RBI Recruitment: ఆర్‌బీఐలో అసిస్టెంట్‌ పోస్టులు.. ప్రిలిమ్స్‌ కాల్‌ లెటర్లు విడుదల

ఆర్‌బీఐలో అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి ప్రిలిమినరీ పరీక్ష కాల్ లెటర్లు విడుదలయ్యాయి. ఈ కింది లింక్‌పై క్లిక్‌ చేసి అభ్యర్థులు కాల్‌లెటర్లు పొందొచ్చు.

Published : 07 Nov 2023 17:41 IST

దిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)లో 450 అసిస్టెంట్ ఉద్యోగ నియామక రాత పరీక్షకు కాల్‌లెటర్లు విడుదలయ్యాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌ను ఎంటర్‌ చేసి కాల్‌లెటర్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని అధికారులు తెలిపారు. నవంబర్‌ 7 నుంచి 19వ తేదీ వరకు కాల్‌ లెటర్లు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండనున్నాయి. ప్రిలిమ్స్‌ పరీక్ష నవంబర్‌ 18, 19 తేదీల్లో, మెయిన్స్‌ పరీక్ష డిసెంబర్‌ 31న జరగనుంది. తొలుత ప్రిలిమ్స్‌ పరీక్షను అక్టోబర్‌ 21న నిర్వహంచాలని నిర్ణయించినప్పటికీ ఇటీవల తేదీలో మార్పు చేశారు. ప్రిలిమ్స్‌ పరీక్షకు గడువు సమీపిస్తుండటంతో కాల్‌ లెటర్లు విడుదల చేశారు. 

కాల్‌ లెటర్ల కోసం క్లిక్‌ చేయండి

ముంబయిలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్‌ బోర్డు- దేశవ్యాప్తంగా ఆర్‌బీఐ శాఖల్లో డిగ్రీ అర్హతతో 450 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల కోసం సెప్టెంబర్‌ 13 నుంచి అక్టోబర్‌ 4వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు.  ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఆర్‌బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు