IBPS Jobs alert: ఆగస్టు 28తో లాస్ట్‌.. 4,451 ఉద్యోగాలకు అప్లై చేశారా?

IBPS Jobs Online applications: పలు బ్యాంకుల్లో 4వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల గడువు ఆగస్టు 28తో ముగియనుంది. అర్హులైన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి.

Published : 27 Aug 2023 21:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలోని పలు బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీకి (IBPS Recruitment) IBPS దరఖాస్తుల గడువు ముగుస్తోంది. మొత్తం 11 ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 3049 ప్రొబేషనరీ ఆఫీసర్‌/మేనేజ్‌మెంట్‌ ట్రైనీ, వేర్వేరు విభాగాల్లోని 1402 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు 28తో ముగియనుంది. మొత్తం 4,451 పోస్టులకు తొలుత ఆగస్టు 1 నుంచి 21వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించగా.. ఇటీవల మరో వారం రోజుల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ గడువు సైతం సోమవారంతో ముగియనుంది. ఆసక్తి కలిగిన అర్హులైన వారు వెంటనే దరఖాస్తు చేసుకోండి.

ప్రభుత్వ బ్యాంకుల్లో 4,451 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్లు

పోస్టులు భర్తీ చేసే బ్యాంకులివే.. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, కెనరా బ్యాంక్‌, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌, యూకో బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, ఇండియన్‌ బ్యాంక్‌, పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌

పీవో పోస్టులకు అప్లై చేసేందుకు క్లిక్‌ చేయండి

స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులకు అప్లై చేసేందుకు క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు