APPLY NOW: 8,700కు పైగా ఉద్యోగాలు.. దరఖాస్తుల గడువు పొడిగింపు

దేశంలో అతి పెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్‌బీఐలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి దరఖాస్తులకు తుది గడువును పొడిగించారు. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్‌ 10వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Updated : 08 Dec 2023 15:24 IST

SBI Junior Associate Jobs| ఇంటర్నెట్‌ డెస్క్‌:  దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(SBI)లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల గడువును పొడిగించారు. వాస్తవానికి దరఖాస్తుల గడువు డిసెంబర్‌ 7తోనే ముగిసింది. అయితే, ఆసక్తి ఉండి దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఆ గడువును SBI పొడిగించింది. వివిధ సర్కిళ్లలో మొత్తం 8,773  ఉద్యోగాలకు అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్థులు  డిసెంబర్‌ 10వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.

ఎస్‌బీఐలో మొత్తం 8,773 (రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌ ఖాళీలు కలిపి) జూనియర్‌ అసోసియేట్‌ (కస్టమర్‌ సపోర్ట్‌ & సేల్స్‌) ఉద్యోగాలను భర్తీ చేస్తుండగా.. వీటిలో తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 600 ఖాళీలు ఉన్న విషయం తెలిసిందే. డిగ్రీ అర్హతతో భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు ప్రిలిమినరీ, మెయిన్‌ ఆన్‌లైన్‌ పరీక్షతో పాటు పాటు స్థానిక భాష పరీక్ష ఆధారంగా ఎంపిక చేయనున్నారు. వేతనం, వయో పరిమితి, పరీక్ష కేంద్రాలు తదితర వివరాల కోసం క్లిక్‌ చేయండి.

దరఖాస్తుల కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని