కెమికల్‌ ఇంజినీరింగ్‌ ఎంత మేలు?

ఇంటర్‌ (ఎంపీసీ) చదివాను. కెమిస్ట్రీ ప్రధానంగా డిగ్రీ చేయాలా? కెమికల్‌ ఇంజినీరింగ్‌ చేయడం మేలా? ఈ డిగ్రీతో దేశ విదేశాల్లో ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి?

Published : 15 Apr 2024 00:03 IST

ఇంటర్‌ (ఎంపీసీ) చదివాను. కెమిస్ట్రీ ప్రధానంగా డిగ్రీ చేయాలా? కెమికల్‌ ఇంజినీరింగ్‌ చేయడం మేలా? ఈ డిగ్రీతో దేశ విదేశాల్లో ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి?

సుధీర్‌

ఇంటర్‌ తర్వాత ఏ డిగ్రీ చదవాలి అన్న నిర్ణయానికి ముందు, మీ దీర్ఘకాలిక ఆశయాలు, స్వల్పకాలిక లక్ష్యాలపై స్పష్టత అవసరం. మీరు ఇష్టపడుతున్నది ప్రభుత్వ ఉద్యోగమా? ప్రైవేటు కొలువా? మీకు బోధన రంగంపై ఆసక్తి ఉందా? పరిశోధన అభిరుచి ఉందా? కెమికల్‌/ ఫార్మా పరిశ్రమల్లో పనిచేయడమా? విదేశాల్లో స్థిరపడటమా? మనదేశంలోనే ఉండటమా? అనే విషయాలకు సమాధానం తెలుసుకోండి. కెమిస్ట్రీ ప్రధానంగా డిగ్రీ చదివితే ఉద్యోగావకాశాలు ఎక్కువగా లేవు. ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, పీహెచ్‌డీ కెమిస్ట్రీ చదివితే జాతీయ, అంతర్జాతీయ పరిశోధన సంస్థల్లో, ఫార్మా, కెమికల్‌ పరిశ్రమల్లో శాస్త్రవేత్తగా, విశ్వవిద్యాలయాలూ కళాశాలల్లో అధ్యాపకులుగా స్థిరపడవచ్చు. కెమికల్‌ ఇంజినీరింగ్‌లో డిగ్రీ చదివితే ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల్లో కెమికల్‌ ఇంజినీర్‌గా, పెట్రోలియం ఇంజినీర్‌గా, అనలిటికల్‌ కెమిస్ట్‌గా, క్వాలిటీ ఇంజినీర్‌గా ఉద్యోగావకాశాలుంటాయి. కెమికల్‌ ఇంజినీరింగ్‌లో పీజీ, పీహెచ్‌డీ చేసి జాతీయ, అంతర్జాతీయ పరిశోధన సంస్థల్లో, ఫార్మా, కెమికల్‌ పరిశ్రమల్లో శాస్త్రవేత్తగా, ఇంజినీరింగ్‌ కళాశాలల్లో అధ్యాపకులుగా స్థిరపడవచ్చు. కెమిస్ట్రీలో, కెమికల్‌ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ చేసినవారికి మనదేశంలో కంటే, విదేశాల్లో ఉద్యోగావకాశాలు ఎక్కువ. కానీ విదేశాల్లో కూడా ఉద్యోగాలకు పోటీ పెరిగిపోయింది. ఏదేశంలో అయినా మంచి ఉద్యోగంలో స్థిరపడాలంటే జాతీయ, అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో ప్రవేశం, విషయ పరిజ్ఞానం, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు పెంపొందించుకోవటం అవసరం.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని