భారతదేశ చరిత్ర

1. రుగ్వేదంలో ఏ తీర్థంకరుడి గురించి  ప్రస్తావించారు?

Published : 06 Aug 2022 05:34 IST

ప్రాక్టీస్‌ బిట్లు

1. రుగ్వేదంలో ఏ తీర్థంకరుడి గురించి  ప్రస్తావించారు?

  1) దేవదత్తుడు   2) రిషభనాథుడు

  3) పార్శ్వనాథుడు   4) మహావీరుడు

2. జైనుల ప్రథమ తీర్థంకరుడైన రిషభదేవుడు ఎక్కడ నిర్యాణం చెందాడని విశ్వసిస్తారు?

  1) శ్రావణబెళగోళ    2) కైలాస శిఖర పర్వతం

  3) సారనాథ్‌        4) గయ

3. పట్నా నగరానికి ఉన్న ప్రాచీన నామం?

  1) కౌశాంబి        2) పాటలీపుత్ర

  3) కనోజ్‌         4) కపిలవస్తు

4. కైవల్యం అనేది ఏ మతానికి సంబంధించింది?

  1) బౌద్ధమతం   2) జైనమతం

  3) హిందూమతం   4) సిక్కుమతం

5. కిందివాటిలో పీఠికలో లేనిది?

  1) మహావంశ      2) అబిదమ్మ

  3) వినయ        4) సుత్త

6. బౌద్ధుల పవిత్ర గ్రంథాలు?

  1) వేదాలు        2) అంగాలు  

  3) త్రిపీఠకాలు      4) ఆర్యాంకాలు

7. అశోకుడి స్తంభ శాసనాల్లో అతి దీర్ఘమైంది?

  1) ఏడో స్తంభ శాసనం  

  2) ఆరో స్తంభ శాసనం

  3) అయిదో స్తంభ శాసనం  

  4) నాలుగో స్తంభ శాసనం

8. మౌర్యుల ఆర్థిక సంవత్సరం ఏ మాసంతో ప్రారంభమయ్యేది?

  1) ఆషాడం      2) శ్రావణం

  3) భాద్రపదం    4) రోహిణి

9. టిబెట్‌ సాహిత్యం ప్రకారం అశోకుడు ఏ నగరాన్ని నిర్మించాడు?

  1) వారణాసి         2) శ్రీనగర్‌  

  3) తక్షశిల          4) అలహాబాద్‌

సమాధానాలు: 1-2; 2-2; 3-2; 4-2; 5-1;6-3; 7-1; 8-1; 9-2.


ప్రిపరేషన్‌ టెక్నిక్‌

సిలబస్‌ చూడకుండా, అర్థం చేసుకోకుండా మార్కెట్లో కనిపించిన ప్రతి పుస్తకం చదవకూడదు. పరీక్ష స్థాయిని బట్టి సిలబస్‌ ఉంటుంది. దాని ప్రకారం ప్రశ్నల లోతును అంచనా వేసి అధ్యయనం చేయాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని