Samantha: సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు

సమంత (Samantha) ఒక ఫొటో షేర్‌ చేసి డిలీట్‌ చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

Updated : 06 May 2024 13:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్టార్‌ హీరోయిన్‌ సమంత (Samantha) ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అప్‌డేట్స్‌ పంచుకుంటుంటారు. తాజాగా ఆమె షేర్‌ చేసిన ఫొటోపై నెట్టింట రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు దీనిపై ఆమె ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మయోసైటిస్‌కు చికిత్స తీసుకుంటున్నట్లు తెలుపుతూ సమంత తన ఇన్‌స్టా స్టోరీలో ఒక ఫొటో షేర్‌ చేశారు. ‘వైద్యాన్ని కొనసాగిస్తూ కోలుకోవడానికి ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నా’ అనే క్యాప్షన్‌ పెట్టారు. అయితే ఈ ఫొటోతో పాటు సమంత మరొకటి కూడా షేర్‌ చేసి డిలీట్‌ చేశారని. ఒక ఫేక్‌ ఫొటో సోషల్‌ మీడియాలో షేర్‌ అవుతోంది. అందులో ఆమె హాఫ్‌న్యూడ్‌గా ఉండడంతో ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు సమంత అలాంటి ఫొటో షేర్‌ చేయలేదని.. కావాలనే ఫేక్‌ ఫొటో క్రియేట్‌ చేసి దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో సమంత ఇన్‌స్టాలో పెట్టిన కొటేషన్‌ కూడా ఆసక్తికరంగా మారింది. ‘‘మిమ్మల్ని మీరు సమర్థించుకోవడం లేదా నిరూపించుకోవాల్సిన అవసరం లేకుండా జీవించగలగడమే నిజమైన విజయం’’ అనే కొటేషన్‌ను పంచుకున్నారు. దీంతో సామ్‌ దీన్ని ఆ ప్రచారానికి ఫుల్‌స్టాప్‌ పెట్టడం కోసమే షేర్‌ చేసినట్లు తెలుస్తోంది.

ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. థియేటర్‌/ఓటీటీ చిత్రాలివే!

ఇక కొన్ని నెలల పాటు సినిమాలకు దూరంగా ఉన్న సమంత తాజాగా కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ఆమె సొంత నిర్మాణ సంస్థ ‘ట్రాలాలా మూవింగ్‌ పిక్చర్స్‌’పై ‘మా ఇంటి బంగారం’ పేరుతో ఇది రానుంది. ఇటీవల దీనికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ ను ఆమె పంచుకున్నారు. ఈ సినిమా దర్శకుడు ఎవరు? ఇతరత్రా విషయాలు తెలియాల్సి ఉంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని