కార్డియాలజీ డిప్లొమాలో చేరొచ్చా?

బీఎస్సీ కంప్యూటర్‌ సైన్స్‌ ఏపీలో పూర్తిచేశాను. కార్డియాలజీ టెక్నీషియన్‌ పీజీ డిప్లొమా కోర్సును ఉస్మానియా యూనివర్సిటీ (తెలంగాణ)లో చేయాలనుకుంటున్నాను.

Published : 18 Oct 2022 00:46 IST

బీఎస్సీ కంప్యూటర్‌ సైన్స్‌ ఏపీలో పూర్తిచేశాను. కార్డియాలజీ టెక్నీషియన్‌ పీజీ డిప్లొమా కోర్సును ఉస్మానియా యూనివర్సిటీ (తెలంగాణ)లో చేయాలనుకుంటున్నాను. వీలవుతుందా?

- రాజేష్‌ సెహ్వాగ్‌

* బీఎస్సీ కంప్యూటర్‌ సైన్స్‌లో కంప్యూటర్స్‌తోపాటు మీరు ఏయే సబ్జెక్టులు చదివారో చెప్పలేదు. కార్డియాలజీ టెక్నీషియన్‌ పీజీ డిప్లొమా చేయాలంటే చాలా యూనివర్సిటీలు, హాస్పటల్‌లు డిగ్రీలో కనీసం ఒక లైఫ్‌సైన్స్‌ కోర్సు చదివి ఉండాలన్న నిబంధన విధిస్తున్నాయి. కార్డియాలజీలో డిప్లొమా కోర్సులకు కూడా ఇంటర్మీడియట్‌లో సైన్స్‌ చదివి ఉండాలన్న నిబంధన ఉంది. మీరు ఇంటర్‌/ డిగ్రీ స్థాయిలో లైఫ్‌ సైన్సెస్‌ కోర్సు చదివివుంటే కార్డియాలజీలో డిప్లొమా/ పీజీ డిప్లొమా చేసే అవకాశం ఉంది. ఇక ఉస్మానియా యూనివర్సిటీ విషయానికొస్తే మీకు ఈ కోర్సు చదివే అర్హత ఉంటే నాన్‌ లోకల్‌ కోటాలో పోటీపడాలి. హైదరాబాద్‌లో చాలా కార్పొరేట్‌ హాస్పిటల్స్‌ కూడా ఈ  కోర్సును అందిస్తున్నాయి. మీకు విద్యార్హతలు, ఆర్ధిక వెసులుబాటు ఉంటే ప్రైవేటు విద్యా సంస్థల్లో చదవడానికి ప్రయత్నించవచ్చు.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని