IBPS recruitment: ఉద్యోగార్థులకు అలర్ట్‌.. ఐబీపీఎస్‌ క్లర్క్‌ ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్‌!

IBPS clerk jobs recruitment: ప్రభుత్వరంగ బ్యాంకుల్లో క్లర్కు పోస్టుల భర్తీకి ఐబీపీఎస్‌ త్వరలోనే నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది.

Updated : 29 Jun 2023 17:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బ్యాంకు ఉద్యోగాల(Bank Jobs) కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.  2024-25 ఏడాదికి సంబంధించి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సన‌ల్ సెల‌క్షన్ (IBPS) క్లర్కు పోస్టులను కామ‌న్ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్(CRP)-XIII ద్వారా భర్తీ చేసేందుకు సిద్ధమవుతోంది. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న క్లర్క్‌ పోస్టుల్ని(Clerk posts) ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేసేందుకు వీలుగా ఐబీపీఎస్‌(IBPS) తాజాగా ఓ షార్ట్‌ నోటీసును విడుదల చేసింది. అయితే, ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారు? అర్హతలేంటి? వేతనం ఎంత తదితర వివరాలన్నీ నోటిఫికేషన్‌ విడుదలయ్యాకే తెలియనున్నాయి. ఈ ఉద్యోగాలకు ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాల కోసం ఎప్పటికప్పుడు ibps అధికారిక వెబ్‌సైట్‌ను చెక్‌చేసుకోవాలని నోటీస్‌లో పేర్కొంది.

ఆగస్టులో ప్రిలిమ్స్‌.. అక్టోబర్‌లో మెయిన్స్‌ పరీక్ష!

ఐబీపీఎస్‌ క్లర్కు పోస్టులకు జులై 1 నుంచి జులై 21 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుం చెల్లింపునకు ఆఖరి తేదీ జులై 21.  క్లర్కు పోస్టుల భర్తీకి ప్రిలిమినరీ పరీక్ష ఆగస్టు/సెప్టెంబర్‌లో జరిగే అవకాశం ఉంది. అడ్మిట్‌ కార్డులు కూడా సెప్టెంబర్‌లోనే విడుదల చేస్తారు. ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ పరీక్ష సెప్టెంబర్‌/అక్టోబర్‌లో జరిగే అవకాశం ఉంది. అలాగే, ఆన్‌లైన్‌ మెయిన్‌ పరీక్షకు కాల్‌ లెటర్లు సెప్టెంబర్‌/అక్టోబర్‌లో విడుదల చేసి..  ఆన్‌లైన్‌ మెయిన్‌ పరీక్ష అక్టోబర్‌లో నిర్వహించే అవకాశం ఉంది. ప్రొవిజినల్‌ అలాట్‌మెంట్‌ మాత్రం వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి పూర్తి చేస్తారు. క్లర్క్‌ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్‌ గతంలో విడుదల చేసిన క్యాలెండర్‌ ప్రకారం చూస్తే.. ప్రిలిమినరీ పరీక్ష ఆగస్టు 26, 27, సెప్టెంబర్‌ 2 తేదీల్లో; మెయిన్‌ పరీక్షను అక్టోబర్‌ 7న నిర్వహించే అవకాశం ఉంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని