కరెంట్‌ అఫైర్స్‌

పాకిస్థాన్‌ మాజీ ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌ కుమార్తె, పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ (ఎన్‌) ఉపాధ్యక్షురాలు మరియం నవాజ్‌ (50) ఇటీవల ఏ ప్రావిన్స్‌కు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు? (పాకిస్థాన్‌ చరిత్రలో ఒక ప్రావిన్స్‌కు సీఎంగా మహిళ పగ్గాలు చేపట్టడం ఇదే మొదటిసారి.)

Updated : 06 May 2024 01:21 IST

మాదిరి ప్రశ్నలు

  • పాకిస్థాన్‌ మాజీ ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌ కుమార్తె, పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ (ఎన్‌) ఉపాధ్యక్షురాలు మరియం నవాజ్‌ (50) ఇటీవల ఏ ప్రావిన్స్‌కు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు? (పాకిస్థాన్‌ చరిత్రలో ఒక ప్రావిన్స్‌కు సీఎంగా మహిళ పగ్గాలు చేపట్టడం ఇదే మొదటిసారి.)

జ:  పంజాబ్‌ ప్రావిన్స్‌

  • దిగ్గజ వ్యాపార సంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఇటీవల ప్రారంభించిన సమగ్ర జంతు సంరక్షణ, పునరావాస కేంద్రం పేరు ఏమిటి? (గాయపడిన జంతువులను రక్షించడం, చికిత్స అందించడం, వాటి సంరక్షణ, పునరావాసం కోసం ఏర్పాట్లు చేయడం దీని ముఖ్య ఉద్దేశం. గుజరాత్‌లోని జామ్‌నగర్‌ రిలయన్స్‌ రిఫైనరీ కాంప్లెక్స్‌ గ్రీన్‌బెల్ట్‌లో మూడు వేల ఎకరాల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేశారు. దీన్ని కృత్రిమ అడవిగా భావించవచ్చు. జంతువులు నివసించేందుకు సహజ రీతిలో వసతులు కల్పించారు. ఇందులో ఏనుగుల కోసం 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రత్యేక ఆసుపత్రిని ఏర్పాటు చేశారు.)

జ:  వంతారా

  • అవినీతి నిరోధక అంబుడ్స్‌మన్‌ లోక్‌పాల్‌ ఛైర్‌ పర్సన్‌గా ఇటీవల నియమితులైన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎవరు? (లోక్‌పాల్‌ జ్యుడీషియల్‌ సభ్యులుగా హైకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్‌ లింగప్ప నారాయణ స్వామి, జస్టిస్‌ సంజయ్‌ యాదవ్‌, జస్టిస్‌ రితురాజ్‌ అవస్థి, నాన్‌ జ్యుడీషియల్‌ సభ్యులుగా సునీల్‌ చంద్ర, పంకజ్‌ కుమార్‌, అజయ్‌ టిర్కేలు నియమితులయ్యారు. లోక్‌పాల్‌ ఛైర్‌పర్సన్‌, సభ్యుల పదవీ కాలం అయిదేళ్లు లేదా 70 ఏళ్ల వయసు వరకు ఉంటుంది.)

జ:  జస్టిస్‌ ఏఎం ఖాన్విల్కర్‌



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని