‘ఏకైక’ అమ్మాయిలకు ఉపకారం

తల్లిదండ్రులకు ఏకైక సంతానమైన ఆడపిల్లలకు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ స్కాలర్‌షిప్‌ అందిస్తోంది. ‘పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ ఇందిరాగాంధీ స్కాలర్‌షిప్‌ ఫర్‌ సింగిల్‌ గర్ల్‌ చైల్డ్‌’ పేరుతో ఈ స్కాలర్‌షిప్‌ను ఇస్తున్నారు. పీజీ ప్రథమ సంవత్సరం చేస్తున్నవారు...

Updated : 02 Nov 2018 23:43 IST

‘ఏకైక’ అమ్మాయిలకు ఉపకారం

తల్లిదండ్రులకు ఏకైక సంతానమైన ఆడపిల్లలకు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ స్కాలర్‌షిప్‌ అందిస్తోంది. ‘పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ ఇందిరాగాంధీ స్కాలర్‌షిప్‌ ఫర్‌ సింగిల్‌ గర్ల్‌ చైల్డ్‌’ పేరుతో ఈ స్కాలర్‌షిప్‌ను ఇస్తున్నారు. పీజీ ప్రథమ సంవత్సరం చేస్తున్నవారు అర్హులు.చాలా రాష్ట్రాల్లో అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల సంఖ్య తక్కువగా ఉంటోంది. చాలా కుటుంబాలు మగబిడ్డకే జన్మనివ్వాలని కోరుకుంటున్నాయి. అభివృద్ధిలో భాగంగానూ స్త్రీలను గుర్తించడం లేదు. ఈ సందర్భంలో అమ్మాయిలకు వాళ్ల జీవితాలను వాళ్లు జీవించే అధికారం రావాలంటే సాధికారత, విద్య తప్పనిసరి. ఇప్పటికే ప్రభుత్వం అమ్మాయిల విద్య తప్పనిసరి చేసినప్పటికీ.. ఉన్నతవిద్య వరకూ వెళ్లని దాఖలాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అమ్మాయిలను పీజీ విద్య దిశగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో యూజీసీ ‘పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ ఇందిరాగాంధీ స్కాలర్‌షిప్‌ ఫర్‌ సింగిల్‌ గర్ల్‌ చైల్డ్‌’ను ప్రవేశపెట్టింది. 
వివిధ కళాశాలలు, యూనివర్సిటీల్లో నాన్‌ ప్రొఫెషనల్‌ పీజీ కోర్సుల్లో చేరినవారు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. కవలలుగా పుట్టిన అమ్మాయిలూ అర్హులే. 
* అమ్మాయి ఏకైక సంతానమై ఉండాలి. కుటుంబంలో ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఉన్నా అనర్హులుగా పరిగణిస్తారు. 
* గుర్తింపు పొందిన సంస్థలో పీజీ మొదటి సంవత్సరం చదువుతుండాలి. రెగ్యులర్‌, ఫుల్‌టైం చేస్తున్నవారే అర్హులు. 
* దూరవిద్య ద్వారా పీజీ చేసేవారు అనర్హులు. 
పీజీ కోర్సులో చేరేనాటికి వయసు 30 ఏళ్లు మించకూడదు. 
స్కాలర్‌షిప్‌ మొత్తం నెలకు రూ.3100 చొప్పున రెండేళ్లపాటు (ఏడాదికి 10 నెలలు) చెల్లిస్తారు. స్కాలర్‌షిప్‌ మొత్తం నేరుగా అభ్యర్థుల బ్యాంకు ఖాతాల్లోనే జమచేస్తారు. 
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో (www. ugc.ac.in) దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు పీజీ ప్రథమ సంవత్సరం చదువుతున్నట్టు ధ్రువీకరిస్తూ సర్టిఫికెట్‌ అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. దీని ఫార్మాట్‌ వెబ్‌సైట్‌లో లభిస్తుంది. దాన్ని అభ్యర్థి తన వివరాలతో పూరించి, కళాశాల ప్రిన్సిపల్‌ సంతకాన్ని కూడా తీసుకోవాలి. 
ఏటా 3000 మందికి ఈ స్కాలర్‌షిప్‌ అవకాశాన్ని కల్పిస్తారు. వేరే దరఖాస్తులను పొందేవారు కూడా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైనవారిని గుర్తించి యూజీసీ వెబ్‌సైట్‌లో అభ్యర్థుల వివరాలను  ఉంచుతుంది. 
* రెండో ఏడాది రెన్యువల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థి ప్రవర్తన, హాజరు, ప్రతిభను బట్టి కొనసాగిస్తారు. మొదటి ఏడాది ఫెయిల్‌ అయితే స్కాలర్‌షిప్‌ను  కొనసాగించరు. 
* కోర్సు మధ్యలో వేరే దానిలోకి మారినా స్కాలర్‌షిప్‌ను నిలిపివేస్తారు. 
దరఖాస్తు చివరితేదీ: 
నవంబరు 30, 2018 
వెబ్‌సైట్‌: https://scholarships.gov.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని