేళ్లు డీసీఎఫ్‌ఓగా పనిచేయాలి. లేదా ఫైర్‌ ఇంజినీరింగ్‌ బీఈని 60 శాతం మార్కులతో పాసవ్వాలి. వీరికి 8 ఏళ్ల అనుభవం ఉండాలి. ఆరేళ్లు డీసీఎఫ్‌ఓగా పనిచేయాలి. హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలి. ఫైర్‌ ఇంజిన్‌, పంప్స్‌, ఇతర ఫైటింగ్‌ సామగ్రి వాడకం, నిర్వహణ తెలిసి ఉండాలి.

2. టెక్నికల్‌ ఆఫీసర్‌/సి (కంప్యూటర్స్‌) పోస్టుకు బీఈ/బీటెక్‌ 60 శాతం మార్కులతో పాసవ్వాలి. కంప్యూటర్‌ సైన్స్‌/ ఇంజినీరింగ్‌/టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌/ ఇంజినీరింగ్‌ టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌/టెక్నాలజీ, కంప్యూటర్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ నెట్‌వర్కింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌/ టెక్నాలజీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌... మొదలైన ఏ శాఖలోనైనా బీఈ/బీటెక్‌ పాసవ్వాలి. లేదా ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ .. మొదలైన ఏ శాఖలోనైనా బీఈ/బీటెక్‌ పాసవ్వాలి. ప్రోగ్రామింగ్‌, డేటాబేస్‌, ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, సిస్టమ్‌ అడ్మినిస్ట్రేషన్‌లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు.

3. డిప్యూటీ చీఫ్‌ ఫైర్‌ ఆఫీసర్‌/ఎ పోస్టుకు 10+2/తత్సమాన పరీక్ష 50 శాతం మార్కులతో పాసవ్వాలి. నేషనల్‌ ఫైర్‌ సర్వీస్‌ కాలేజ్‌, నాగ్‌పుర్‌ నుంచి డివిజినల్‌ ఆఫీసర్స్‌ కోర్సు పాసవ్వాలి. స్టేషన్‌ ఆఫీసర్‌గా ఆరేళ్ల అనుభవం ఉండాలి. లేదా ఫైర్‌ ఇంజినీరింగ్‌ బీఈ 60 శాతం మార్కులతో పాసవ్వాలి. స్టేషన్‌ ఆఫీసర్‌గా రెండేళ్ల అనుభవం ఉండాలి. హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండి, ఫైర్‌ ఇంజిన్‌లు, ఫైర్‌ పంప్‌లు, ఇతర ఫైర్‌పైటింగ్‌ సామగ్రి వినియోగం, నిర్వహణలో పరిజ్ఞానం ఉండాలి.

4. సబ్‌-ఆఫీసర్‌/బి పోస్టుకు 10+2/ తత్సమాన పరీక్ష 50 శాతం మార్కులతో పాసవ్వాలి. నేషనల్‌ ఫైర్‌ సర్వీస్‌ కాలేజ్‌, నాగ్‌పుర్‌ నుంచి సబ్‌-ఆఫీసర్స్‌ కోర్సు పాసవ్వాలి. 12 ఏళ్ల అనుభవం ఉండి.. అందులో 5 ఏళ్లు లీడింగ్‌ ఫైర్‌మేన్‌గా పనిచేయాలి. లేదా 15 ఏళ్లు ఫైర్‌మేన్‌/ డ్రైవర్‌ కమ్‌ ఆపరేటర్‌గా పనిచేయాలి.

5. సబ్‌ఆఫీసర్‌/బి పోస్టుకు 10+2/ తత్సమాన పరీక్ష 50 శాతం మార్కులతో పాసవ్వాలి. నాగ్‌పుర్‌ నేషనల్‌ ఫైర్‌ సర్వీస్‌ కాలేజ్‌ నుంచి సబ్‌-ఆఫీసర్స్‌ కోర్సు పూర్తిచేయాలి. హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు. 12 ఏళ్ల అనుభవం ఉండాలి. అందులో 5 ఏళ్లు లీడింగ్‌ ఫైర్‌మేన్‌గా పనిచేయాలి. లేదా ఫైర్‌మ్యాన్‌/డ్రైవర్‌ కమ్‌ ఆపరేటర్‌గా 15 ఏళ్ల అనుభవం ఉండాలి.

6. డ్రైవర్‌-కమ్‌-పంప్‌ ఆపరేటర్‌-కమ్‌-ఫైర్‌మ్యాన్‌/ఎ పోస్టుకు 10+2/తత్సమాన పరీక్ష 50 శాతం మార్కులతో పాసవ్వాలి. హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌తోపాటు ఏడాది డ్రైవింగ్‌ అనుభవం ఉండాలి. ఫైర్‌ ఫైటింగ్‌ పరికరాల వాడకంలో సర్టిఫికెట్‌ కోర్సు చేసి ఉండాలి.


ఎంపిక ఎలా?

1. చీఫ్‌ ఫైర్‌ ఆఫీసర్‌/ఎ, డిప్యూటీ చీఫ్‌ ఫైర్‌ ఆఫీసర్‌/ ఎ పోస్టుల అభ్యర్థులను ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్టుకు పిలుస్తారు. అర్హత సాధిస్తే ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

2. టెక్నికల్‌ ఆఫీసర్‌/సి (కంప్యూటర్స్‌) పోస్టుకు దరఖాస్తుల సంఖ్యను బట్టి అవసరమైతే స్క్రీనింగ్‌/రాత పరీక్షను నిర్వహిస్తారు. అభ్యర్థుల షార్ట్‌లిస్ట్‌ను తయారుచేసి ఇంటర్వ్యూకు పిలుస్తారు.

3. స్టేషన్‌ ఆఫీసర్‌/ఎ పోస్టుకు అభ్యర్థులను ఫిజికల్‌ స్టాండర్డ్స్‌ టెస్ట్‌కు పిలుస్తారు. దీంట్లో అర్హత సాధించిన వాళ్లను ఫిజికల్‌ అసెస్‌మెంట్‌ టెస్ట్‌, కమాండ్‌ టెస్ట్‌కు పిలుస్తారు. విజయం సాధిస్తే ఇంటర్వూకు పిలుస్తారు.

* సబ్‌ ఆఫీసర్‌/బి, డ్రైవర్‌ కమ్‌ పంప్‌ ఆపరేటర్‌ కమ్‌ ఫైర్‌మ్యాన్‌ పోస్టులకు దరఖాస్తు చేసినవారిలో అర్హతలున్న వారిని ఫిజికల్‌ స్టాండర్ట్‌ టెస్ట్‌కు పిలుస్తారు. అర్హత సాధిస్తే ఫిజికల్‌ అసెస్‌మెంట్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు.

స్టేజ్‌-2 (ప్రిలిమినరీ టెస్ట్‌): ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌, హిందీ భాషల్లో ఉంటుంది. దీనికి 50 మార్కులు. మేథమెటిక్స్‌-20, సైన్స్‌-20, జనరల్‌ అవేర్‌నెస్‌-10 ప్రశ్నలు వస్తాయి. సమయం గంట. సరైన సమాధానానికి 3 మార్కులు. తప్పు సమాధానానికి 1 మార్కు తగ్గిస్తారు.  

స్టేజ్‌-3 (అడ్వాన్స్‌డ్‌ టెస్ట్‌): ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లిష్‌లో ఉంటుంది. సమయం 2 గంటలు. 50 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నల స్థాయి పోస్టును బట్టి ఉండే విద్యార్హతలు/ ప్రొఫెషనల్‌/ టెక్నికల్‌ అర్హతల ఆధారంగా ఉంటుంది. సరిగా రాస్తే సమాధానానికి 3 మార్కులు ఇస్తారు. తప్పు సమాధానానికి 1 మార్కు తగ్గిస్తారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని