అక్కడ ఎడారిలో సాంబార్‌ సరస్సు!

ఒకవైపు పర్వతాలు, మరోవైపు మైదానాలు, ఇంకోవైపు పీఠభూములు, అన్నింటినీ మించి పొడవైన సముద్రతీరాలతో కూడిన సహజ సరిహద్దులతో భారతదేశం వర్ధిల్లుతోంది.

Published : 25 May 2023 03:51 IST

ఇండియన్‌ జాగ్రఫీ

ఒకవైపు పర్వతాలు, మరోవైపు మైదానాలు, ఇంకోవైపు పీఠభూములు, అన్నింటినీ మించి పొడవైన సముద్రతీరాలతో కూడిన సహజ సరిహద్దులతో భారతదేశం వర్ధిల్లుతోంది. అత్యంత వైవిధ్యభరితమైన ఆ నైసర్గిక స్వరూపం భౌగోళికంగా ప్రపంచ పటంలో ఈ దేశాన్ని ప్రత్యేకంగా నిలబెట్టింది.  ఇక్కడి పర్వతాలు, కనుమ శ్రేణులు, నదులు, మైదానాలన్నీ వేటికవే భిన్నమైనవి. వాటి ఉనికి, స్వరూప స్వభావాలు, విస్తరణ పరిధుల గురించి పోటీ పరీక్షార్థులు వివరంగా తెలుసుకోవాలి.

భారతదేశం - భౌతిక/నైసర్గిక స్వరూపం

1. కిందివాటిని పరిగణించండి.

ఎ) థార్‌ ఎడారి      బి) ద్వీపకల్ప పీఠభూమి
సి) తీర మైదానాలు   డి) దీవులు
ఇ) హిమాలయాలు   ఎఫ్‌) గంగా-సింధు మైదానాలు
పైవాటి వైశాల్యం ఆధారంగా అవరోహణ క్రమంలో అమర్చండి.

1) ఎ, బి, సి, డి, ఇ, ఎఫ్‌
2) ఎఫ్‌, ఇ, డి, సి, బి, ఎ
3) బి, ఎఫ్‌, ఇ, సి, ఎ, డి    
4) బి, ఇ, ఎఫ్‌, ఎ, సి, డి


2. కిందివాటిని జతపరచండి.

ప్రాంతం శిఖరం
1) భారత్‌లో ఎత్తయిన ఎ) అనైముడి
   శిఖరం            
2) ద్వీపకల్ప పీఠభూమిలో బి) కాంచనజంగా
  ఎత్తయిన శిఖరం    
3) ఆంధ్రప్రదేశ్‌లో ఎత్తయిన సి) దోలిగుట్ట
   పర్వత కొండ
4) తెలంగాణలో ఎత్తయిన డి) జింధగడ
   పర్వత కొండ        

1) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి    
2) 1-ఎ, 2-డి, 3-బి, 4-సి
3) 1-బి, 2-డి, 3-సి, 4-ఎ    
4) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి  


3. ప్రపంచంలో ఎత్తయిన శిఖరాలను, అవి విస్తరించిన ఖండాలతో జతపరచండి.

 శిఖరం    ఖండం
1) కిలిమంజారో       ఎ) ఆస్ట్రేలియా
2) ఎవరెస్టు         బి) ఆసియా
3) అకాంకాగ్వా       సి) ఉత్తర అమెరికా
4) మేకిన్లీ/డెనాలీ     డి) దక్షిణ అమెరికా
5) కోషియాస్కో       ఇ) ఆఫ్రికా

1) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి, 5-ఇ    
2) 1-ఎ, 2-డి, 3-బి, 4-ఇ, 5-సి
3) 1-ఇ, 2-బి, 3-డి, 4-సి, 5-ఎ    
4) 1-ఇ, 2-ఎ, 3-బి, 4-సి, 5-డి  


4. కిందివాటిలో తప్పుగా ఉన్న వాక్యాలను సూచించండి.

1) గోండ్వానా భూ భూగానికి ఉత్తర దిశలో అతి పెద్ద టెథిస్‌ సముద్రం ఉంది.

2) ఆంధ్రప్రదేశ్‌ భౌతిక స్వరూపంగా అత్యంత ఎత్తయిన భూ భాగం విశాఖపట్నం.

3) తెలంగాణ నైసర్గిక స్వరూపంలో అతి పెద్దది కృష్ణా పరీవాహక ప్రాంతం.

4) తెలంగాణ - రాయలసీమ ప్రాంతం ఆర్కియన్‌ శిలలతో ఏర్పడింది.


5. పెన్నైన్స్‌ - యూరప్‌, అప్పలేచియన్‌, అమెరికా,  ఆరావళి భారత్‌ అనేవి దేనికి ఉదాహరణ?

1) ప్రాచీన ముడత పర్వతాలు  2) అగ్ని పర్వతాలు    
3) నవీన ముడత పర్వతాలు   4) ఖండ పర్వతాలు         


6. ఏ పర్వత శ్రేణులు భారత తూర్పు భాగానికి,  మయన్మార్‌కు మధ్య సంయుక్త సరిహద్దుగా ఏర్పడ్డాయి?

1) ఉత్తరాంచల్‌   2) హిమాచల్‌    
3) పూర్వాంచల్‌     4) వింధ్యాచల్‌


7. కిందివాటిని పరిగణించండి.

ఎ) గుర్‌శిఖర్‌ ఆరావళి పర్వతాల్లో అత్యంత     ఎత్తయింది.
బి) ఉత్తర మైదానాలు ఎక్కువగా కంకర భూములతో ఏర్పడ్డాయి.
సి) గల్ఫ్‌ ఆఫ్‌ కాంబే అరేబియా సముద్రానికి చెందింది.

1) సి తప్పు. ఎ, బి సరైనవి        
2) ఎ తప్పు. బి, సి సరైనవి
3) బి తప్పు. ఎ, సి సరైనవి 4) ఎ, బి, సి సరైనవి


8. కిందివాటిని పరిగణించండి.

ఎ) నర్మద, తపతి నదుల మధ్య సాత్పురా పర్వతాలు ఉన్నాయి
బి) సోన్‌ నది, నర్మద మధ్య వింధ్య పర్వతాలు ఉన్నాయి
1) ఎ సరైంది        2) బి సరైంది
3) ఎ, బి సరైనవి     4) రెండూ సరికావు


9. కిందివాటిని జతపరచండి.

 ప్రాంతం ఎత్తు
1) హిమాద్రి          ఎ) 3750 - 4500 మీ.
2) హిమాచల్‌         బి) 6000 - 6100 మీ.
3) శివాలిక్‌           సి) 900 - 1200 మీ.
4) హిమాలయాలు  డి) 3200 కి.మీ. ఇ) 2400 కి.మీ.

1) 1-బి, 2-ఎ, 3-సి, 4-ఇ    
2) 1-ఎ, 2-సి, 3-ఇ, 4-బి
3) 1-ఇ, 2-డి, 3-సి, 4-బి    
4) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి  


10. సూపర్‌ కాంటినెంట్‌ పెంజియా మధ్య టెథిస్‌ సముద్రానికి ఉత్తర-దక్షిణంలో ఉన్న భూ భూగాలు

1) అంగోరా - గోండ్వానా భూ భూభాగం
2) గోండ్వానా - అంగోరా భూ భూభాగం
3) పశ్చిమ పర్వతాలు - తూర్పు సముద్రం
4) ఏవీకావు


11. టియాన్‌ షా శ్రేణులు హిమాలయాలకు ఏ దిశలో ఉన్నాయి?

1) ఈశాన్యం 2) ఉత్తరం 3) ఆగ్నేయం 4) వాయవ్యం


12. కిందివాటిలో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి.

ఎ) రీ2 శిఖరం - ట్రాన్స్‌ హిమాలయాలు
బి) కాంచనజంగా - హిమాద్రి హిమాలయాలు
సి) మహాభారత శ్రేణులు - శివాలిక్‌ హిమాలయాలు
డి) మిష్మి కొండలు - జాటర్‌ హిమాలయాలు

1) డి     2) సి     3) బి     4) ఎ


13. హిమాలయాల్లో విస్తరించిన పర్వత శిఖరాలను తూర్పు నుంచి పశ్చిమానికి అమర్చండి.

ఎ) ఎవరెస్ట్‌     బి) నమ్చబర్వా    సి) రీ2  
డి) నంగప్రభాత్‌  ఇ) కాంచనజంగా

1) బి - ఇ - ఎ - సి - డి
2) ఎ - బి - సి - డి - ఇ
3) ఇ - డి - సి - బి - ఎ
4) బి - ఎ - ఇ - డి - సి


14. మధ్య ఉన్నత ప్రాంతమని కిందివాటిలో దేనికి పేరు?

1) దక్కన్‌ పీఠభూమి   2) ఛోటానాగ్‌పుర్‌ పీఠభూమి
3) మాళ్వా పీఠభూమి  4) ద్వీపకల్ప పీఠభూమి


15. కిందివాటిని పరిశీలించి సరైన సమాధానాలను ఎంచుకోండి.

ఎ) 2020 ప్రకారం మౌంట్‌ ఎవరెస్ట్‌ శిఖరం ఎత్తు 8848.86 మీ.
బి) ద్వీపకల్ప భారత నైరుతి భాగంలో ఎత్తయిన శిఖరం - అనైముడి (2695 మీ.)
సి) తూర్పు కనుమల్లో ఎత్తయిన శిఖరం - జింధగడ - (1690 మీ.)
డి) దక్షిణ సహ్యాద్రిలో ఎత్తయిన శిఖరం - ములాంగిరి(1903 మీ.)

1) ఎ, బి 2) బి, డి 3) ఎ సి, డి 4) ఎ, బి, సి, డి


16. సాంబార్‌ అనేది ఒక

1) లెగూన్‌ సరస్సు
2) అంతఃస్థలీయ ఎడారి సరస్సు
3) హిమానీనద సరస్సు    4) అగ్నిపర్వత సరస్సు


17. కిందివాటిని జతపరచండి.

 భాగం - I       భాగం - II
1) మాళ్వా పీఠభూమి   ఎ) పార్షనాథ్‌
2) ఛోటానాగ్‌పుర్‌ పీఠభూమి   బి) బుండి
3) నీలగిరి కొండలు    సి) గుర్‌శిఖర్‌
4) ఆరావళి కొండలు    డి) దొడబెట్ట

1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి    
2) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
3) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి    
4) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ


18. ‘పాట్కాయ్‌బమ్‌’ కొండలు భారత్‌కు ఏ భాగంలో విస్తరించి ఉన్నాయి?

1) తూర్పు 2) దక్షిణ 3) పశ్చిమ  4) ఉత్తర


19. 2019లో పంజాబ్‌, జమ్మూ, పాకిస్థాన్‌ సరిహద్దుల్లో బీఎస్‌ఎఫ్‌ దళం కింది ఏ ఆపరేషన్‌ను ప్రారంభించింది?

1) సుదర్శన్‌ 2) చక్రవాయు
3) గరుడా 4) వాయుపుత్ర


20. కిందివాటిని పరిగణించండి.

ఎ) హిమాచల్‌/నిమ్న హిమాలయలకు, శివాలిక్‌/ బాహ్య హిమాలయాలకు మధ్య డూన్‌ లోయలుఉన్నాయి.
బి) రేఖాంశాల పరంగా హిమాలయాల విభజన ఉత్తరం నుంచి దక్షిణానికి జరిగింది.
సి) పూర్వాంచల్‌ పర్వత శ్రేణులు భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య ఉన్నాయి.
పై వాటిలో తప్పుగా ఉన్న ప్రవచనం ఏది?

1) సి    2) ఎ    3) బి     4) ఎ, సి


21. పశ్చిమ తీరంలోని గోవా దక్షిణ భాగాన్ని ఏమంటారు?

1) కోరమండల్‌ 2) కొంకణ్‌
3) ఉత్తర సర్కార్‌ 4) కన్నార్‌


22. థార్‌ ఎడారి అత్యధికంగా ఏ రాష్ట్రంలో విస్తరించి ఉంది?

1) హరియాణా 2) మధ్యప్రదేశ్‌
3) రాజస్థాన్‌ 4) గుజరాత్‌


23. అత్యంత పొడవైన పిర్‌పంజల్‌ శ్రేణులు కిందివాటిలో ఏ భాగపు హిమాలయాలు?

1) శివాలిక్‌ 2) ట్రాన్స్‌
3) కేంద్రీయ 4) నిమ్న/మధ్య


24. కిందివాటిని పరిగణించండి.

ఎ) అఘీల్‌పాస్‌ ట్రాన్స్‌ హిమాలయాల్లో ఉంది
బి) బనిహల్‌, షిప్‌కిలా పాస్‌లు హిమాద్రి హిమాలయాల్లో ఉన్నాయి.
1) ఎ సరైంది 2) బి సరైంది
3) ఎ, బి సరైనవి 4) రెండూ కాదు


25. కిందివాటిలో తప్పుగా జతపరిచింది?

1) ఇలమలై కొండలు - కేరళ
2) లూషాయి కొండలు - మిజోరాం
3) పాండవుల గుట్టలు - చత్తీస్‌గఢ్‌
4) భైరవకోన కొండలు - ఆంధ్రప్రదేశ్‌


26. కిందివాటిలో ఎత్తయిన పర్వత శిఖరం?

1) రీ2 2) కాంచనజంగా
3) నంగాపర్బత్‌ 4) నందాదేవి


27. కిందివాటిలో మేఘాలయ రాష్ట్రంలో తూర్పు నుంచి పశ్చిమానికి విస్తరించిన కొండలను సరైన క్రమంలో అమర్చండి.

1) గారో, ఖాసి, జయంతీయ        
2) జయంతీయ, ఖాసి, గారో
3) ఖాసీ, గారో, జయంతీయ        
4) జయంతీయ, గారో, ఖాసి


28. నిర్మాణాత్మక పరంగా వెలికొండ సముహ పల్లపు కొండలు ఏ భాగంలో ఉన్నాయి?

1) కార్డమమ్‌ కొండలు 2) దక్కన్‌ కొండలు
3) పశ్చిమ కనుమలు 4) తూర్పు కనుమలు
29. థార్‌ ఎడారి ప్రాంతంలోని విస్తాపన చెందిన ఇసుక దిబ్బలను ఏమంటారు?
1) థ్రియన్‌   2) ద్రౌస్‌  3) దారోస్‌  4) థయా


సమాధానాలు

1-3, 2-1, 3-3, 4-3, 5-1, 6-3, 7-4, 8-3, 9-1, 10-2, 11-1, 12-2, 13-1, 14-3, 15-4, 16-2, 17-3, 18-1, 19-1, 20-1, 21-4, 22-3, 23-4, 24-3, 25-3, 26-1, 27-2, 28-4, 29-1.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని