చదివింది బోధపడటంలేదా?

ఒక్కోసారి చదవాల్సినవి ఎన్నో ఉన్నా.. సమయం మాత్రం తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు గబగబా చదివేస్తూ ముందుకు వెళ్లిపోతాం. ఆ తర్వాతే అసలు సమస్య మొదలవుతుంది. చదివినవేవీ సరిగా అర్థం కావు. అలా కాకుండా ఉండాలంటే...

Updated : 14 Jul 2022 11:22 IST

ఒక్కోసారి చదవాల్సినవి ఎన్నో ఉన్నా.. సమయం మాత్రం తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు గబగబా చదివేస్తూ ముందుకు వెళ్లిపోతాం. ఆ తర్వాతే అసలు సమస్య మొదలవుతుంది. చదివినవేవీ సరిగా అర్థం కావు. అలా కాకుండా ఉండాలంటే...

* చదవడం అంటే.. పదాలను ఉచ్చరించడం కాదు. వాటి ద్వారా వెల్లడించిన ఆలోచనలను అర్థంచేసుకోవడం. కాబట్టి నిదానంగా చదవడానికే ప్రాధాన్యమివ్వాలి.
* తెలియని పదాలకు అప్పటికప్పుడే అర్థాన్ని తెలుసుకోవాలి. ఇలా చేయడం వల్ల పదసంపద పెరుగుతుంది. కొత్తగా నేర్చుకున్న పదాలను సందర్భానుసారం ఉపయోగించగలుగుతారు.
* వ్యాసం లేదా పాఠం ఏదైనాసరే.. దానికో ప్రధానోద్దేశం ఉంటుంది. ముందుగా అదేమిటనేది గ్రహించాలి. ఆ ఉద్దేశాన్ని తెలియజేసే విశ్లేషణా, ఉదాహరణలూ కూడా ఉంటాయి. వాటిని అర్థంచేసుకుంటే ముఖ్యోద్దేశాన్ని సులువుగా గ్రహించవచ్చు.
* చదివిన అంశాన్ని సంక్షిప్తీకరించుకుంటే బాగా గుర్తుంటుంది. లేకపోతే అవగాహన లోపంతో మళ్లీ మళ్లీ చదవాల్సి రావచ్చు.
* ఒక్కోసారి కొన్ని పదాలు తికమక పెడుతుంటాయి. సమయానికి డిక్షనరీ కూడా అందుబాటులో లేకపోవచ్చు. అలాంటప్పుడు ఆ తర్వాతి వాక్యాలను చదివితే సారాంశం అర్థమవుతుంది.  
*  విషయాన్ని గ్రహించే సామర్థ్యం పెరగాలంటే ఎక్కువగా చదవాలి. పాఠ్యపుస్తకాలే కాకుండా ఇతర పుస్తకాలనూ చదవడం అలవాటు చేసుకోవాలి. దీంతో మీ ఆలోచనా పరిధీ విస్తృతమవుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని