TREIRB: తెలంగాణ గురుకులాల్లో 9,231 ఉద్యోగాలు.. వేతనం ఎంతంటే?

తెలంగాణ గురుకులాల్లో 9,231 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ మేరకు గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు 9 నోటిఫికేషన్లు జారీ చేసింది.

Updated : 06 Apr 2023 17:06 IST

హైదరాబాద్‌: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. రాష్ట్రంలోని గురుకులాల్లో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. మొత్తం 9,231 పోస్టులకు గాను గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు 9 నోటిఫికేషన్లను విడివిడిగా విడుదల చేసింది. డిగ్రీ కళాశాలల్లో 868 అధ్యాపక, ఫిజికల్‌ డైరెక్టర్‌, లైబ్రేరియన్‌ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. అలాగే, జూనియర్‌ కళాశాలల్లో 2,008 లెక్చరర్లు, పాఠశాలల్లో ,1276 పీజీటీ, 434 లైబ్రేరియన్‌, 275 ఫిజికల్‌ డైరెక్టర్‌, 134 ఆర్ట్స్‌, 92 క్రాఫ్ట్‌, 124 మ్యూజిక్‌, 4020 టీజీటీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు షార్ట్‌ నోటిఫికేషన్లలో పేర్కొంది. ఈ నెల 12 నుంచి వన్‌ టైం రిజిస్ట్రేషన్‌.. 17 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని కన్వీనర్‌ మల్లయ్య భట్టు తెలిపారు.

సాంఘిక సంక్షేమం(TSWREIS), గిరిజన సంక్షేమం(TTWREIS), మహాత్మా జ్యోతిబా ఫూలే వెనుకబడిన వర్గాల సంక్షేమ రెసిడెన్సియల్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ (MJPTBCWREIS)లకు వేర్వేరుగా ఉద్యోగ ఖాళీలకు సంబంధించి వయో పరిమితి, విద్యార్హత, ఇతర వివరాలతో పూర్తి నోటిఫికేషన్లు దరఖాస్తుల ప్రారంభమైన రోజు నుంచి తమ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.  అయితే, ఈ కిందపేర్కొన్న పోస్టుల సంఖ్యలో హెచ్చుతగ్గులు ఉండొచ్చని తెలిపింది.  పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత మొత్తం వివరాలపై ఓ స్పష్టత  రానుంది. సొసైటీల వారీగా పోస్టుల వివరాల కోసం క్లిక్‌ చేయండి 

  • గ్రాడ్యుయేషన్‌ టీచర్‌ పోస్టులు 4,020 ఉండగా.. ఈ నెల 28 నుంచి మే 27వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. వేతన స్కేలు రూ.42,300 నుంచి రూ.1,15,270వరకు ఉండనుంది.
  • డిగ్రీ కళాశాలల్లో మొత్తం 868 పోస్టులకు గాను వేతనం రూ.54,220 నుంచి రూ.1,33,630లుగా ఉంటుందని పేర్కొంది. వయో పరిమితి, పోస్టుల వారీగా వేతనం, కమ్యూనిటీ, విద్యార్హతలు, ఇతర వివరాలతో ఈ నెల 17న పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్టు వెబ్‌నోట్‌లో తెలిపింది. ఈ నెల 17 నుంచి మే 17వరకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించనున్నట్టు వెల్లడించింది.
  • అలాగే జూనియర్ కళాలల్లో ౨౦౦౮ పోస్టులకు (జూనియరల్‌ లెక్చరర్‌, ఫిజికల్‌ డైరెక్టర్‌/ లైబ్రేరియన్‌) వేతనం రూ.౫౪,౨౨౦ నుంచి రూ.౧,౩౩,౬౩౦వరకు ఉంటుందని తెలిపింది. ఆయా పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఈ నెల ౧౭ నుంచి మే ౧౭వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు చేసుకోవచ్చని కన్వీనర్‌ పేర్కొన్నారు.
  • పోస్టు గ్రాడ్యుయేషన్‌ టీచర్‌ ఉద్యోగాల్లో మొత్తం 1,276 పోస్టులకు ఏప్రిల్‌ 24 నుంచి మే 24వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరించనున్నారు. ఇందులో పోస్టులకు వేతనం రూ.45,960 నుంచి రూ.1,24,150గా ఉంటుందని పేర్కొన్నారు. 
  • ఈ మూడు గురుకుల సొసైటీల్లోని పాఠశాలల్లో 434 లైబ్రేరియన్‌ పోస్టులకు ఏప్రిల్‌ 24 నుంచి మే 24వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. వేతనం రూ.38,890 నుంచి 1,12,510గా ఉండనుంది. ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులు 275 ఉండగా.. వీటికి కూడా పైతేదీల్లోనే దరఖాస్తులు స్వీకరించనున్నారు. వేతనం రూ.42,300 నుంచి 1,15,270 మధ్య ఉండనుంది. ఆర్ట్‌ టీచర్‌, డ్రాయింగ్‌ టీచర్‌ (134) పోస్టులు ఉండగా.. క్రాఫ్ట్‌ టీచర్‌, క్రాఫ్ట్‌ ఇన్‌స్ట్రక్టర్‌ పోస్టులు92 ఉన్నాయి. అలాగే, మ్యూజిక్‌ టీచర్‌ పోస్టులు 124 ఉన్నాయి. 

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని