RRC Secunderabad: దక్షిణ మధ్య రైల్వే.. గ్రూప్-డి తుది ఫలితాల కోసం క్లిక్ చేయండి
దక్షిణ మధ్య రైల్వే(south central railway) పరిధిలో గ్రూప్-డి(లెవెల్-1) ఉద్యోగ నియామక పరీక్ష తుది ఫలితాలు వెలువడ్డాయి.
సికింద్రాబాద్: దక్షిణ మధ్య రైల్వే(south central railway) పరిధిలో గ్రూప్-డి(లెవెల్-1) ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పరీక్షల తుది ఫలితాలు(exam final results) వెలువడ్డాయి. ఈ మేరకు సికింద్రాబాద్ రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్(RRC) అధికారిక ప్రకటన విడుదల చేసింది. లెవెల్-1 ఖాళీల భర్తీకి సంబంధించి గతేడాది ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 11 మధ్యకాలంలో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. అందులో అర్హత సాధించిన అభ్యర్థులకు జనవరి 12 నుంచి 22 వరకు ఫిజికల్ ఎఫిషియెన్సీ పరీక్ష నిర్వహించింది. అనంతరం ఫిబ్రవరి 7 నుంచి 13 వరకు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్స్‌ను పూర్తిచేసి మొత్తం 7,305మందితో అభ్యర్థుల తుది జాబితాను తాజాగా విడుదల చేసింది. దీంట్లో స్టోర్, డీజిల్, ఎలక్ట్రికల్, వర్క్‌షాప్ తదితర విభాగాల్లో అసిస్టెంట్, అసిస్టెంట్ లోకో పైలట్, అసిస్టెంట్ వర్క్స్, పాయింట్స్‌మెన్ తదితర పోస్టులకు ఎంపికైన వారి నంబర్లు ఉన్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Weather Report: తెలంగాణలో రాగల 3రోజులు మోస్తరు వర్షాలు
-
Sports News
MS Dhoni: ‘ధోనీ అంటే కేవలం లీడర్ మాత్రమే కాదు.. ఓ ఎమోషన్’
-
Politics News
Harishrao: రాష్ట్రంలోని ప్రతిపక్షాలు ప్రకృతి వైపరీత్యాల కంటే డేంజర్: మంత్రి హరీశ్‌రావు
-
World News
China: బోయింగ్, ఎయిర్‌బస్‌కు పోటీగా చైనా ప్యాసింజర్ విమానం..!
-
India News
wrestlers Protest: పార్లమెంట్ వైపు దూసుకెళ్లిన రెజ్లర్ల నిర్బంధం.. దిల్లీలో ఉద్రిక్తత!
-
Movies News
Shaakuntalam: ‘కేన్స్’లో శాకుంతలం మెరుపులు.. స్పందించిన సమంత