కరెంట్‌ అఫైర్స్‌

బ్రిటన్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక ‘నైట్‌ ఆఫ్‌ ద ఆర్డర్‌ ఆఫ్‌ ద బ్రిటిష్‌ ఎంపైర్‌ (కేబీఈ)’ అవార్డును ఇటీవల ఎవరికి ప్రదానం చేసింది?

Published : 07 May 2024 00:28 IST

మాదిరి ప్రశ్నలు

  • బ్రిటన్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక ‘నైట్‌ ఆఫ్‌ ద ఆర్డర్‌ ఆఫ్‌ ద బ్రిటిష్‌ ఎంపైర్‌ (కేబీఈ)’ అవార్డును ఇటీవల ఎవరికి ప్రదానం చేసింది? (ఎలిజబెత్‌ రాణి మరణం తర్వాత బ్రిటన్‌ రాజ సింహాసనాన్ని అధిరోహించిన ఛార్లెస్‌-3 నుంచి ఈ అవార్డును అందుకున్న తొలి భారతీయుడిగా ఈ భారతీయ టెలికాం రంగ దిగ్గజ పారిశ్రామిక వేత్త రికార్డు సృష్టించారు. బ్రిటన్‌, భారత్‌ వాణిజ్య సంబంధాల బలోపేతానికి చేసిన కృషికి యూకే ప్రభుత్వం ఈ ప్రతిష్ఠాత్మక నైట్‌హుడ్‌ కమాండర్‌ పురస్కారంతో ఈయన్ను సత్కరించింది. బ్రిటన్‌ ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారాల్లో ఇదొకటి. గౌరవార్థం విదేశీయులకూ దీన్ని ప్రకటిస్తారు.)

జ: సునీల్‌ భారతి మిత్తల్‌

  • ‘భారత్‌లో చిరుతల స్థితిగతులు-2022’ పేరిట కేంద్రం ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలో 2022 నాటికి చిరుత పులుల సంఖ్య ఎంత? (2018లో భారత్‌లో చిరుతల సంఖ్య 12,852. వీటి సంఖ్యలో మధ్యప్రదేశ్‌ అగ్రస్థానంలో నిలిచింది. అక్కడ 3,907 చిరుతలున్నట్లు తేలింది. తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర (1,985), కర్ణాటక (1,879) నిలిచాయి. మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 486 చిరుతలు పెరిగాయి. శాతాల పరంగా చూసుకుంటే ఏకంగా 282 శాతం పెరుగుదలతో   అరుణాచల్‌ప్రదేశ్‌ టాప్‌లో నిలిచింది.)

జ: 13,874

  • వార్తా పత్రికలు, మ్యాగజైన్ల రిజిస్ట్రేషన్లకు సంబంధించి కొత్త చట్టం ‘ప్రెస్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ పీరియాడికల్స్‌ చట్టం-2023’ ఏ రోజు నుంచి అమల్లోకి వచ్చింది?

జ: 2024, మార్చి 1


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని