AIIMS Jobs: ఎయిమ్స్‌లలో 3,055 ఉద్యోగాలు.. తెలుగు రాష్ట్రాల్లో పోస్టులు ఎన్నంటే?

దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్‌లలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు మే 5వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు.

Updated : 13 Apr 2023 19:04 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(AIIMS)లలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. మొత్తం 3,055 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులను నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నార్‌సెట్‌)- 4 ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు మే 5వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుందని దిల్లీ ఎయిమ్స్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

ఆన్‌లైన్‌ దరఖాస్తుల కోసం క్లిక్‌ చేయండి

ఖాళీలు, అర్హతలు..ఇతర ముఖ్యాంశాలివే.. 

  • మొత్తం ఖాళీలు 3055 ఉండగా.. వీటిలో హైదరాబాద్‌లోని బీబీనగర్‌ ఎయిమ్స్‌ (150); ఏపీలోని మంగళగిరి ఎయిమ్స్‌లో (117), ఎయిమ్స్‌ భటిండా- 142; ఎయిమ్స్‌ భోపాల్- 51; ఎయిమ్స్‌ భువనేశ్వర్- 169; ఎయిమ్స్‌ బిలాస్‌పూర్- 178; ఎయిమ్స్‌ దేవ్‌ఘర్- 100; ఎయిమ్స్‌ గోరఖ్‌పూర్- 121; ఎయిమ్స్‌ జోధ్‌పూర్- 300;  ఎయిమ్స్‌ కల్యాణి- 24; ఎయిమ్స్‌ నాగ్‌పుర్- 87;  ఎయిమ్స్‌ రాయ్ బరేలీ- 77; ఎయిమ్స్‌ న్యూదిల్లీ- 620; ఎయిమ్స్‌ పట్నా- 200; ఎయిమ్స్‌ రాయ్‌పూర్- 150; ఎయిమ్స్‌ రాజ్‌కోట్- 100; ఎయిమ్స్‌ రిషికేశ్- 289; ఎయిమ్స్‌ విజయ్‌పూర్‌లో 180 చొప్పున ఖాళీలను భర్తీ చేయనున్నారు. 
  • డిప్లొమా(జీఎన్‌ఎం)తో పాటు రెండేళ్ల పాటు పనిచేసే అనుభవం లేదా బీఎస్సీ (ఆనర్స్‌) నర్సింగ్‌/బీఎస్సీ నర్సింగ్‌/బీఎస్సీ (పోస్ట్‌ సర్టిఫికేట్‌)/పోస్ట్‌-బేసిక్‌బీఎస్సీ నర్సింగ్‌ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతో పాటు స్టేట్‌/ఇండియన్‌ నర్సింగ్ కౌన్సిల్‌లో నర్సులుగా రిజిస్టరై ఉండాలి. 
  • వయోపరిమితి:  18-30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్లు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌లకు అయిదేళ్ల పాటు వయో సడలింపు ఉంటుంది. 
  • వేతనం: రూ.9300- రూ.34800తో పాటు రూ.4600 గ్రేడ్ పే అందుతుంది.
  • దరఖాస్తు రుసుం: జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.3000; ఎస్సీ/ ఎస్టీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.2400; పీడబ్ల్యూడీ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది.
  • ఎంపిక ప్రక్రియ: నార్‌సెట్‌-4లో సాధించిన స్కోరుతో పాటు  డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

పూర్తి నోటిఫికేషన్‌ ఇదే..


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని