ఎంబీఏకి ఎంత ఖర్చు?

మా అబ్బాయి బీకాం బిజినెస్‌ అనలిటిక్స్‌ చివరి సెమిస్టర్‌ చదువుతున్నాడు. 90 శాతం మార్కులు వస్తున్నాయి.

Published : 16 Apr 2024 00:03 IST

మా అబ్బాయి బీకాం బిజినెస్‌ అనలిటిక్స్‌ చివరి సెమిస్టర్‌ చదువుతున్నాడు. 90 శాతం మార్కులు వస్తున్నాయి. తక్కువ ఖర్చుతో ఎంబీఏ బిజినెస్‌ అనలిటిక్స్‌ అందించే కాలేజీలున్నాయా?

ఎం.నాగరాజు

సాధారణంగా ఐఐఎంల్లో ఎంబీఏ బిజినెస్‌ అనలిటిక్స్‌ ప్రోగ్రాం చేయాలంటే దాదాపు 20 లక్షల నుంచి 25 లక్షల రూపాయల ఫీజు ఉంటుంది. బిట్స్‌ పిలానీలో 10 లక్షల నుంచి 12 లక్షల వరకు, ఎండీఐ - గుడ్‌గావ్‌, నార్సిమొంజి - ముంబయి, సింబయాసిస్‌ - పుణె, ఐఎంటీ- ఘజియాబాద్‌ల్లో 15 లక్షల నుంచి 20 లక్షల వరకు ఖర్చు అవుతుంది. పైన చెప్పిన అన్ని బిజినెస్‌ స్కూల్స్‌లో ఎంబీఏ చదవడానికి విద్యా రుణం వచ్చే అవకాశం ఉంది. స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ - యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో ఐదు లక్షల రూపాయల లోపే ఫీజు ఉంటుంది. దీనికి కూడా విద్యారుణం వెసులుబాటు ఉంది. ఐఐఎం/ ఐఐటీ, ఎండిఐ, ఐఎంటీల్లో ప్రవేశానికి క్యాట్‌, నర్సీమోంజిలో ప్రవేశానికి ఎన్‌ మ్యాట్‌, సింబయాసిస్‌లో ప్రవేశానికి స్నాప్‌, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో ప్రవేశానికి సీయూఈటీ (పీజీ) పరీక్షల్లో మెరుగైన ప్రతిభ కనపరచాలి. తర్వాత రిటన్‌ ఎబిలిటీ టెస్ట్‌/ గ్రూప్‌ డిస్కషన్‌/ పర్సనల్‌ ఇంటర్వ్యూల్లో కూడా ప్రతిభ చూపితే ఎంబీఏ బిజినెస్‌ అనలిటిక్స్‌ ప్రోగ్రాంలో ప్రవేశం పొందవచ్చు.   

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని